అన్వేషించండి

Chiranjeevi-Samantha: 'ఈ సవాల్ ను నువ్ అధిగమిస్తావ్' - సమంతకు ధైర్యం చెప్పిన మెగాస్టార్!

సమంత అనారోగ్యంపై చిరంజీవి స్పందించారు.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత.. కొన్నాళ్లుగా చాలా సైలెంట్ గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కూడా పెట్టడం లేదు. బయట కూడా ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఏమైందా..? అని టెన్షన్ పడ్డారు. ఆమె స్కిన్ డిసీజ్ తో బాధ పడుతుందని.. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తుందని.. ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ సమంత వాటిపై స్పందించలేదు. ఎట్టకేలకు సోషల్ మీడియా ద్వారా తనకేం జరిగిందో వెల్లడించింది సమంత.

కొన్ని నెలలుగా మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ తో బాధపడుతున్నట్లు వెల్లడించింది సమంత. ఈ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత అందరికీ విషయం చెప్పాలనుకున్నానని కానీ తను అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుందని తెలిపింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సమంత త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

సెలబ్రిటీలు సైతం సమంతకు ధైర్యం చెబుతూ కొన్ని పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, నాని, రామ్ పోతినేని, రాశిఖన్నా ఇలా చాలా మంది సమంత కోసం పోస్ట్ లు పెట్టారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. సమంత అనారోగ్యంపై రియాక్ట్ అయ్యారు. 'డియర్ సామ్' అంటూ ఆమెకి ధైర్యం చెబుతూ కొన్ని లైన్స్ రాశారు. 

Megastar Chiranjeevi's Inspiring words to Samantha:''మన జీవితాల్లో కాలానుగుణంగా సవాళ్లు ఎదురవుతుంటాయి. బహుశా మనలోని శక్తిని వెలికితీయడానికి ఇలాంటి సవాళ్లు ఉపకరిస్తుంటాయి. నువ్వు ఎంతో ఆత్మస్థైర్యం ఉన్న అద్భుతమైన అమ్మాయివి. ఈ సవాల్ ను కూడా నువ్ అధిగమించగలవని నేను కచ్చితంగా చెప్పగలను. ఈ కష్ట సమయంలో నువ్ ధైర్యంగా, దృఢవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దైవశక్తి కూడా నీ వెన్నంటే ఉంటుంది'' అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. ఇది చూసిన సామ్.. చిరుకి థాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చింది. 

ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె నటించిన 'యశోద' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను హరి, హరీష్ అనే దర్శకులు తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్(Sridevi Movies) బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. నవంబర్ 11న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో గర్భవతి రోల్ చేశారు సమంత. రీసెంట్ గా విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ లో సరోగసీ అంశంతో పాటు రాజకీయం, మర్డర్ మిస్టరీ, ప్రమాదం అంచున ఓ మహిళ చేసే పోరాటాన్ని చూపించారు. దీంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. 

Also Read : మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

టాప్ హెడ్ లైన్స్

Varanasi Plot : వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?
వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Suhasini: వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Sambarala Yeti Gattu: సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget