అన్వేషించండి

Bholaa Shankar Teaser: ‘షికారుకొచ్చిన షేర్‌ని బే’ - మెగాస్టార్ మాస్‌తో భోళా శంకర్ టీజర్!

మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ టీజర్ రిలీజ్ అయింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా ఆగస్టు 11వ తేదీన విడుదల కానుంది. మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

టీజర్ ఎలా ఉంది?
ఇక టీజర్ విషయానికి వస్తే... ఒకే వ్యక్తి 33 మందిని చంపడం గురించి విలన్స్ మాట్లాడుకుంటూ ఉండగా టీజర్ ప్రారంభం అవుతుంది. వారిని మెగాస్టారే చంపారని ప్రారంభంలోనే రివీల్ చేస్తారు. ఒక గోడౌన్‌లో ఉన్న రౌడీలతో ఫైట్ చేయడానికి మెగాస్టార్ వస్తారు. అప్పుడు రౌడీల్లో ఒకడు ‘కౌన్ హై తూ’ అని అడిగినప్పుడు చిరంజీవి తన స్టైల్లో ‘షికారుకొచ్చిన షేర్‌ని బే’ అని మాస్ పంచ్ డైలాగ్ వేస్తారు.

మెగాస్టార్ ఫైట్స్, డ్యాన్స్, కామెడీ టైమింగ్ అన్నిటినీ టీజర్‌లో కాస్త రివీల్ చేశారు. దీంతో పాటు తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్‌లు కూడా టీజర్‌లో కనిపిస్తారు. విలన్స్‌ను ఘోరంగా చంపే సన్నివేశాలు కూడా ఉన్నాయి కాబట్టి అవుట్ అండ్ అవుట్ కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని అనుకోవచ్చు. మెగా ఫ్యాన్స్‌కు తన మీద ఉన్న అనుమానాలు పోయేలా బ్లాక్‌బస్టర్ టీజర్‌ను మెహర్ రమేష్ కట్ చేశారు.

ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ 'భోళా మేనియా'ను కూడా ఇటీవలే విడుదల చేశారు. ఈ 'భోళా మేనియా' పాటను రాక్ స్టార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేశారు. 'మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో పాటను విడుదల చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా సోదరుడు మహతి స్వర సాగర్ కు ఈ పాట పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను. తమ్ముడూ... జస్ట్ డూ కుమ్ముడు' అని దేవి శ్రీ ప్రసాద్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

'థాంక్యూ తమ్ముడు... ఈ పాట 'అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు' కంటే రెట్టింపు హిట్ అవుతుందని ఆశిస్తున్నాను' అని దానికి రిప్లై‌గా చిరంజీవి ట్వీట్ చేశారు. 'భోళా మేనియా' పాట విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్‌కు కూడా ఆయన థాంక్స్ చెప్పారు. 

ప్రముఖ తెలుగు నిర్మాత కె. ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ‘భోళా శంకర్’ను నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కూడా ‘భోళా శంకర్’ సినిమాలో కీలక పాత్ర పోస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi Kaaka : మరోసారి చిరు లీక్స్ - 'కాకా'కు కదిరికి లింక్ ఏంటో చెప్పేసిన మెగాస్టార్... ఫ్యాన్స్ వెయిటింగ్
మరోసారి చిరు లీక్స్ - 'కాకా'కు కదిరికి లింక్ ఏంటో చెప్పేసిన మెగాస్టార్... ఫ్యాన్స్ వెయిటింగ్
Samavarthi Teaser Review : టైగర్ వర్సెస్ మహాదేవ్ - 'సమవర్తి'లో సత్యదేవ్ పవర్ ఫుల్ రోల్‌... డోంట్ మిస్ దిస్ అడ్వెంచరస్ యాక్షన్
టైగర్ వర్సెస్ మహాదేవ్ - 'సమవర్తి'లో సత్యదేవ్ పవర్ ఫుల్ రోల్‌... డోంట్ మిస్ దిస్ అడ్వెంచరస్ యాక్షన్
The Paradise : 'ఒక్కడి ఫేస్‌లోనూ నవ్వు లేదు' - ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్స్... నాని, శ్రీకాంత్ ఓదెల ఇచ్చి పడేశారుగా...
'ఒక్కడి ఫేస్‌లోనూ నవ్వు లేదు' - ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్స్... నాని, శ్రీకాంత్ ఓదెల ఇచ్చి పడేశారుగా...
Sandeep Reddy Vanga : వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్ రెడ్డి వంగా - సీఎం రేవంత్ 'స్పిరిట్' రిప్లై... డైరెక్టర్ వెరీ హ్యాపీ
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్ రెడ్డి వంగా - సీఎం రేవంత్ 'స్పిరిట్' రిప్లై... డైరెక్టర్ వెరీ హ్యాపీ

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
iPhone Voice Control: 'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
US Iran War Code 100: అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!
అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!
Embed widget