అన్వేషించండి

Maya Bazaar For Sale: ఓటీటీలో దగ్గుబాటి రానా ‘మాయాబజార్ ఫర్ సేల్’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ‘మాయా బజార్ ఫర్ సేల్’ అనే వెబ్ సిరీస్ రానుంది. గేటెడ్ కమ్యూనిటీలలో ఉండే కుటుంబాలలో ఉండే ఇంట్రస్టింగ్ అంశాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉండనున్నట్టు తెలుస్తోంది. 

Maya Bazaar For Sale: గత కొన్నేళ్లగా ఓటీటీల హవా జోరుగా సాగుతోంది. సినిమా థియేటర్లతో పోటీగా కొత్త కొత్త కంటెంట్ లను ప్రోత్సహించడంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ముందుంటోంది. దీంతో ఓటీటీ వేదికగా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మేకర్స్ కూడా ఓటీటీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త కంటెంట్ ను రెడీ చేస్తున్నారు. తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ‘మాయా బజార్ ఫర్ సేల్’ అనే వెబ్ సిరీస్ రానుంది. గేటెడ్ కమ్యూనిటీలలో ఉండే కుటుంబాలలో ఉండే ఇంట్రస్టింగ్ అంశాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉండనున్నట్టు తెలుస్తోంది. 

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యానర్ సహకారంతో..

భారతదేశంలో ఉన్న ప్రముఖ వెబ్ సిరీస్ లలో జీ5 కూడా ఒకటి. ప్రేక్షకుల అభిలాషకు తగ్గట్టు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ ను అలరిస్తోన్న ఈ సంస్థ ఇప్పుడు మరో వెబ్ సిరీస్ ను ఓటీటీ లవర్స్ కోసం తీసుకురానుంది. ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే వెబ్ సిరీస్ ను టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటికి సంబంధించిన ‘స్పిరిట్ మీడియా బ్యానర్’ తో కలసి రూపొందిస్తోంది జీ5. రానా దగ్గుబాటి ఓ వైపు సినిమాలు చేస్తూనే, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారానే ఈ వెబ్ సిరీస్ కు సహ నిర్మాతగా వ్యవహరించారు రానా. గౌతమి చల్లగుల్ల ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తోంది. ఇందులో నవదీప్, ఈషా రెబ్బా, హరితేజ, నరేష్ విజయ్ కుమార్, ఝాన్సీ లక్ష్మీ, కోట శ్రీనివాసరావు, మియాంగ్ చంగ్, సునైన పలువురు ప్రధాన పాత్రల్లో నటించారు. 

గేటెడ్ కమ్యూనిటీ కుటుంబాల కథతో..

ఓటీటీలు వచ్చిన తర్వాత కొత్త టాలెంట్ కు చాలా అవకాశాలు వస్తున్నాయి. విభిన్నమైన కథలతో తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిందే ఈ ‘మాయాబజార్ ఫర్ సేల్’. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే.. ఓ గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని కుటుంబాలు హాయిగా నివాసం ఉంటారు. అయితే ఆ గేటెడ్ కమ్యూనిటీ అక్రమ నిర్మాణం అని, దాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం చెబుతుంది. అందుకోసం కూల్చివేత యంత్రాలను కూడా పంపుతుంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలు ఆ పరిస్థితులన్ని ఎలా ఎదుర్కున్నాయి. ఆ సమస్యను వాళ్లు ఎలా పరిష్కరించుకున్నారు అనేది సిరీస్ లో చూడొచ్చు. ప్రత్యేకంగా మోడరన్ సొసైటీలో ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నాయి? సామాజిక జీవన విధానం ఎలా ఉంటుందనే కోణంలో సైటరికల్ గా ఈ సిరీస్ తెరకెక్కించారట మేకర్స్. ఈ సిరీస్ చూస్తే ప్రతి ఒక్కరూ తమని తాము ఊహించుకుంటారని, కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ అందరికీ నచ్చుతుందని చెబుతున్నారు మేకర్స్. అయితే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియన్స్ ను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. రాజీవ్ రంజన్ నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ జూలై 14 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: విజయ్ ఆంటోనీ ‘హత్య’కు డేట్ ఫిక్స్ - మరీ ఇంత స్పీడా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

టాప్ హెడ్ లైన్స్

Goodachari 2 First Review : అడివి శేష్ గూఢచారి 2 ఓ అద్భుతం - స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ రివ్యూ
అడివి శేష్ గూఢచారి 2 ఓ అద్భుతం - స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ రివ్యూ
January 12 Vidudala Movie : వెంకీ కల్యాణ్ రామ్, హీరోయిన్స్‌తో సాంగ్ - అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ వీడియోస్ లీక్
వెంకీ కల్యాణ్ రామ్, హీరోయిన్స్‌తో సాంగ్ - అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ వీడియోస్ లీక్
Gunde Ninda Gudigantalu September 5th: గుండె నిండా గుడిగంటలు: రోహిణికి ఇచ్చిపడేసిన శృతి.. వ్రతంలో కూర్చొవడానికి రోహిణి 'సోది' ప్లాన్! తల పట్టుకున్న ప్రభావతి!
గుండె నిండా గుడిగంటలు: రోహిణికి ఇచ్చిపడేసిన శృతి.. వ్రతంలో కూర్చొవడానికి రోహిణి 'సోది' ప్లాన్! తల పట్టుకున్న ప్రభావతి!
Nindu Noorella Saavasam Serial Today September 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలను టూర్ కు పంపించమన్న వార్డెన్ - భయంతో వణికిపోయిన భాగీ 
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలను టూర్ కు పంపించమన్న వార్డెన్ - భయంతో వణికిపోయిన భాగీ 

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Telangana Cabinet Expansion:తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
Iran War: సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Embed widget