అన్వేషించండి

Hatya Movie: విజయ్ ఆంటోనీ ‘హత్య’కు డేట్ ఫిక్స్ - మరీ ఇంత స్పీడా?

‘బిచ్చగాడు 2’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు విజయ్ ఆంటోనీ. ఈ సినిమా వచ్చి కొన్ని నెలలు కూడా గడవక ముందే మరో సినిమాను లైన్ లో పెట్టాడు విజయ్. ‘హత్య’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Hatya Movie: ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన అన్ని సినిమాలు దాదాపు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. రీసెంట్ గా తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకున్న ‘బిచ్చగాడు’ మూవీకు సీక్వెల్ గా ‘బిచ్చగాడు 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ ఆంటోనీ. ఈ  సినిమా టాలీవుడ్ లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ హీరో నుంచి తరువాత వచ్చే ప్రాజెక్టుపై తెలుగులోపూ ఆసక్తి నెలకొంది. ‘బిచ్చగాడు 2’ వచ్చి కొన్ని నెలలు కూడా గడవక ముందే మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విజయ్ ఆంటోనీ నటించిన రీసెంట్ మూవీ ‘హత్య’కు సంబంధించిన కొత్త అప్డేట్ ను రివీల్ చేశారు మేకర్స్. 

మర్డర్ మిస్టరీ చుట్టూ ‘హత్య’ సినిమా..

విజయ్ ఆంటోనీ సినిమాలు అన్ని చాలా విభిన్నంగా ఉంటాయి. అందుకే ఆయన నుంచి కొత్త సినిమా వస్తుంది అంటే తెలుగులోనూ ఆసక్తి నెలకొంటుంది.  ఇప్పుడు రాబోయే సినిమా కూడా అలాగే ఉంటుందని సినిమా పోస్టర్ ను చూస్తే తెలుస్తోంది. సినిమా టైటిల్ బట్టే ఇది ఒక మర్డర్ మిస్టరీ సినిమా అని అర్థమవుతుంది. ఓ గదిలో జరిగిన మర్డర్ చుట్టూ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ఎవరి కోసం ఎవర్ని చంపారు అనేది సినిమాలో చూడాల్సిందే. సినిమా పోస్టర్ లో విజయ్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ మూవీను జూలై 21 న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ తోపాటు రితికా సింగ్, మీనాక్షి చౌదరి, రాధిక శరత్ కుమార్, మురళీ శర్మ, జాన్ విజయ్ కీలక పాత్రలు పోషించారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. గిరీష్ సంగీతం అందించాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay Antony (@vijayantony)

‘విక్రమ్ రాథోడ్’ గా విజయ్ ఆంటోని..

విజయ్ ఆంటోని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే ‘బిచ్చగాడు 2’ ను తెలుగులో విడుదల చేసిన విజయ్ ‘హత్య’ తో పాటు మరో మూవీను రిలీజ్ కు రెడీగా పెట్టాడు. అదే విజయ్ ఆంటోనీ రీసెంట్ గా నటించిన ‘తమిళరాసన్’. ఈ సినిమాను తెలుగులో ‘విక్రమ్ రాథోడ్’ గా టైటిల్ పెట్టి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సబంధిచిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ సీరియస్ లుక్ లో కనిపించాడు. ఈ మూవీ కూడా త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా థ్రిల్లర్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ పోలీస్ పాత్రలో కనిపించారు. తమిళంలో ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాబు యోగిశ్వరన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సోనూసూద్‌, సురేష్ గోపి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందించారు.

Also Read: ఆ ఓటీటీలోకే శ్రీవిష్ణు ‘సామజవరగమన’ మూవీ!

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan Day 1 Collection : కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు సాలిడ్ నెంబర్స్
కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు సాలిడ్ నెంబర్స్
Peddi TV Premiere : టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!
టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Bhogi Egilivaranga Song : ఎగిలివారంగా లేసిన పల్లె పదం - నల్గొండ గద్దరన్న పాడిన భోగి పాట... ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ హార్ట్ టచింగ్ లిరిక్స్
ఎగిలివారంగా లేసిన పల్లె పదం - నల్గొండ గద్దరన్న పాడిన భోగి పాట... ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ హార్ట్ టచింగ్ లిరిక్స్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget