అన్వేషించండి

Ginna movie teaser:‘జిన్నా’ టీజర్: ఒక్క సినిమాలో ఇన్ని కోణాలా? అప్పులు తీరాలంటే లక్ష్మీ దేవి రావల్సిందే!

మంచు విష్ణు హీరోగా దర్శకుడు సూర్య తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'జిన్నా'. ఈ చిత్రంలో బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది.

టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘జిన్నా’. సినిమా టైటిల్ తోనే ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచడంలో సినిమా యూనిట్ సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ‘జిన్నా’ను పూర్తి స్థాయిలో యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనింగ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. చాలా కాలంగా సరైన హిట్ లేని మంచు విష్ణుకు ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. జిన్నా సినిమాలో అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పటికే రిలీజ్ చేసిన కొన్ని ఫోటోలు, ఆన్ లొకేషన్ వీడియోలు ఆడియెన్స్ లో  సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో పచ్చళ్ల స్వాతిగా నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ పాత్రను పరిచయం చేస్తూ ఇటీవలే ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇటీవల మూవీ నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. హీరోయిన్స్ తో ఉన్న సరికొత్త రొమాంటిక్ పోస్టర్ ను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

ఈ నేపథ్యంలో ‘జిన్నా’  సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచు విష్ణు క్యారెక్టర్ తెగ ఆకట్టుకుంది. హాట్ బ్యూటీలు సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ తమ అందచందాలతో కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ చూసి సినీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచిందని చెప్పుకోవచ్చు. టెంట్ హౌజ్‌కు ఓన‌ర్‌గా మంచు విష్ణు ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడు. జిన్నా టైంకు రావ‌డంతో పాటు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తుంటాడు అంటూ ఇందులో విష్ణు క్యారెక్ట‌ర్‌ను ఇంట్ర‌డ్యూస్ చేశారు. గాలి నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో మంచు విష్ణు క‌నిపించ‌నున్నాడు. ఏ ప‌ని చేయ‌కుండా.. ఊరంత అప్పులు చేస్తూ గ‌డుపుతున్నా విష్ణు లైఫ్‌లోకి సన్నీలియోని ఎంట్రీ ఇస్తుంది. అయితే సన్నీలియోనికు దెయ్యం ప‌ట్టిన‌ట్లు ఈ టీజర్ లో చూపించారు. ఆ దయ్యం కథ ఎలా ఉండబోతుంది? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ టీజర్ చూస్తుంటే మంచు విష్ణు ఖాతాలో హిట్ పడ్డట్లే కనిపిస్తోంది.  
 ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాను ద‌స‌రా సందర్భంగా.. అక్టోబ‌ర్ 5న‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

‘జిన్నా’ సినిమాకు సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. AVA ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జిన్నా సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందించారు. జి నాగేశ్వరరెడ్డి కథ రాశారు.  కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?

Also Read : 'రంగ రంగ వైభవంగా' రివ్యూ : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ నటించిన సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Maa Inti Bangaram 2 : రెండేళ్లలో మా ఇంటి బంగారం సీక్వెల్ - కన్ఫర్మ్ చేసిన రాజ్ నిడిమోరు
రెండేళ్లలో మా ఇంటి బంగారం సీక్వెల్ - కన్ఫర్మ్ చేసిన రాజ్ నిడిమోరు
Maa Inti Bangaram Collections Day 8: సెకండ్ వీకెండ్ కూడా కలెక్షన్స్ కుమ్ముడు... బాక్సాఫీస్‌లో సమంత బంగారానికి భారీ జంప్
సెకండ్ వీకెండ్ కూడా కలెక్షన్స్ కుమ్ముడు... బాక్సాఫీస్‌లో సమంత బంగారానికి భారీ జంప్
Bhavana Lasya: బుల్లితెరపై రాణిస్తోన్న తెలుగు ముద్దుగుమ్మ.. ఫస్ట్ సీరియల్‌తోనే టైటిల్ రోల్.. భావనా లాస్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై రాణిస్తోన్న తెలుగు ముద్దుగుమ్మ.. ఫస్ట్ సీరియల్‌తోనే టైటిల్ రోల్.. భావనా లాస్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Jagadhatri Serial Today June 26thజగధాత్రిని అక్కా అంటూ కౌగిలించుకున్న నిషిక...అక్కా చెల్లెల్ల మధ్య ప్రేమకు కారణమేంటి..?
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రిని అక్కా అంటూ కౌగిలించుకున్న నిషిక...అక్కా చెల్లెల్ల మధ్య ప్రేమకు కారణమేంటి..?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gade Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Weekly Horoscope: 28 జూన్ - 4 జూలై వారఫలాలు! మేషం నుంచి కన్య వరకు మీ అదృష్టం!
28 జూన్ - 4 జూలై వారఫలాలు! మేషం నుంచి కన్య వరకు మీ అదృష్టం!
Bangles History: మహిళలు చేతులకు గాజులు ధరించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? భారతీయ సంస్కృతిలో వాటి లోతైన చరిత్ర!
మహిళలు చేతులకు గాజులు ధరించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? భారతీయ సంస్కృతిలో వాటి లోతైన చరిత్ర!
Bhavana Lasya: బుల్లితెరపై రాణిస్తోన్న తెలుగు ముద్దుగుమ్మ.. ఫస్ట్ సీరియల్‌తోనే టైటిల్ రోల్.. భావనా లాస్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై రాణిస్తోన్న తెలుగు ముద్దుగుమ్మ.. ఫస్ట్ సీరియల్‌తోనే టైటిల్ రోల్.. భావనా లాస్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Khushbu Sundar Daughter Wedding: ఖుష్భూ కూతురి ఫస్ట్ పెళ్లి ఫోటో ఇదిగో... గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ - స్పెషల్ ఎట్రాక్షన్‌గా టాలీవుడ్ స్టార్స్
ఖుష్భూ కూతురి ఫస్ట్ పెళ్లి ఫోటో ఇదిగో... గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ - స్పెషల్ ఎట్రాక్షన్‌గా టాలీవుడ్ స్టార్స్
IND VS IRE 1ST 20 Result Update: వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
Embed widget