News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Manchu Vishnu New Movie : స్టార్ కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో విష్ణు మంచు సినిమా?

'జిన్నా' తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఢీ & ఢీ' చేయడానికి విష్ణు మంచు రెడీ అవుతున్నారు. ఆ సినిమా కాకుండా మరో సినిమా కూడా ఆయన ఓకే చేశారని ఇండస్ట్రీ టాక్.

FOLLOW US: 
Share:

విష్ణు మంచు (Manchu Vishnu) చేయబోయే కొత్త సినిమా ఏది? 'జిన్నా' తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తున్నారు? అంటే... ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. 'జిన్నా' సినిమాతో కొత్త దర్శకుడిని పరిచయం చేసిన మంచు విష్ణు... ఈసారి స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభు దేవా (Prabhu Deva) తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని టాక్.

విష్ణు అయితే బావుంటుందని...
విష్ణు మంచులో మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఫైట్స్ చేయడానికి అవసరమైన కటౌట్ ఉంది. క్యారెక్టర్‌కి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేయడానికి, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూపించడానికి రెడీగా ఉంటారు.  అందుకని, విష్ణును దృష్టిలో పెట్టుకుని ప్రభు దేవా ఓ కథ రెడీ చేశారట. ప్రస్తుతం డిస్కషన్స్ స్టేజిలో ఈ సినిమా ఉందని, త్వరలో మెటీరియలైజ్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్.

తెలుగులో ప్రభు దేవాది సక్సెస్ ట్రాక్!
తెలుగులో సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో  ప్రభు దేవా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత హిందీలో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ... తెలుగులో ప్రభాస్ హీరోగా 'పౌర్ణమి', చిరంజీవి హీరోగా 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ పరంగా ఆ రెండు సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. కానీ, విడుదలైన కొన్నాళ్ళకు యూట్యూబ్, టీవీలో ఆదరణ సొంతం చేసుకున్నాయి. టాలీవుడ్‌లో ప్రభు దేవాది సక్సెస్ ట్రాక్. సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత ఆయన తెలుగు సినిమా డైరెక్ట్ చేయనున్నారు.
 
శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఢీ అంటే ఢీ'
విష్ణు మంచు నటించిన 'జిన్నా' సినిమా గత నెలలో విడుదల అయ్యింది. దాని కంటే ముందు శ్రీను వైట్ల దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమా 'ఢీ'కి సీక్వెల్... 'ఢీ అంటే ఢీ' అనౌన్స్ చేశారు. 'జిన్నా' తర్వాత అది స్టార్ట్ అవుతుందని టాక్. ఒకవేళ అది ఆలస్యం అయితే ప్రభు దేవా సినిమా కూడా పట్టాలు ఎక్కువచ్చు. ఏమో... ఏదైనా జరగొచ్చు!

Also Read : ప్రభాస్ 'సాహో'లో సీన్స్ కాపీ చేసిన షారుఖ్ 'పఠాన్'?

మోహన్ బాబుతో 'ఆండ్రాయిడ్ కుంజప్పన్' రీమేక్!
హీరోగా, నిర్మాతగా విష్ణు మంచు వరుసగా సినిమాలు చేయడానికి ప్లాన్ చేశారు. ఏడు సినిమాల రీమేక్ రైట్స్ కొన్నట్టు సమాచారం. అందులో మోహన్ బాబు హీరోగా మలయాళ హిట్ 'ఆండ్రాయిడ్ కుంజప్పన్' రీమేక్ అనౌన్స్ చేశారు. అందులో మరో యంగ్ హీరోకి ఛాన్స్ ఉంది. ఆ రోల్ విష్ణు మంచు చేయడం లేదు. తెలుగులో యువ హీరోను తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ హీరో ఎవరు? ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించనున్నారు? అనేది త్వరలో వెల్లడించనున్నారు. 

ఇక నుంచి పాన్ ఇండియా సినిమాలు!?
విష్ణు మంచుకు హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ బాగా వస్తున్నాయి. 'జిన్నా'ను హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేశారు. అయితే... ఆశించిన రిజల్ట్ రాలేదు. అయినప్పటికీ... ఇక నుంచి చేయబోయే సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా విష్ణు మంచు ప్లాన్ చేస్తున్నారట. 

Published at : 03 Nov 2022 11:23 AM (IST) Tags: Manchu Vishnu Manchu Vishnu New Movie Prabhu Deva Prabhu Deva To Direct Vishnu

ఇవి కూడా చూడండి

Brahmamudi Serial December 11th Episode - బ్రహ్మముడి సీరియల్: కావ్యకు తెలీకుండా మరో అమ్మాయితో రాజ్ ప్రేమ ముచ్చట్లు!

Brahmamudi Serial December 11th Episode - బ్రహ్మముడి సీరియల్: కావ్యకు తెలీకుండా మరో అమ్మాయితో రాజ్ ప్రేమ ముచ్చట్లు!

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Nindu Noorella Saavasam December 11th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: అంజలిని ఫెయిల్ చేసేందుకు ప్రిన్సిపల్ ప్లాన్, మిస్సమ్మ తండ్రిని చూసేస్తుందా?

Nindu Noorella Saavasam December 11th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: అంజలిని ఫెయిల్ చేసేందుకు ప్రిన్సిపల్ ప్లాన్, మిస్సమ్మ తండ్రిని చూసేస్తుందా?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నుంచి శోభా శెట్టి ఔట్ - అమర్‌దీప్ వీడియో చూసి షాక్

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నుంచి శోభా శెట్టి ఔట్ - అమర్‌దీప్ వీడియో చూసి షాక్

Trinayani Serial December 11th Episode - 'త్రినయని' సీరియల్: తిలోత్తమ ప్లాన్ అట్టర్ ఫ్లాప్, ఇంతకాలం వీడియోలు పంపింది అతనే!

Trinayani Serial December 11th Episode - 'త్రినయని' సీరియల్: తిలోత్తమ ప్లాన్ అట్టర్ ఫ్లాప్, ఇంతకాలం వీడియోలు పంపింది అతనే!

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Investment In Mutual Funds: కేవలం రూ.250తో SIP స్టార్ట్‌ చేయొచ్చు, కొత్త ప్లాన్‌ తీసుకొస్తున్న సెబీ

Investment In Mutual Funds: కేవలం రూ.250తో SIP స్టార్ట్‌ చేయొచ్చు, కొత్త ప్లాన్‌ తీసుకొస్తున్న సెబీ