Malavika Mohanan: బాయ్ ఫ్రెండ్ అని చెప్పి మోసం చేస్తావా? మాళవికపై నెటిజన్ల ట్రోల్స్
'నీతోనే నా జీవితం, నిన్ను చూస్తేనే సంతోషంగా ఉంటుంది.. మనం బెస్ట్ పార్ట్నర్స్' ఇలా చాలా ఎమోషనల్ గా తన బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతున్నట్లు వీడియోలో కనిపించింది మాళవిక.

సౌత్ హీరోయిన్ మాళవిక మోహనన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇతడితోనే ప్రేమలో ఉన్నానంటూ వాలెంటైన్స్ డే రోజున ఆమె షేర్ చేసిన వీడియోపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తానని చెప్పి మోసం చేస్తావా..? అంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
'నీతోనే నా జీవితం, నిన్ను చూస్తేనే సంతోషంగా ఉంటుంది.. మనం బెస్ట్ పార్ట్నర్స్' ఇలా చాలా ఎమోషనల్ గా తన బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతున్నట్లు వీడియోలో కనిపించింది. తీరా పూర్తి వీడియో చూసిన తరువాత ఆమె స్కోడా కార్ కి సంబంధించిన కమర్షియల్ యాడ్ లో నటించిందని క్లారిటీ వచ్చింది. నిజంగానే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తుందనుకున్న ఫ్యాన్స్ ఈ వీడియో చూసే షాకయ్యారు.
దీంతో ఆమెని విమర్శిస్తున్నారు. ఎమోషన్స్ తో ఆడుకోకు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఫ్రెండ్ అంటూ మరో నెటిజన్ కామెంట్స్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవ్వడానికి కారణమేంటంటే.. ఇటీవల మాళవిక తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తానని ఓ వీడియో వదిలింది. తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాలంటే కచ్చితంగా తన వీడియోకి మిలియన్ వ్యూస్ రావాలని కండిషన్ పెట్టింది. నిజంగానే మాళవిక తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తుందని ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్ ఇప్పుడు తెగ హర్ట్ అయిపోతున్నారు.
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















