అన్వేషించండి

HBD Malavika Mohanan: వారియర్ రోల్‌లో అందాల భామ - మాళవిక మోహనన్ ‘తంగలాన్’ పోస్టర్ చూశారా?

‘తంగలాన్’ సినిమా నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ విడుదల అయింది.

Malavika Mohanan: మలయాళ భామ మాళవిక మోహనన్ పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న ‘తంగలాన్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. ఇందులో మాళవిక వారియర్ రోల్‌లో కనిపించనుందని ఈ పోస్టర్ చూసి తెలుసుకోవచ్చు. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

2013లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘పట్టం పోలే’ అనే మలయాళ సినిమాతో మాళవిక మోహనన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించిన మాళవిక మోహనన్... 2019లో ‘పేట’ సినిమాతో తమిళనాట కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆ వెంటనే దళపతి విజయ్ సరసన ‘మాస్టర్’, ధనుష్ సరసన ‘మారన్’ సినిమాల్లో నటించారు. మాళవిక నటించిన మలయాళ సినిమా ‘క్రిస్టీ’ ఈ సంవత్సరం విడుదల అయింది. కానీ ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం తమిళంలో ‘తంగలాన్’, హిందీలో ‘యుధ్ర’, తెలుగులో ప్రభాస్, మారుతిల సినిమాల్లో నటిస్తూ మాళవిక బిజీగా ఉన్నారు.

ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేయూ మోహనన్ కూతురే మాళవిక మోహనన్. హిందీలో ‘రయీస్’, ‘అంధాదున్’, ‘డాన్’, తెలుగులో ‘మహర్షి’ లాంటి భారీ సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. ప్రస్తుతం విజయ దేవరకొండ, పరశురామ్‌ల సినిమాకు కూడా ఆయనే సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇక 'తంగలాన్' విషయానికొస్తే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పా.రంజిత్ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)లోని కార్మికుల జీవితాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో చియాన్ విక్రమ్ సరసన మాళవిక మోహనన్, పార్వతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. చియాన్ విక్రమ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియా తో పాటు విదేశీ భాషల్లో 2డీ, 3డీలో విడుదలకు సిద్ధమవుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. 

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller Series OTT : అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Fauzi Heroine Birthday: 'ఫౌజీ' హీరోయిన్ బర్త్ డే... ప్రభాస్ ఎంత ఫుడ్ పంపించారో చూశారా?
'ఫౌజీ' హీరోయిన్ బర్త్ డే... ప్రభాస్ ఎంత ఫుడ్ పంపించారో చూశారా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget