అన్వేషించండి
Advertisement
Malaika Arora: మలైకా కారుకి యాక్సిడెంట్, గాయాలతో హాస్పిటల్ లో చేరిన నటి
బాలీవుడ్ ముద్దుగుమ్మ మలైకా అరోరా ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ కావడంతో ఆమెకి గాయాలయ్యాయి.
బాలీవుడ్ ముద్దుగుమ్మ మలైకా అరోరా ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ కావడంతో ఆమెకి గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పూణేలో ఓ ఫ్యాషన్ ఈవెంట్ హాజరవ్వడానికి కారులో పయనమైంది మలైకా. ముంబై నగరశివార్లలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ లో మలైకాకి చిన్న గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని.. మలైకా సోదరి అమ్రితా ఓ మీడియా పోర్టల్ కి వెల్లడించింది.
ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ వేలో ఈ యాక్సిడెంట్ జరిగిందని ఖోపోలి పోలీసులు వెల్లడించారు. మూడు కార్లు ఒకదానిపై మరొకటి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. మూడు కార్లకు డ్యామేజ్ అయిందని పోలీసులు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామని.. విచారణ మొదలుపెడతామని తెలిపారు పోలీసులు.
ఇక మలైకా విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె చేతుల్లో సినిమా అవకాశాలు లేవు కానీ కొన్ని టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అలానే తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తుంది. ఇద్దరి మధ్య పన్నెండేళ్ల తేడా ఉంది. అవేమీ పట్టించుకోకుండా ఈ జంట తమ లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. కానీ వీరి ప్రేమపై తరచూ ట్రోల్స్ వస్తుంటాయి.
Also Read: ప్రభాస్ 'ఊ' అంటాడా? 'ఊ ఊ' అంటాడా?
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
గాడ్జెట్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion