Major Movie: ‘నా కొడుకు చనిపోలేదు’ - ‘మేజర్’ మూవీ చూసి సందీప్ తండ్రి భావోద్వేగం
‘మేజర్’ సినిమా చూసి తర్వాత సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ‘మేజర్’ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.
![Major Movie: ‘నా కొడుకు చనిపోలేదు’ - ‘మేజర్’ మూవీ చూసి సందీప్ తండ్రి భావోద్వేగం Major Sandeep Unnikrishnan Parents emotional after watching Major Movie with Adavi Sesh Major Movie: ‘నా కొడుకు చనిపోలేదు’ - ‘మేజర్’ మూవీ చూసి సందీప్ తండ్రి భావోద్వేగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/03/30f699ccb963c81d6e4e920a2cf66b5f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అడవి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ మూవీ శుక్రవారం థియేటర్లో విడుదలైంది. 26/11 ముంబయి దాడుల్లో.. తన ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను రక్షించిన ఆర్మీ అధికారి సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది.
ఈ సినిమా చూసిన సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సందీప్ తండ్రి కె.ఉన్నికృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘సందీప్ జీవితం ఈ సినిమాలో ప్రతిబించింది. మేం ఏదైతే చూశాం, అనుభవించనది తెరపై చూశాం. ఇంత గొప్ప సినిమా తీసిన టీమ్‌ను అభినందిస్తున్నాం. ఈ సినిమా చూసి మా బాధను మరిచిపోయేలా చేసింది. సందీప్ చనిపోయాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ, అతడు తుది శ్వాస వరకు ప్రజల ప్రాణాలని కాపాడేందుకు ప్రయత్నించాడు. అది ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. సినిమాను ఎంతో చక్కగా తీశారు. నా కెరీర్ హైదరాబాద్‌లోనే మొదలైంది. సందీప్‌తో కలిసి ఇక్కడ జీవించాం. హైదరాబాద్‌లో ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నా. మళ్లీ మళ్లీ హైదరాబాద్‌కు వస్తాను’’ అని తెలిపారు. ఇంతకు ముందు అడివి శేష్.. సందీప్ తల్లిని ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘‘అంకుల్, అమ్మ.. మేజర్ సినిమా రేపు విడుదలవుతుంది’’ అని పేర్కొన్నారు.
Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)