అన్వేషించండి
Advertisement
Sarkaru Vaari Paata: అప్పుడు 'సాహో' ఇప్పుడు 'సర్కారు వారి పాట'- టాలీవుడ్ లో 'హ్యాష్‌మోజీ' క్రేజ్
మహేష్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమాకు కూడా హ్యాష్‌మోజీను క్రియేట్ చేశారు.
హాలీవుడ్ లో క్రేజ్ ఉన్న సినిమాలు, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్-షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమాల గురించి ట్విట్టర్ లో సెర్చ్ చేసినప్పుడు హ్యాష్‌ట్యాగ్ చివరన సదరు హీరోలకు సంబంధించిన చిన్న బొమ్మ వస్తుంది. దాన్ని హ్యాష్‌మోజీ అంటారు. ఈ ఎమోజీను ట్విట్టర్ అంత ఈజీగా ఇవ్వదు. ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్ చివర ఎమోజీ రావాలంటే ఆ సినిమాకు చాలా క్రేజ్ ఉండాలి. దర్శక నిర్మాతలు కూడా బాగా డబ్బు పెట్టాలి. గతంలో సాహో' సినిమాకు ఇలానే ట్విట్టర్ లో ఎమోజీను క్రియేట్ చేశారు.
ఇప్పుడు మహేష్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమాకు కూడా హ్యాష్‌మోజీను క్రియేట్ చేశారు. ఈ విషయాన్ని మహేష్ బాబు వెల్లడించారు. #SarkaruVaariPaata, #SVP, #SVPMania అనే హ్యాష్‌ట్యాగ్‌ల చివర ఎమోజీ వస్తుంది. 'సర్కారు వారి పాట' సినిమాలో మహేష్ స్టైలిష్ లుక్ ను ఎమోజీగా మార్చారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 12న సినిమాను విడుదల చేయనున్నారు.
సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను మే 7న నిర్వహించనున్నారు. హైదరాబాద్ పోలీస్గ్రౌండ్స్ లో ఈవెంట్ జరగనుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: ‘అనసూయ అదే పదాన్ని వాడితే నవ్వారు? విశ్వక్సేన్ అంటే సీన్ చేస్తున్నారు, హరీష్ శంకర్ ఫైర్!
Just trying out this new emoji ;)#SarkaruVaariPaata#SVP#SVPMania
— Mahesh Babu (@urstrulyMahesh) May 5, 2022
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion