అన్వేషించండి

Guntur Kaaram Movie: ఆ విషయంలో ‘పుష్ప 2’ రికార్డును బద్దలు కొట్టిన ‘గుంటూరు కారం’

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే టైటిల్స్ విషయంలో దర్శకుడి సెంటిమెంట్ ను పక్కన పెట్టేశారు.

చాలా రోజుల తర్వాత ‘అతడు’ కాంబోలో ఓ మూవీ వస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు 'గుంటూరు కారం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్, సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా  మాస్ స్ట్రైక్ వీడియోను రిలీజ్ చేశారు.  సోషల్ మీడియాలో కూడా ఈ గ్లింప్స్‌ ను వదిలారు. అంతేకాదు, మూవీ టైటిల్‌ను సూపర్ స్టార్ అభిమానుల చేతుల మీదుగా థియేటర్లలో విడుదల చేశారు. 

‘పుష్ప 2’ రికార్డును బద్దలు కొట్టిన మహేష్ బాబు ‘గుంటూరు కారం’

ఇక మహేష్ బాబు ‘గుంటూరు కారం’ గ్లింప్స్ ‘పుష్ప 2’ రికార్డును బద్దలు కొట్టింది.  ఇప్పటి వరకు 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన గ్లింప్స్ గా ‘పుష్ప 2’ గ్లింప్స్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. అల్లు అర్జున్ మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్   గ్లింప్స్/టీజర్ 24 గంటల్లో 20.45 మిలియన్ల వ్యూస్ తో ఆల్-టైమ్ రికార్డ్‌  సృష్టించింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’ గ్లింప్స్ 24 గంటల్లో 21M+ వ్యూస్ సాధించింది. ‘పుష్ప 2’  రికార్డును క్రాస్ చేసింది. తెలుగు సినిమాకు చెందిన గ్లింప్స్ 24 గంటల్లో ఇన్ని వ్యూస్ అందుకోవడం సరికొత్త బెంచ్ మార్క్ గా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  

ముచ్చటగా మూడో మూవీ చేస్తున్న త్రివిక్రమ్, మహేష్ బాబు

మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత రూపొందుతున్న మూవీ ఇది. వీరి కాంబినేషన్‌లో ‘అతడు’ ఎవ్వర్ గ్రీన్ మూవీగా నిలిచిపోగా.. ‘ఖలేజా’ మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. చివరికి థియేటర్లలో యావరేజ్ మూవీగా నిలిచింది. అప్పటి నుంచి త్రివిక్రమ్, మహేష్ బాబు మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ వీరి కాంబినేషన్‌లో సినిమా చూడలేమని అంతా భావించారు. ఆ తర్వాత చాలా వదంతులు షికారు చేశాయి కూడా. అయితే, అవన్నీ పక్కనపెట్టి మళ్లీ వీరిద్దరు కలిసి సినిమా చేస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక టైటిల్ విషయానికి వస్తే.. మొదట్లో ఈ సినిమాకు ‘అమరావతికి అటు ఇటు’, ‘ఊరికి మొనగాడు’ టైటిళ్లను పరిశీలించారట. కానీ, చివరికి మహేష్, త్రివిక్రమ్‌లు ‘గుంటూరు కారం’ టైటిల్‌కే ఓటేశారట. ‘అ’ సెంటిమెంట్‌తో టైటిల్స్ పెట్టే త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాకు అప్పట్లో ‘ఖలేజా’ టైటిల్ పెట్టి సాహసం చేశారు. మళ్లీ ఈ మూవీకి కూడా ఆ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి ‘గుంటూరు కారం’ టైటిల్ పెట్టారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్నారు.  జగపతి బాబు  కీలక పాత్ర పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది(2024) జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.  

Read Also: ‘బాహుబలి’, ‘RRR’ రికార్డులను బద్దలుకొడుతుంది, ‘ప్రాజెక్ట్ K’పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు!

టాప్ హెడ్ లైన్స్

Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడితో నాని సినిమా... హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?
తమిళ దర్శకుడితో నాని సినిమా... హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?
Train Release Date: డిసెంబర్‌లో 'ట్రైన్' రిలీజ్... నితిన్, నాగచైతన్యకు పోటీగా విజయ్ సేతుపతి
డిసెంబర్‌లో 'ట్రైన్' రిలీజ్... నితిన్, నాగచైతన్యకు పోటీగా విజయ్ సేతుపతి
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Hide & Silk: రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్
రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget