అన్వేషించండి

SSMB28: 'కేజీఎఫ్'కి మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాకి ఉన్న లింక్ ఏంటంటే?

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకి 'కేజీఎఫ్' సినిమాకి ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది.ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాలేదు కానీ అప్పుడే రిలీజ్ డేట్ ని లాక్ చేసింది చిత్రబృందం.

ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం 'కేజీఎఫ్', 'కేజీఎఫ్2' సినిమాలకు పని చేసిన ఫైట్ మాస్టర్స్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్2' సినిమా అంచనాలకు మించి ఆడింది. ఈ సినిమా సక్సెస్ సాధించడంలో యాక్షన్ సన్నివేశాలు కీలకపాత్ర పోషించాయి. దీనికోసం ఫైట్ మాస్టర్లు అన్బు-అరివు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వీరినే మహేష్-త్రివిక్రమ్ సినిమా కోసం తీసుకోబోతున్నారట. ఈ ఫైట్ మాస్టర్స్ పని చేసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టే. 'విక్రమ్' సినిమాకి కూడా వీరే వర్క్ చేశారు. 

'RC15'కి కూడా వీరే పని చేస్తున్నారు. ఇప్పుడు మహేష్-త్రివిక్రమ్ సినిమా కూడా ఓకే అవ్వడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. తొలిసారి ఈ సినిమా కోసం తనకు అచొచ్చిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెడుతున్నారు త్రివిక్రమ్. పూర్తిగా యాక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సీన్ ఈ సినిమాలో కనిపించవట. నిజానికి త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేష్ మాత్రం యాక్షన్ పై దృష్టి పెట్టమని అడిగారట. దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కీలకమార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆలస్యమైందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.

ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

విలన్ గా తమిళ స్టార్:

SSMB28 సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి కనిపించనున్నారని కొన్ని రోజుల క్రితం వినిపించింది. అసలు నిజం ఏంటంటే... విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అందులో కొన్ని గ్రే షేడ్స్ ఉంటాయి. విజయ్ సేతుపతి రీసెంట్‌గా కథ, అందులో తన క్యారెక్టర్ గురించి విన్నారు. సినిమాలో నటించడం తనకు సంతోషం అంటూ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం కూడా చేసినట్లు తెలుస్తోంది.

Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?

Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Surrogacy Fraud Case: సృష్టి ఫెర్టిలిటీ కేసులో తప్పు ఒప్పుకున్న డాక్టర్ నమ్రత, ఆమె అసలు పేరేంటో తెలుసా..
సృష్టి ఫెర్టిలిటీ కేసులో తప్పు ఒప్పుకున్న డాక్టర్ నమ్రత, ఆమె అసలు పేరేంటో తెలుసా..
Free bus politics: తిరుమలకు వెళ్లే బస్సుల్లో మహిళలు టిక్కెట్ తీసుకోవాల్సిందేనా - వైసీపీ విమర్శలపై ఆర్టీసీ ఏం చెబుతోంది ?
తిరుమలకు వెళ్లే బస్సుల్లో మహిళలు టిక్కెట్ తీసుకోవాల్సిందేనా - వైసీపీ విమర్శలపై ఆర్టీసీ ఏం చెబుతోంది ?
Hyderabad Rains: వర్షాలను లైట్ తీసుకోవద్దు.. ఆ సమయంలో ఇళ్లు దాటి రావొద్దు, హైదరాబాద్ లో హైఅలెర్ట్ !
వర్షాలను లైట్ తీసుకోవద్దు.. ఆ సమయంలో ఇళ్లు దాటి రావొద్దు, హైదరాబాద్ లో హైఅలెర్ట్ !
Nithiin Shalini: నితిన్ షాలినిల బాబు పేరేంటో తెలుసా? - కృష్ణాష్టమి సందర్భంగా రివీల్
నితిన్ షాలినిల బాబు పేరేంటో తెలుసా? - కృష్ణాష్టమి సందర్భంగా రివీల్
Advertisement

వీడియోలు

Pakistan Man Illegal Affair in Hyderabad | హైదరాబాద్ లో లవ్ జిహాద్ కేసు | ABP Desam
Why not Pulivendula Slogan Win | కుప్పంను కొడదామనుకున్నారు..పులివెందులే పోయింది | ABP Desam
Tollywood Workers Strike | ఆ ఒక్క మెసేజ్ తో సమ్మె విరమించడానికి మేం సిద్దంగా ఉన్నాం | ABP Desam
CM Chandrababu RTC Bus Journey | స్త్రీశక్తి పథకాన్ని పంద్రాగస్టు కానుకగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు | ABP Desam
Jr NTR Hrithik Roshan War 2 Movie Video Review | వార్ 2 సినిమాకు ప్రేక్షకులు సలామ్ అంటారా.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Surrogacy Fraud Case: సృష్టి ఫెర్టిలిటీ కేసులో తప్పు ఒప్పుకున్న డాక్టర్ నమ్రత, ఆమె అసలు పేరేంటో తెలుసా..
సృష్టి ఫెర్టిలిటీ కేసులో తప్పు ఒప్పుకున్న డాక్టర్ నమ్రత, ఆమె అసలు పేరేంటో తెలుసా..
Free bus politics: తిరుమలకు వెళ్లే బస్సుల్లో మహిళలు టిక్కెట్ తీసుకోవాల్సిందేనా - వైసీపీ విమర్శలపై ఆర్టీసీ ఏం చెబుతోంది ?
తిరుమలకు వెళ్లే బస్సుల్లో మహిళలు టిక్కెట్ తీసుకోవాల్సిందేనా - వైసీపీ విమర్శలపై ఆర్టీసీ ఏం చెబుతోంది ?
Hyderabad Rains: వర్షాలను లైట్ తీసుకోవద్దు.. ఆ సమయంలో ఇళ్లు దాటి రావొద్దు, హైదరాబాద్ లో హైఅలెర్ట్ !
వర్షాలను లైట్ తీసుకోవద్దు.. ఆ సమయంలో ఇళ్లు దాటి రావొద్దు, హైదరాబాద్ లో హైఅలెర్ట్ !
Nithiin Shalini: నితిన్ షాలినిల బాబు పేరేంటో తెలుసా? - కృష్ణాష్టమి సందర్భంగా రివీల్
నితిన్ షాలినిల బాబు పేరేంటో తెలుసా? - కృష్ణాష్టమి సందర్భంగా రివీల్
Selfie With Free Bus Ticket:
"సెల్ఫీ విత్ ఫ్రీ బస్ టికెట్‌"- మహిళలకు ఏపీ ప్రభుత్వం పిలుపు
Anusha Ratnam: వరంగల్‌ to 'బిగ్ బాస్' వయా సాఫ్ట్‌వేర్ జాబ్... ఎవరీ అనూష? అగ్నిపరీక్షలో వైరల్ అమ్మాయి, ఇన్‌స్టా సెలబ్రిటీ గురించి తెల్సా?
వరంగల్‌ to 'బిగ్ బాస్' వయా సాఫ్ట్‌వేర్ జాబ్... ఎవరీ అనూష? అగ్నిపరీక్షలో వైరల్ అమ్మాయి, ఇన్‌స్టా సెలబ్రిటీ గురించి తెల్సా?
Viral News: కాస్ట్‌లీగా మారిన మిల్క్ ఆర్డర్.. పెద్దావిడ 3 బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. రూ. 18.5 లక్షలు మాయం
కాస్ట్‌లీగా మారిన మిల్క్ ఆర్డర్.. పెద్దావిడ 3 బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. రూ. 18.5 లక్షలు మాయం
Priyanka Mohan: పవన్ కళ్యాణ్ 'ఓజీ' హీరోయిన్... కన్మణిగా ప్రియాంక మోహన్ - ఫస్ట్ లుక్ చూశారా?
పవన్ కళ్యాణ్ 'ఓజీ' హీరోయిన్... కన్మణిగా ప్రియాంక మోహన్ - ఫస్ట్ లుక్ చూశారా?
Embed widget