By: ABP Desam | Updated at : 15 Sep 2021 04:36 PM (IST)
Edited By: RamaLakshmibai
Liger
పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-అనన్య పాండే నటిస్తోన్న మూవీ ‘లైగర్’. తెలుగు, హిందీతోపాటు ఇతర ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల కానున్న ఈ సినిమాని పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “లైగర్” సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైందంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం గోవాలో జరిగే నైట్ ఎఫెక్ట్‌లో చిత్రీకరించనున్న యాక్షన్ సన్నివేశాల కోసం బృందం భారీ సెట్ ఏర్పాటు చేసింది. బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ కూర్చుని ఉన్న ఓ రేంజ్ లో ఉంది.
VIJAY DEVERAKONDA: 'LIGER' SHOOT RESUMES... #Liger - starring #VijayDeverakonda and #AnanyaPanday - has resumed shooting... Directed by #PuriJagannadh... Produced by #KaranJohar, #CharmmeKaur, #ApoorvaMehta and #HirooYashJohar. #Hindi #Telugu #Tamil #Kannada #Malayalam pic.twitter.com/cB3fmksBs1
— taran adarsh (@taran_adarsh) September 15, 2021
ఈ పిక్ ను పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ “రక్తం, చెమట,వయోలెన్స్… లైగర్ షూట్ తిరిగి ప్రారంభం” అంటూ రాసుకొచ్చాడు. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ సెప్టెంబర్ 9 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మేకర్స్ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో సినిమా ఓటిటి లో విడుదలవుతుందంటూ వార్తలొచ్చాయి. అయితే వీటిపై స్పందించిన విజయ్ దేవరకొండ “లైగర్” కు రూ. 200 కోట్ల ఓటిటి డీల్ వచ్చిందని.. థియేటర్లలో ఇంకా ఎక్కువ వస్తుందంటూ ఆ రూమర్స్ కి చెక్ పెట్టాడు.
BLOOD. SWEAT. VIOLENCE. #LIGER Shoot Resumes. pic.twitter.com/x2wJVuDByd
— Vijay Deverakonda (@TheDeverakonda) September 15, 2021
లేటెస్ట్‌గా విడుదలైన విజయ్ లుక్ చూస్తుంటే నెవ్వర్ బిఫోర్ అన్నట్టుందంటున్నారు అభిమానులు. సాధారణంగా పూరీ మార్క్ హీరోలు వేరే ఉంటారు. ‘ఇస్మార్ట్ శంకర్’ లో రామ్ ని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. వాస్తవానికి క్లాస్ గా కనిపించే రామ్ ని అంత మాస్ లా చూపించడం మరొకరి తరం కాదన్నంతగా ఉంటుంది లుక్. ఇప్పుడు లైగర్ లో విజయ్ దేవరకొండ లుక్ చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇప్పటి వరకూ విజయ్ కనిపించని లుక్ లో ఉన్నాడు. పైగా కండలు తిరిగిన దేహం, పిలకముడితో రింగ్ లో రిలాక్స్ డ్ గా కూర్చున్న విజయ్ లుక్ అదుర్స్ అనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఈ లుక్ తో భారీగా పెరిగాయి. పెండింగ్ లో ఉన్న చిత్రీకరణను త్వరగా పూర్తిచేయాలనే పట్టుదలతో ఉన్నారు టీమ్.
Also read: యాభై ఏళ్లు దాటాయంటే నమ్మగలరా…ఎవ్వర్ గ్రీన్ బ్యూటీకి హ్యాపీ బర్త్ డే
ఇవాళ మరో విశేషం రమ్య కృష్ణ బర్త్ డే. లైగర్ లో కీలకపాత్ర పోషిస్తున్న శివగామి పుట్టినరోజు వేడుకలు గోవా షూటింగ్ లోనే సెలబ్రేట్ చేయనున్నారని టాక్.
Also read: బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ ఇద్దరూ వైల్డ్ కాల్డ్ ఎంట్రీ.. ఇక కథ వేరే ఉంటదా..!
NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్
Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్
Hardik Patel Resign: కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా
Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి
Someshwara Temple: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే