అన్వేషించండి

Liger Movie Release Live Updates: విజయ్ దేవరకొండ వినాశనానికి దగ్గరగా వెళుతున్నాడా? ఆయన్ను అంత మాట అన్నారేంటి?

‘లైగర్’ మూవీ గురువారం థియేటర్లలో విడుదలైంది. మరి రిజల్ట్ ఏమిటీ? ఈ పాన్ ఇండియా మూవీ కూడా మరో రికార్డుకు సిద్ధమవుతోందా?

LIVE

Key Events
Liger Movie Release Live Updates: విజయ్ దేవరకొండ వినాశనానికి దగ్గరగా వెళుతున్నాడా? ఆయన్ను అంత మాట అన్నారేంటి?

Background

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై ఇటు టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లో సైతం ఎన్నో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ నటించడం వల్ల హైప్ మరీ ఎక్కువగా ఉంది. దీనికి తోడు.. ‘లైగర్’కు పూరీ టీమ్ ఎన్నడూ చేయనంతగా పబ్లిసిటీ ఇచ్చారు. దాదాపు ఇండియా మొత్తం చుట్టేసి.. సినిమాను ఓ రేంజ్‌లో హిట్ చేయాలనే పట్టుదలతో సాగారు. కానీ, సినిమాను ఎంత ప్రమోషన్ చేసినా.. చివరికి మార్కులు వేయాల్సింది ఆడియన్స్ మాత్రమే. మరి, ఈ సినిమా ఇప్పటికే థియేటర్లో సందడి చేస్తోంది. ఆడియన్స్ కూడా ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరి ఎవరెవరు ఏమంటున్నారనేది సోషల్ మీడియా రివ్యూల్లో చూసేయండి మరి. 

అమెరికా ఆడియన్స్ నుంచి... మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో జనాల నుంచి 'లైగర్'కు ఆశించిన స్పందన రాలేదు. నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ అండ్ పూరి జగన్నాథ్ అభిమానులు ఈ రివ్యూలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. పూరి సినిమాలకు రివ్యూలతో పని లేదనేది, హీరోయిజాన్ని ఆయన ఎలివేట్ చేసినట్లు మరొకరు చేయరని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.

'లైగర్' కోసం విజయ్ దేవరకొండ తనను తాను మలుచుకున్న విధానం సూపర్ అని, ఆయన ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ గ్రేట్ అని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. అయితే... పాన్ ఇండియా మార్కెట్‌కు ఇటువంటి సినిమాతో ఇంట్రడ్యూస్ కాకూడదని,ఇదొక బ్యాడ్ ఛాయస్ అని చెబుతున్నారు. 
'లైగర్' కథలో మంచి సినిమాకు అవసరమైన పొటెన్షియల్ ఉన్నప్పటికీ... పూరి జగన్నాథ్ మంచి సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో ఫెయిల్ అయ్యారని ఒకరు ట్వీట్ చేశారు. హీరోయిన్ అనన్యా పాండే నటనకు నెగిటివ్ మార్కులు పడ్డాయి. 

Liger First Review: దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు 'లైగర్' సినిమాకి బుధవారం ఫస్ట్ రివ్యూ చెప్పేశారు. 'లైగర్' సినిమా సిటీమార్ మాస్ ఎంటర్టైనర్ అని, విజయ్ దేవరకొండ సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించాడని.. యాక్షన్స్ స్టంట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని, సూపర్బ్ డైరెక్షన్ అని  రాసుకొచ్చారు. రమ్యకృష్ణ సర్ప్రైజ్ ప్యాకేజ్ అని.. అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే ఏవరేజ్ గా ఉన్నాయని తెలిపారు. మరి ఉమైర్ సంధు చెప్పినట్లుగానే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి!

సెన్సార్ సర్టిఫికెట్ ప్రకారం.. సినిమాలో ఓ బ్రిటీష్ నోవలిస్ట్ డైలాగ్ ను వాడుకున్నారు. దాన్ని హిందీలోయాడ్ చేశారు. టైటిల్ కార్డును కూడా యాడ్ చేశారు. ఇక 48 నిమిషం దగ్గర 'సైకిల్ తోకో' అనే పదాన్ని మ్యూట్ చేశారు. ఆ తరువాత ఆరు సార్లు 'ఫ*' అనే పదాన్ని మ్యూట్ చేశారు. వీటితో పాటు కుతియా అనే పదాన్ని గంట మూడో నిమిషం దగ్గర మ్యూట్ చేశారు. 'కే లవ్' అనే మాటను కూడా మ్యూట్ చేశారు. ఇవి కాకుండా 'వో తేరీ చాతతా హై..' అనే డైలాగ్‌ను 'లెజెండ్‌ తేరా చెంచా..' అనే డైలాగ్‌తో మార్చారు. 

09:27 AM (IST)  •  27 Aug 2022

విజయ్ దేవరకొండ నాశనమయ్యే రోజు దగ్గర పడిందా? 

'లైగర్' విడుదలకు ముందు విజయ్ దేవరకొండ బాయ్ కాట్ ట్రెండ్ మీద... తన సినిమాను చూస్తే చూడమని, లేదంటే మానేయమని చేసిన వ్యాఖ్యలపై ముంబై మరాఠా సినిమా థియేటర్ ఓనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండకు అంత అహంకారం పనికి రాదనీ... వినాశకాలే విపరీతబుద్ధి అని... నాశనం అయ్యే రోజు దగ్గర పడిందని ఆయన పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ అనకొండలా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు.  

17:56 PM (IST)  •  26 Aug 2022

లైగర్ ఫస్ట్ డే కలెక్షన్స్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన తాజాగా సినిమా లైగర్. పాన్ ఇండియా మూవీగా విడుదల అయ్యింది. భారీ ప్రమోషన్స్ కారణంగా సినిమా ఓ రేంజిలో ఉంటుందని ఊహించిన సినీ అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అదుకోలేకపోయింది. అధికారిక ప్రకటన ప్రకారం ‘లైగర్’ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 33.12 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. 

17:56 PM (IST)  •  26 Aug 2022

లైగర్ ఫస్ట్ డే కలెక్షన్స్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన తాజాగా సినిమా లైగర్. పాన్ ఇండియా మూవీగా విడుదల అయ్యింది. భారీ ప్రమోషన్స్ కారణంగా సినిమా ఓ రేంజిలో ఉంటుందని ఊహించిన సినీ అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అదుకోలేకపోయింది. అధికారిక ప్రకటన ప్రకారం ‘లైగర్’ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 33.12 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. 

16:46 PM (IST)  •  25 Aug 2022

‘లైగర్’ విశ్లేషణ.. ఎవరెవరు ఎలా చేశారు?

విజయ్ దేవరకొండ సినిమా కోసం ఎంత కష్టపడ్డారనేది ఈ సినిమాలో ఆయన్ని చూస్తే అర్థమవుతుంది. ఆయన కష్టం స్క్రీన్ మీద సిక్స్ ప్యాక్ రూపంలో కనిపించింది. నటుడిగా కూడా తనను తాను మార్చుకున్నారు. నత్తితో ఆ విధంగా డైలాగులు చెప్పడం అంత సులభం ఏమీ కాదు. టోటల్‌గా విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ అనన్యా పాండే గ్లామర్ షో చేశారు. నటన ఏమంత ఆకట్టుకోదు. హీరో తల్లి పాత్రలో రమ్యకృష్ణ కొన్ని ప‌వ‌ర్‌ఫుల్‌ డైలాగులు చెప్పారు. నటిగా ఇటువంటి రోల్ చేయడం ఆమెకు కష్టం ఏమీ కాదు. అలీ రెండు మూడు సన్నివేశాల్లో కనిపించారు. ఆయనతో పాటు మరో కమెడియన్ 'గెటప్' శ్రీను ఉన్నారు. వాళ్ళిద్దరి సన్నివేశాలు ఆశించిన రీతిలో నవ్వించలేదు. అయితే, ఉన్నంతలో వాళ్ళిద్దరి సీన్స్ పర్వాలేదు. క్లైమాక్స్‌లో గ్రేట్ మైక్ టైసన్‌ను చూడటం మంచి కిక్ ఇస్తుంది. సినిమా పూర్తయ్యాక ఆయన ఈ రోల్ ఎందుకు చేశారో? అనిపిస్తుంది. రోనిత్ రాయ్, విష్, చుంకీ పాండే, 'టెంపర్' వంశీ తదితరులు స్క్రీన్ మీద కనిపించారు. కానీ, ఇంపాక్ట్ చూపించడంలో ఫెయిల్ అయ్యారు.   

13:25 PM (IST)  •  25 Aug 2022

‘లైగర్’ బ్లాక్ బస్టర్, పండగ చేసుకుంటున్న విజయ్ ఫ్యాన్స్

'లైగర్' సినిమాకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. మెజారిటీ నెటిజన్లు సినిమా బాలేదని ట్వీట్లు చేస్తున్నారు. అయితే... విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం సినిమా బావుంటుందని పేర్కొంటున్నారు. ట్విట్టర్ లో 'బ్లాక్ బస్టర్ లైగర్' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కొంతమంది కావాలనే తమ హీరోపై నెగటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని అంటున్నారు. ఊరమాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని మరికొందరు అంటున్నారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
MP Brahmin Board : బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Embed widget