అన్వేషించండి

Adipurush: 'ఆదిపురుష్'పై విమర్శలు - ఆ వీడియోలతో సమాధానం చెప్పిన కృతి సనన్

ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ఆదిపురుష్ ఊహించలేని విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో కృతి సనన్.. ఈ మూవీలోని ఓ క్లిప్ ను షేర్ చేస్తూ.. అభిమానులు చీర్స్, క్లాప్స్ కొట్టడాన్ని గురించి ఆమె ప్రస్తావించారు.

Kriti Sanon Post on Adipurush : ఓం రౌత్ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించిన 'ఆదిపురుష్' జూన్ 16న శుక్రవారం విడుదలైనప్పటి నుంచి వివాదాల్లో కొనసాగుతోంది. సినిమాలోని డైలాగ్‌లు, పాత్రలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు సన్నివేశాలు, డైలాగులు తీసివేయాలని, రామాయణాన్ని అపహాస్యం చేశారని ఆరోపిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్నారు. ఈ ఎదురుదెబ్బల మధ్య, హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' చిత్రంలో జానకి పాత్రలో నటించిన కృతి సనన్..'చీర్స్, క్లాప్స్'పై దృష్టి పెడుతూ ఓ పోస్ట్‌ను పంచుకున్నారు.

కృతి సనన్ పోస్ట్

ఆదిపురుష్‌లో ప్రభాస్... రాఘవ్, సైఫ్ అలీఖాన్ లంకేష్, కృతి జానకి పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కృతి 'ఆదిపురుష్‌'పై ప్రేక్షకుల స్పందనను చూపే వీడియోల సిరీస్‌ను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా పంచుకుంది. థియేటర్లలో ప్లే అవుతోన్న ఈ క్లిప్‌లో పెద్ద స్క్రీన్‌పై కృతి, ప్రభాస్, సైఫ్‌లను వీక్షిస్తున్నప్పుడు ప్రజలు ఉల్లాసంగా, చప్పట్లు కొడుతూ కనిపించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)

ఈ పోస్టుపై చాలా మంది 'ఆదిపురుష్' చిత్రం పట్ల తమ నిరాశను వ్యక్తం చేశారు. అందులో ఒక వ్యక్తి కృతి పోస్ట్‌పై నెగటివ్‌గా రిప్లై ఇచ్చాడు. "డోంట్ వర్రీ గైస్. యే ఇన్హి కే లాగ్ హై (థియేటర్‌లలో చప్పట్లు కొట్టి, ఉత్సాహపరిచే వారు వారి స్వంత వ్యక్తులు)" అని రాసుకొచ్చారు. "అచ్చి తరాహ్ సునో, వో తలియాన్ నహీ గలియాన్ హై (జాగ్రత్తగా వినండి, అవి చప్పట్లు కాదు, తిట్లు)" అంటూ ఇంకొకరు చమత్కారంగా కామెంట్ చేశారు. "డిస్ లైక్ బటన్ ఎక్కడ ఉంది?" అని మరొకరు అనగా.. “ఆదిపురుష్ సినిమాను ఎవరు బహిష్కరించాలని అనుకుంటున్నారు?” అని ఇంకో ఒక వ్యక్తి అడిగాడు. "యానిమేషన్ రామాయణం దీని కంటే గొప్పది" అంటూ మరొక నెటిజన్ సెటైరికల్ కామెంట్ చేశారు.

వివాదంలో ఆదిపురుష్

గతేడాది అక్టోబర్‌లో 'ఆదిపురుష్' టీజర్‌ను విడుదల చేయడంతో.. అప్పట్నుంచి వార్తల్లోకెక్కడం ప్రారంభించింది. ఈ టీజర్ పైనా ఎనలేని విమర్శనాత్మక కామెంట్లు వచ్చాయి. సన్నివేశాలన్నీ కార్టూన్ లాంటి గ్రాఫిక్స్ లాగా ఉన్నాయని చాలా మంది వెక్కిరించారు. ఇక ఈ సినిమా గత వారం విడుదలైనప్పటి  నుంచి మళ్లీ అదే తంతు కొనసాగింది. మూవీలోని పాత్రల వర్ణనను సవాలు చేస్తూ చిత్రానికి వ్యతిరేకంగా పలు చోట్ల నిరసనలు కూడా జరిగాయి.

నేపాల్‌లో కొందరు 'ఆదిపురుష్‌'లో జానకిని భారతీయ పుత్రిక అనడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా ఫేస్‌బుక్ పోస్ట్‌ చేశారు. నగరంలోని థియేటర్‌లలో అన్ని బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. ఆ డైలాగ్‌ని తొలగించాల్సిందిగా ఆదిపురుష్ మేకర్స్‌ని కోరారు. పోఖారా మెట్రోపాలిటన్ సిటీ మేయర్ ధనరాజ్ ఆచార్య కూడా సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Read Also : Chiranjeevi : లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం - మనవరాలికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన చిరంజీవి

టాప్ హెడ్ లైన్స్

Niro Glimpse Review : ఓ చేతిలో సిగరెట్... మరో చేతితో అమ్మాయి ఎదపై కవిత - ట్రెండింగ్‌లో నీరో గ్లింప్స్
ఓ చేతిలో సిగరెట్... మరో చేతితో అమ్మాయి ఎదపై కవిత - ట్రెండింగ్‌లో నీరో గ్లింప్స్
Nithiin Alias Rukumini : నా దేవుడు నాని బాబు - నేచరల్ స్టార్‌కు గొడుగు పట్టి ముద్దు పెట్టిన నితిన్... వీడియో వైరల్
నా దేవుడు నాని బాబు - నేచరల్ స్టార్‌కు గొడుగు పట్టి ముద్దు పెట్టిన నితిన్... వీడియో వైరల్
Hanuman Ansh OTT : ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Bigg Boss Season 10 Today November 28th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డబుల్ ఎలిమినేషన్! వంశీ అవుట్! విషం చిమ్మేసిన కంటెస్టెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డబుల్ ఎలిమినేషన్! వంశీ అవుట్! విషం చిమ్మేసిన కంటెస్టెంట్స్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Hanuman Ansh OTT : ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
J-Series ఇంజిన్‌తో Royal Enfield Classic 350 హైవేపై, సిటీలో నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తుందో తెలుసా?
E20 పెట్రోల్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ Classic 350 నిజమైన మైలేజ్‌ ఇదే.. ఆన్‌రోడ్‌ ధర ఎంతంటే?
Amadalavalasa Elections: ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
Embed widget