Kiara Advani Movie On OTT : మర్డర్, మిస్టరీ, మసాలా - ఓటీటీకి కియారా అడ్వాణీ సినిమా
Govinda Naam Mera OTT Release : విక్కీ కౌశల్ హీరోగా, భూమి పెడ్నేకర్, కియారా అడ్వాణీ హీరోయిన్లుగా నటించిన 'గోవింద్ మేరా నామ్' సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
విక్కీ కౌశల్ (Vicky Kaushal) కథానాయకుడిగా... భూమి పెడ్నేకర్, కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్లుగా నటించిన 'గోవింద్ నామ్ మేరా' (Govind Mera Naam). తొలుత ఈ ఏడాది జూన్ 12న థియేటర్లలో విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు ఆ ప్లాన్ మారింది. థియేటర్ల నుంచి ఓటీటీకి సినిమా వచ్చింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది.
డిసెంబర్ 16న...
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో!
డిసెంబర్ 16 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'గోవింద్ నామ్ మేరా' సినిమా స్ట్రీమింగ్ కానుందని ఈ రోజు అనౌన్స్ చేశారు. 'మర్డర్... మిస్టరీ... మ్యాడ్ నెస్... మసాలా... అన్నీ మీ ఇంటిలోని స్క్రీన్స్ మీదకు వస్తున్నాయి' అని పేర్కొన్నారు. కియారాకు ఓటీటీలో మంచి రికార్డ్ ఉంది.
'లస్ట్ స్టోరీస్' నుంచి మొదలు పెడితే 'షేర్ షా' వరకు... ఆవిడ నటించిన కొన్ని డైరెక్టుగా ఓటీటీలో విడుదల అయ్యాయి. 'మసాబా మసాబా'లో అతిథి పాత్రలో కనిపించారు. 'గిల్టీ'లో కథానాయికగా నటించారు.వాటికి చక్కటి ఆదరణ లభించింది. ఆమెకు తోడు విక్కీ కౌశల్, భూమి ఉండటంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ కావచ్చు. 'లస్ట్ స్టోరీస్'లోని ఓ కథలో భూమి కూడా ఉన్నారు.
అందులోనూ 'గోవింద్ నామ్ మేరా' సినిమా ఇల్లాలు, ప్రియురాలితో ముడిపడిన భర్త కథతో రూపొందించడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేయవచ్చు. ఇటు ఇల్లాలు... అటు ప్రియురాలు... తెలుగులో ఈ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. హిందీలో కూడా వచ్చాయి. పెళ్లాం... ప్రియురాలు... భర్త ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్. దీనికి మర్డర్ మిస్టరీ యాడ్ చేసినట్టు ఉన్నారు.
గోవింద్ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తుండగా... అతడి భార్య పాత్రలో భూమి పెడ్నేకర్, నాటీ గాళ్ ఫ్రెండ్ పాత్రలో కియారా అడ్వాణీ కనిపించనున్నారు. 'హంప్టీ శర్మ కి దుల్హనియా', 'బద్రీనాథ్ కి దుల్హనియా', 'ధడక్' సినిమాల తర్వాత కరణ్ జోహార్ నిర్మాణంలో మరోసారి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
View this post on Instagram
ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలకు థియేటర్లలో ఆశించిన ఆదరణ లభించడం లేదు. కొన్ని సినిమాలు విజయాలు సాధిస్తున్నా... మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అందుకని, ఓటీటీ నుంచి అవకాశాలు వస్తే నిర్మాతలు ఇచ్చేస్తున్నారు. థియేటర్ల దగ్గర ఎలా ఆడుతుందో తెలియని తరుణంలో లాభాలు వస్తే ఎందుకు కాదనుకోవడం అనుకుంటున్నారేమో... కరణ్ జోహార్ వంటి ప్రముఖ నిర్మాత తన సినిమాను ఓటీటీకి ఇవ్వడం విశేషం.
Also Read : 'వండర్ ఉమెన్' రివ్యూ : అమ్మ కాబోయే మహిళలు, భర్తలు తప్పకుండా చూడాల్సిన సినిమా!
'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన కియారా అడ్వాణీ, ఆ తర్వాత రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' చేశారు. హిందీ సినిమాలతో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ కు జోడీగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. తెలుగు, హిందీ సినిమాల మధ్య కియారా మంచి బ్యాలెన్స్ పాటిస్తున్నారు. సౌత్ సినిమాలను వదులుకోకుండా ఇక్కడి ప్రేక్షకుల్లో తన క్రేజ్ కంటిన్యూ అయ్యేలా చూస్తున్నారు.