Keerthy Suresh Yoga: కీర్తి సురేష్ యోగా వీడియో చూశారా? క్యూట్ మూమెంట్ ఇదే!
ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కీర్తి సురేష్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో ఆమెకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ మధ్యకాలంలో ఆమె నటిస్తోన్న సినిమాలు పెద్దగా ఆడడం లేదు. అయినప్పటికీ కీర్తి స్టార్ డమ్ ఎంతమాత్రం తగ్గలేదు. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించారు.
మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన కీర్తి ఇప్పుడు 'వాశి' అనే మలయాళ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కీర్తి సురేష్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె కష్టమైన ఆశనాలను కూడా అవలీలగా చేసేస్తోంది.
ఈ వీడియో చివర్లో కీర్తి సురేష్ పెంపుడు కుక్క ఆమె దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేయగా.. దాన్ని పక్కకు తీసుకొని ముద్దు చేసింది కీర్తి. ఈ యోగా వీడియో మొత్తానికి ఈ క్యూట్ మూమెంట్ హైలైట్ గా నిలిచింది. కీర్తికి తన డాగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు దాంతో తీసుకున్న ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఈ డాగ్ కోసం ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు.
Also Read : శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?
View this post on Instagram