Sri Simha Wedding : అట్టహాసంగా కీరవాణి తనయుడి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, అమ్మాయి ఎవరో తెలుసా?
Sri Simha : యువ నటుడు శ్రీసింహా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సీనియర్ నటుడు మురళీ మోహన్ మనువరాలు రాగ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. తాజాగా వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి.
Sri Simha-Raaga Wedding: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి కొడుకు, నటుడు శ్రీ సింహా పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. సీనియర్ నటుడు మురళీ మోహన్ మనువరాలు రాగను వివాహం చేసుకోబోతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్ లో వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సెలబ్రేషన్స్ లో రాజమౌళి దంపతులు, మహేష్ బాబు కుటుంబంతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Hearty congratulations to the wonderful couple Simha and Raaga! ♥️
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) November 17, 2024
Wishing Mr. Keeravaani, Mr. Raj Mouli, Shri Murali Mohan Garu, and their families a wonderful congratulations! 💕 pic.twitter.com/FXSfZRP91d
నటుడు శ్రీ సింహ గురించి..
తండ్రి కీరవాణి సినీ పరిశ్రమలో దిగ్గజ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీ సింహాకు చిన్నప్పటి నుంచే సినిమాల పట్ల మక్కువ ఎక్కువగా ఉండేది. 2007లో తన బాబాయ్ రాజమౌళి దర్శకత్వంలో జూ. ఎన్టీయార్ హీరోగా తెరకెక్కిన ‘యమదొంగ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ చిత్రంలో చిన్నప్పటి ఎన్టీఆర్ గా నటించాడు. ఆ తర్వాత సునీల్ హీరోగా వచ్చిన ‘మర్యాద రామన్న’ సినిమాలో బాలనటుడిగా కనిపించాడు. ‘ఈగ’ సినిమాలో సమంత ఫ్రెండ్ గా నటించాడు. 2018లో సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.
2019లో రితేష్ రానా దర్శకత్వం వహించిన ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’, ‘భాగ్ సాలే’, ‘ఉస్తాద్’ సినిమాల్లో నటించారు. తాజాగా నటించిన ‘మత్తు వదలరా 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ‘మత్తు వదలరా’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు రితేష్ రానా. ఈ క్రైమ్ కామెడీ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. సత్య, సునీల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్ టైన్ మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించారు. ప్రస్తుతం మరికొన్ని సినిమాలు చేస్తున్నారు.
పెళ్లి కూతురు రాగ..
తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్న మురళీ మోహన్ మనువరాలు రాగ. మురళీ మోహన్ కు ఓ కూతురు, ఓ కొడుకు ఉన్నారు. కూతురు చాలా కాలంగా ఫారిన్ లోనే ఉంటుంది. కొడుకు రామ్ మోహన్.. ప్రస్తుతం మురళీ మోహన్ వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్ మోహన్- రూప దంపతుల కూతురు రాగ. ఫారిన్ లో బిజినెస్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం తన కుటుంబానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నది. త్వరలోనే శ్రీసింహా, రాగ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు.