అన్వేషించండి

Karthikeya 2:‘కార్తికేయ-2’ దర్శకుడికి సర్ ప్రైజ్.. బిగ్ బీ పిలిచి ఏమన్నారంటే..?

చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అందుకున్న ‘కార్తికేయ-2’ సినిమా యూనిట్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు బాలీవుట్ టాప్ హీరో బిగ్ బీ.. అద్భుత చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు చందును పిలిచి మరీ అభినందించారు.

నిఖిల్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘కార్తికేయ-2’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది. ఈ నెల 13న జనాల ముందుకు వచ్చిన  ఈ సినిమా తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. నార్త్ లో బాలీవుడ్ బడా హీరోలను కాదని టాలీవుడ్ హీరోకు జైకొడుతున్నారు ప్రేక్షకులు.  అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబడుతోంది. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ దూసుకెళ్తోంది.

ఎదురెళ్లి ఆహ్వానించిన బిగ్ బీ

తాజాగా  ‘కార్తికేయ-2’ సినిమాను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం చూశారట. ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందట. వెంటనే ఆయన ఈ సినిమా దర్శకుడు చందుకు ఫోన్ చేశారు. చక్కటి సినిమా తీయడంపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు.. దర్శకుడిని తన ఇంటికి ఆహ్వానించారు. బిగ్ బీ పిలుపుతో ఆయన ఇంటికి వెళ్లిన చందును.. ఎదురెళ్లి స్వాగతం పలికారట. ఎంతో ఆప్యాయంగా పలకరించారట. ఈ సందర్భంగా ‘కార్తికేయ-2’ సినిమా యూనిట్ మీద ప్రశంసల జల్లు కురిపించారట.

‘కార్తికేయ-2’ సినిమాతో పాటు పలు విషయాల గురించి చందుతో కాసేపు మాట్లాడారట. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోను చందు తన ఇన్ స్టాలో షేర్ చేశారు. అమితాబ్ జీ ధన్యవాదాలు.. మీ దీవెనలను జీవితంలో మర్చిపోలేను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు చందును, ‘కార్తికేయ-2’ సినిమా యూనిట్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మున్ముందుకు అమితాబ్ తో సినిమా తీసే అవకాశం చందుకు రావాలని కోరుకుంటున్నారు. వీరి కలయికలో ఆ విషయం కూడా చర్చకు వచ్చే ఉంటుందని మరికొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మనమూ బిగ్ బీతో చందుకు సినిమా తీసే అవకాశం రావాలని కోరుకుందాం..

‘కార్తికేయ-2’పై ఇస్కాన్ ప్రశంసలు  

ఇప్పటికే ఈ సినిమాపై ప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ ప్రశంసలు కురిపించింది. శ్రీకృష్ణుడి తత్త్వం గురించి ఈ సినిమాలో చూపించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఇస్కాన్ కేంద్రం అయిన బృందావనానికి రావాల్సిందిగా కార్తికేయ-2 సినిమా యూనిట్ ను ఆహ్వానించింది. ఈ ఆహ్వానం తమకు దక్కిన గొప్ప గౌవరంగా మూవీ యూనిట్ అభిప్రాయపడింది.

భారీగా వసూళ్లు

ప్రస్తుతం  ‘కార్తికేయ-2’ సినిమా సౌత్ తో పాటు నార్త్ లోనూ దుమ్మురేపుతుంది. అన్ని చోట్లా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్ లో  ‘కార్తికేయ-2’ సినిమాకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా మంచి సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో రోజు రోజుకు థియేటర్ల సంఖ్య సైతం పెరుగుతుంది. సినిమాకు వచ్చే వారి సంఖ్య భారీ స్థాయిలో ఉండటంతో వసూళ్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సుమారు రూ.44 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలోనే సుమారు రూ.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు. 

Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - ఆ బూతు డైలాగ్స్ కట్!

Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - సినిమాలో పాటలు ఎన్ని? ఫైట్లు ఎన్ని?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chandoo Mondeti (@chandoo.mondeti)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Raaka Budget : 'రాకా' బడ్జెట్ ఎంత? - అల్లు అర్జున్, దీపికా, అట్లీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!
'రాకా' బడ్జెట్ ఎంత? - అల్లు అర్జున్, దీపికా, అట్లీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!
Varanasi Story : మహేశ్ బాబు వారణాసి స్టోరీ లీక్! - ప్రపంచాన్ని కాపాడే ఓ రహస్యం... గ్రేట్ అడ్వెంచర్
మహేశ్ బాబు వారణాసి స్టోరీ లీక్! - ప్రపంచాన్ని కాపాడే ఓ రహస్యం... గ్రేట్ అడ్వెంచర్
Prabhas: ధురంధర్ 2 చూసిన ప్రభాస్... సందీప్ రెడ్డి వంగా ప్లాన్ ఏంటి?
ధురంధర్ 2 చూసిన ప్రభాస్... సందీప్ రెడ్డి వంగా ప్లాన్ ఏంటి?
Dark Night OTT : వివాహేతర సంబంధం... షాకింగ్ ఇన్సిడెంట్ - ఓటీటీలోకి పూర్ణ ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్... ఎందులో చూడొచ్చంటే?
వివాహేతర సంబంధం... షాకింగ్ ఇన్సిడెంట్ - ఓటీటీలోకి పూర్ణ ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
Vaibhav Suryavamshi MI vs RR IPL 2026 | బుమ్రా బౌలింగ్ లో వైభవ్ మెరుపులు | ABP Desam
IPL 2026 Shubman Gill Back in Nets | గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీ | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport: ఆదిలాబాద్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్! ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన!
ఆదిలాబాద్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్! ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన!
Telangana BRS Politics: జగిత్యాల జంగ్ - జీవన్ రెడ్డి గులాబీ గూటికి.. ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌లో చిచ్చు తప్పదా?
జగిత్యాల జంగ్ - జీవన్ రెడ్డి గులాబీ గూటికి.. ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌లో చిచ్చు తప్పదా?
Assembly Elections 2026: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలైన పోలింగ్! ఓటు వేసేందుకు ఓటర్ల బారులు!
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలైన పోలింగ్! ఓటు వేసేందుకు ఓటర్ల బారులు!
IPL 2026: ఐపీఎల్‌లో సరికొత్త రూల్‌! ఆ 16 మంది తప్ప వేరే వాళ్లకు గ్రౌండ్‌లోకి నో ఎంట్రీ!
ఐపీఎల్‌లో సరికొత్త రూల్‌! ఆ 16 మంది తప్ప వేరే వాళ్లకు గ్రౌండ్‌లోకి నో ఎంట్రీ!
Chandra Babu: మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి క్లాస్‌! తండ్రి జోక్యం ఎక్కువైందని చీవాట్లు!
మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి క్లాస్‌! తండ్రి జోక్యం ఎక్కువైందని చీవాట్లు!
Dark Night OTT : వివాహేతర సంబంధం... షాకింగ్ ఇన్సిడెంట్ - ఓటీటీలోకి పూర్ణ ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్... ఎందులో చూడొచ్చంటే?
వివాహేతర సంబంధం... షాకింగ్ ఇన్సిడెంట్ - ఓటీటీలోకి పూర్ణ ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్... ఎందులో చూడొచ్చంటే?
IPL 2026 DC VS GT Result Updates: గుజ‌రాత్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. రాహుల్ ఒంటరి పోరాటం వృథా
గుజ‌రాత్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. రాహుల్ ఒంటరి పోరాటం వృథా
Raaka Vs Shakti: మెహర్ ముందుచూపు... ఎన్టీఆర్ సినిమాలో విలన్ పేరు అదేగా
మెహర్ ముందుచూపు... ఎన్టీఆర్ సినిమాలో విలన్ పేరు అదేగా
Embed widget