అన్వేషించండి

Kannappa Teaser: కేన్స్‌లో ‘కన్నప్ప’ టీజర్ చూపించిన విష్ణు - యూట్యూబ్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

Kannappa Teaser Release Date: ‘కన్నప్ప’ టీమ్ ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసింది. అక్కడ ‘కన్నప్ప’ టీజర్ ఆవిష్కరించారు. అతిరథ మహారథులను టీజర్ ఆకట్టుకున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు.

Kannappa Teaser Unveiled At Cannes 2024: ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మే 14న ప్రారంభమైన ఈ సినిమా వేడుకలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ దిగ్గజాలు పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ ఫెస్టివల్ లో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన పలు సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఇండియాకు చెందిన 7 సినిమాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప’ టీం సందడి

తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప’ చిత్రబృందం సందడి చేసింది. మోహన్ బాబు, విష్ణు మంచు, ప్రభుదేవా సహా పలువురు కేన్స్ ఫెస్టివల్‌ లో పాల్గొన్నారు. ఈ వేడుకలోనే ‘కన్నప్ప’ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘కన్నప్ప’ టీజర్‌ ను చూసి సినీ దిగ్గజాలు ముగ్దులయ్యారని హీరో మంచు విష్ణు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తీసుకున్న ఫోటోలతో పాటు సినిమాకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. “కేన్స్‌ లో మా ‘కన్నప్ప’ టీజర్‌ ను అందరికీ చూపించాం. టీజర్‌ ను చూసి అందరూ ప్రశంసించారు. ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్లు, అక్కడికి వచ్చిన ఇండియన్స్ ‘కన్నప్ప’ టీజర్‌ను చూసి ముగ్దులయ్యారు. ఆ రెస్పాన్స్ చూసిన తరువాత నాకు చాలా సంతోషం కలిగింది” అని చెప్పుకొచ్చారు.

మే 30న తెలుగులో.. జూన్ 13న ఇతర భాషల్లో ‘కన్నప్ప’ టీజర్ విడుదల

ఇక ‘కన్నప్ప’ టీజర్ ను ముందుగా తెలుగు ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు మంచు విష్ణు తెలిపారు. మే 30న తెలుగు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. జూన్ 13న ఇతర భారతీయ భాషల్లోరిలీజ్ చేస్తామని తెలిపారు. “మన భారతీయ ప్రేక్షకులకు జూన్ 13న ‘కన్నప్ప’ టీజర్ చూపించబోతున్నాం. అంతకు ముందే అంటే మే 30న తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు టీజర్ ను హైద్రాబాద్‌లోని పాపులర్ థియేటర్‌లో ప్రదర్శించనున్నాం. మా కన్నప్పను సోషల్ మీడియాలో మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న కొంత మంది సెలెక్టెడ్ ఆడియెన్స్‌ కు ఆ టీజర్‌ను చూపిస్తాం. మా టీం వారిని సెలెక్ట్ చేస్తుంది. కన్నప్ప టీజర్‌ను అందరికీ చూపించాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం” అని మంచు విష్ణు వెల్లడించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

‘కన్నప్ప’లో భాగం అవుతున్న పలువురు స్టార్ హీరోలు

అటు ‘కన్నప్ప’ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మంచు విష్ణు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పలువురు అగ్ర హీరోలు నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మీద పలు సన్నివేశాలు చిత్రీకరించారు. అనంతరం ప్రభాస్ కు సంబంధించిన సీన్లు షూట్ చేశారు.  

Read Also: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించే 7 ఇండియన్ సినిమాలు ఇవే!

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget