Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!
'బింబిసార' సినిమాను ఫ్రాంచైజీగా తీయాలనేది మేకర్స్ ఆలోచనట. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా చెప్పారు.

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'బింబిసార'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అంచనాలను మించి ఈ ట్రైలర్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కచ్చితంగా ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కి ఇండస్ట్రీ హిట్ పడుతుందని అంటున్నారు నందమూరి అభిమానులు. ఆగస్టు 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.
'బింబిసార' సినిమాను ఫ్రాంచైజీగా తీయాలనేది మేకర్స్ ఆలోచనట. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా చెప్పారు. ఈ ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన కళ్యాణ్ రామ్.. 'బింబిసార' సినిమాకి కొనసాగింపులుగా సినిమాలు వస్తాయని.. కనీసం నాలుగు భాగాలైనా చేయాలనేది ప్లాన్ అని అన్నారు. రెండో భాగాన్ని ఆగస్టు 2023లో రిలీజ్ చేస్తామని అన్నారు.
'బింబిసార' ఫ్రాంచైజీలో మీ సోదరుడు ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందా..? అనే ప్రశ్నకు స్పందించిన కళ్యాణ్ రామ్.. 'ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. నాలుగు రోజుల క్రితం దర్శకుడు వశిష్ట్ ఒక కథ చెప్పాడు. అన్నీ కుదిరితే ఆ సినిమాలో మేం కలిసి నటించవచ్చు' అని చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్. ఆ కథ 'బింబిసార2' అనే విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేయలేదు. బహుశా వేరే కథ అయి ఉంటుందని టాక్.
ఎన్టీఆర్ విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెడుతున్నారాయన. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ తరువాత ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు సానా లాంటి దర్శకులు లైన్ లో ఉన్నారు. మరి తన అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి సినిమా ఎప్పుడు చేస్తారో చూడాలి!
Also Read: 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే' - ట్రైలర్ అదిరిపోయింది!
Also Read: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!
ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే 🔥
— NTR Arts (@NTRArtsOfficial) July 4, 2022
Regal #BimbisaraTrailer out now!
-https://t.co/ZDQpkP7toQ#BimbisaraOnAugust5th #HappyBirthdayNKR@NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt pic.twitter.com/cM7s5jjWHP
త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడి విశ్వరూపం🔥
— NTR Arts (@NTRArtsOfficial) July 4, 2022
100K Likes & Counting for #BimbisaraTrailer💥
- https://t.co/ZDQpkP7toQ#Bimbisara #BimbisaraOnAugust5th @NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt pic.twitter.com/3tSYH7D56g
Before You Go
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్గ్రౌండ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















