అన్వేషించండి

Raayan: ‘రాయన్‌’ బ్లాక్ బస్టర్ హిట్, హీరో ధనుష్‌ కు నిర్మాత ఊహించని బహుమతులు, ఇంతకీ అవేంటో తెలుసా?

ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘రాయన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్నది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ధనుష్ కు అదిరిపో బహుమతులు అందించారు.

Kalanithi Maran Congratulates Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత కళానిధి మారన్.. ధనుష్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. స్వయంగా ఆయన దగ్గరకు వెళ్లి కలిసిన రెండు చెక్కులను అందించారు. వాటిలో ఒకటి హీరోగా నటించినందుకు, మరొకటి దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కించనందుకు అందజేశారు. ఈ ఫోటోలను సన్ పక్చర్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే, అమౌంట్ ఎంత అనే విషయాన్ని మాత్రం బయటకు వెళ్లడించలేదు.       

రూ. 150 కోట్లు వసూళు చేసిన ‘రాయన్’

ధనుష్ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా ‘రాయన్’ సినిమా తెరకెక్కింది. ధనుష్ కెరీర్ లో 50వ చిత్రంగా రూపొందింది. గ్యాంగ్ వార్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.  రెండు గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరాటంతో హీరో ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. తన ఫ్యామిలీని ధనుష్ ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమాలో చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. సుమారు రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.    

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్

థియేటర్లలో అద్భుత ప్రేక్షకాదరణ దక్కించుకున్న ‘రాయన్’ మూవీ మరికొద్ది గంటల్లో ఓటీటీలోకి రాబోతోంది.  శుక్రవారం(ఆగష్టు 23) నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను  అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ అమౌంట్ చెల్లించి దక్కించుకుంది. ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ‘రాయన్’ మూవీ ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. 

కీలక పాత్రలో హీరో సందీప్ కిషన్

‘రాయన్’ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. ప్రకాష్ రాజ్, ఎస్ జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాల మురళీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ధనుష్ సిస్టర్ గా దుర్గగా దుషారా విజయన్ అద్భుతంగా నటించింది. కాళిదాస్ జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్, దిలీపన్, ఇళవరసు ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ స్వరాలు అందించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.  

Also Read: మీరు ఏమైనా అనుకోండి... నాకు ఇష్టమైతే, నా మనసుకు నచ్చితే వెళ్తా... వైసీపీ క్యాండిడేట్‌కు సపోర్ట్ - నంద్యాల ఎపిసోడ్‌ మీద పవన్, నాగబాబుకు బన్నీ కౌంటర్?

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget