అన్వేషించండి

Kajol: లేటు వయసులో ఘాటు ముద్దులు, ఆ సీన్ కోసం కాజోల్ రిహార్సల్ కూడా చేసిందట!

బాలీవుడ్ నటి కాజోల్ లేటు వయసులో ఘాటు సన్నివేశాల్లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజా వెబ్ సిరీస్ ‘ది ట్రయల్’లో కిస్ సీన్లు చేసి షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం థియేట్రికల్ రిలీజెస్ కంటే ఓటీటీ కంటెంట్ కు బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్ లో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీ విషయంలో సెన్సార్ నిబంధనలు కూడా మరీ ఎక్కువగా ఉండకపోవడంతో నటీనటులు రెచ్చిపోయి నటిస్తున్నారు. దశాబ్దాల తరబడి సినిమా పరిశ్రమలో ఏ రోజు హద్దులు దాటి  నటించని వాళ్లు కూడా  ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లలో ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాల్లో కనిపిస్తున్నారు. తాజాగా రెండు దశాబ్దాల తన నో కిస్సింగ్ పాలసీని బ్రేక్ చేసి విజయ్ వర్మతో కలిసి ముద్దు సీన్లలో నటించింది తమన్నా. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ కూడా తమన్నా బాటలోనే నడుస్తోంది.

లేటు వయసులో ఘాటు సీన్లు

బాలీవుడ్ ముద్దుగుమ్మ కాజోల్ తాజాగా ‘ది ట్రయల్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో న్యాయవాది నొయొనికా సేన్‌గుప్తా పాత్రలో కనిపించింది. అయితే, ఈ సిరీస్ కోసం కాజోల్ తన 31 ఏండ్ల నో కిస్సింగ్ పాలసీని వదులుకుంది. సుమారు 5 పదుల వయసులో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. ఒకరితో కాదు, ఇద్దరితో ముద్దు సీన్లు చేసి ఆశ్చర్యపరిచింది.  ఈ సిరీస్ రెండు ఎపిసోడ్లలో అలీఖాన్ తో ఒకసారి, జిష్షూ సేన్ గుప్తాతో మరోసారి లిప్ లాక్ సీన్లలో నటించింది. ఈ సీన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాజోల్ సుమారు 3 దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నా, కిస్సింగ్ సీన్లు ఎప్పుడూ చేయలేదు. అందాల ఆరబోతతో అలరించిన ముద్దు సీన్ల జోలికి వెళ్లలేదు. లేటు వయసులో ఆమె చేసిన ఈ బోల్డ్ సీన్లు, ఆమె అభిమానులతో పాటు సినీ లవర్స్ ను ఆశ్చర్యపరుస్తున్నాయి. కొంత మంది ఆమె ను ఈ సన్నివేశాలు చేసినందుకు అభినందిస్తుండగా, మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఈ వయసులో ఆ సీన్లు అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  అమెరికన్ వెబ్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’ కు ‘ది ట్రయల్’ అనేది ఇండియన్ వెర్షన్. భర్త చేతిలో మోసపోయిన ఓ లాయర్ చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస రూపొందింది.  ఈ సిరీస్ లో కాజోల్ నటన పట్ల విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.  

రిహార్సల్ చేసి మరీ ముద్దు సీన్లలో నటించారట!

ఇక ఈ ముద్దు సీన్ గురించి అలీఖాన్ పలు విషయాలు వెల్లడించారు. ఈ కిస్సింగ్ సీన్లను ఓ హోటల్ లో చిత్రీకరించినట్లు చెప్పారు. అంతేకాదు, దర్శకుడు ఈ సీన్ షూట్ చేయడం కోసం క్లోజ్డ్ సెట్ ఏర్పాటు చేశారని చెప్పారు. అంటే, ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే సెట్‌లో ఉండేలా చూసుకున్నారు. అయితే, ఈ  సన్నివేశంలో నటిస్తున్నప్పుడు సిగ్గు, ఇబ్బంది,  సంకోచం కలగలేదని ఆయన వెల్లడించారు. అంతేకాదు, ఈ సన్నివేశాన్ని రెండుసార్లు రిహార్సల్ చేసి టేక్ కోసం వెళ్లినట్లు వివవరించారు. అంతేకాదు, రిహార్సల్స్ ను మానిటర్‌ లో చూసి ఓకే అనుకున్నాకే టేక్ చేసినట్లు చెప్పారు.

Read Also: ఆ విషయాల గురించి మాట్లాడ్డం ఇష్టం లేదు- తమన్నాతో ప్రేమాయణంపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Dheeraj Mogilineni : ఇండస్ట్రీ అంటే పెద్ద సినిమాలే కాదు - వెంకీ మూవీతో పోటీ పడలేం... 'సమ్మర్ హాలిడేస్' వాయిదాపై ప్రొడ్యూసర్ రియాక్షన్
ఇండస్ట్రీ అంటే పెద్ద సినిమాలే కాదు - వెంకీ మూవీతో పోటీ పడలేం... 'సమ్మర్ హాలిడేస్' వాయిదాపై ప్రొడ్యూసర్ రియాక్షన్
Godavari Serial Today October 22nd: 'గోదావరి' సీరియల్: సూర్య, జానుల లవ్‌ వీడియో వేసి పరువు తీసేసిన సింహాద్రి! జానుకి అండగా సంజయ్!
'గోదావరి' సీరియల్: సూర్య, జానుల లవ్‌ వీడియో వేసి పరువు తీసేసిన సింహాద్రి! జానుకి అండగా సంజయ్!
KilleR Movie: మూవీ ట్విస్ట్‌ కనిపెట్టండి... కోటి గెలుచుకోండి - 'కిల్లర్' టీమ్ బంపర్ ఆఫర్
మూవీ ట్విస్ట్‌ కనిపెట్టండి... కోటి గెలుచుకోండి - 'కిల్లర్' టీమ్ బంపర్ ఆఫర్
Nindu Manasulu Serial Today October 22nd: నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!
నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Embed widget