అన్వేషించండి

Jyothy Poorvaj: ‘కిల్లర్‘గా బుల్లితెర బ్యూటీ, జగతి మేడం ఫస్ట్ లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

తెలుగు బుల్లితెరపై ‘జగతి మేడం’గా పాపులారిటీ సంపాదించుకున్న జ్యోతిరాయ్, టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగు పెడుతోంది. తాజాగా ఆమె నటిస్తున్న ‘కిల్లర్’ ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

Killer Part 1: Dream Girl First Look: తెలుగు సినిమా పరిశ్రమలోకి మరో బుల్లితెర బ్యూటీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటి వరకు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతి  రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్ ఇప్పుడు వెండితెరపై సందడి చేయబోతోంది. గత కొద్ది రోజులుగా తానో తెలుగు సినిమా చేయబోతున్నట్లు హింట్స్ ఇస్తూ వచ్చింది జ్యోతి.. ఎట్టకేలకు తన సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. తన భర్త పూర్వజ్ దర్శకత్వంలోనే ఈ సినిమా చేస్తున్నట్లు తెలిపింది. ఆమె భర్త ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటిస్తున్నాడు. భార్యా భర్తల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు ‘కిల్లర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించబోతున్నట్లు వెల్లడించారు.   

ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్  

‘కిల్లర్’ సినిమాను రెండు, మూడు పార్టులుగా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తొలి భాగానికి ‘కిల్లర్' పార్ట్ -1 డ్రీమ్ గర్ల్ అనే టైటిల్ ను  ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్ లో జ్యోతి పూర్వజ్ ఒక భుజానికి వెజిటేబుల్స్ బ్యాగ్, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని ఉంది. అద్దంలో ఆమె రిఫ్లెక్షన్ పవర్ ఫుల్ వుమెన్ రోబోను చూపిస్తోంది. మోషన్ పోస్టర్ లో చూపించిన ఎలిమెంట్స్ అన్నీ ‘కిల్లర్’ మూవీపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇప్పటికే బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు వెండితెరపైనా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj)

‘గుప్పెడంత మనసు’ సీరియల్ తో మంచి పాపులారిటీ   

జ్యోతి పూర్వజ్ తెలుగులో ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ లో ఆమె జగతి మేడంగా నటించి, ఉభయ తెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ ముద్దుగుమ్మ పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారులో సెగలు రేపుతుంటుంది. ఓ వైపు హాట్ లుక్ లో కనిపిస్తూనే, మరోవైపు ట్రెడిషనల్ గా ఆకట్టుకుంటుంది. కొద్ది నెలల క్రితం యంగ్ డైరెక్టర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కొంత కాలం పాటు తమ పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన అమ్మడు, ఆ తర్వాత అసలు విషయం చెప్పింది. ఇప్పుడు తన భర్తతో కలిసి సినిమాలో నటిస్తోంది. 

ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన జ్యోతి

జ్యోతి పూర్వజ్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ లాంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను అలరించింది. ఇప్పుడు ‘కిల్లర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఏయు అండ్ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ  పద్మనాభరెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  జగదీశ్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా,  అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం మ్యూజిక్ అందిస్తున్నారు. 

Read Also: తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rakasa Movie : ఓయ్ హీరోయిన్‌తో కంపేరిజన్ - రాకాస డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే?
ఓయ్ హీరోయిన్‌తో కంపేరిజన్ - రాకాస డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే?
Youth OTT : ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ యూత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ యూత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Biker First Review: స్పోర్ట్స్‌ డ్రామా 'బైకర్' ఫస్ట్ రివ్యూ... శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?
స్పోర్ట్స్‌ డ్రామా 'బైకర్' ఫస్ట్ రివ్యూ... శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?
Ramayan Teaser : రామాయణ Vs ఆది పురుష్ - శ్రీరాముడిగా రణబీర్ లుక్‌పై ప్రశంసలు... ఓం రౌత్‌పై ట్రోలింగ్
రామాయణ Vs ఆది పురుష్ - శ్రీరాముడిగా రణబీర్ లుక్‌పై ప్రశంసలు... ఓం రౌత్‌పై ట్రోలింగ్

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Nara Lokesh in Delhi: అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Bhumana Karunakar Reddy : భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
Ranabaali Leaks : రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
West Bengal Latest News:పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
Akshaya Tritiya Date 2026: అక్షయ తృతీయ ఏప్రిల్ 19 or 20? తేదీ, ముహూర్తం, పూజా విధానం పూర్తి వివరాలు తెలుసుకోండి
అక్షయ తృతీయ ఏప్రిల్ 19 or 20? తేదీ, ముహూర్తం, పూజా విధానం పూర్తి వివరాలు తెలుసుకోండి
Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
Embed widget