Chalapathi Rao: ‘లే బాబాయ్.. లే..’ అంటూ ఎన్టీఆర్ భావోద్వేగం - రవిబాబుకు వీడియో కాల్
చలపతిరావు మరణంపై జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. బాలకృష్ణ, చిరంజీవి తదితర సెలబ్రిటీలు సైతం చలపతిరావు మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.

సినీ నటుడు చలపతిరావు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ ట్రిప్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ చలపతిరావు మరణవార్త విని షాకయ్యారు. వెంటనే చలపతిరావు కుమారుడు రవిబాబుకు వీడియో కాల్ చేశారు. చలపతిరావు పార్థీవ శరీరాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘లే బాబాయ్ లే..’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నందమూరి ఫ్యామిలీ ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయిందని ఎన్టీఆర్ తెలిపారు. తాతగారి రోజుల నుంచి చలపతి బాబాయ్ తమకు ఎంతో ఆప్తుడని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు.
— Jr NTR (@tarak9999) December 25, 2022
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన.
నందమూరి బాలకృష్ణ కూడా చలపతిరావు మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ‘‘చలపతిరావు గారు తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించారు. నిర్మాతగా కూడా మంచి చిత్రాలని నిర్మించారు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. మా కుటుంబంతో చలపతిరావు గారికి అవినాభావ సంబంధం వుంది. నాన్నగారితో కలసి అనేక చిత్రాల్లో నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. చలపతిరావు మా కుటుంబ సభ్యుడు. చలపతిరావు గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని తెలిపారు.
చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా తమ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘విలక్షణమైన నటుడు,తనదైన శైలి తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ చలపతి రావు గారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది.ఎన్నో చిత్రాల్లో ఆయన తో నేను కలిసి నటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబు కి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి’’ అని పేర్కొన్నారు.
విలక్షణమైన నటుడు,తనదైన శైలి తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ చలపతి రావు గారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది.ఎన్నో చిత్రాల్లో ఆయన తో నేను కలిసి నటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబు కి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2022
చలపతిరావు మరణంపై రవిబాబు మీడియాతో మాట్లాడుతూ.. చలపతిరావు కొడుకు రవి బాబు ‘‘రాత్రి ఎనిమిది గంటలకు నాన్న గారు చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం మహా ప్రస్థానం కు తీసుకొని వెళ్తాం. బుధవారం అంత్యక్రియలకు తీసుకెళ్తాం. అమెరికా నుంచి చెల్లెళ్లు రావాలి. అందుకే అంత్యక్రియలను బుధవారానికి వాయిదా వేశాం’’ అని తెలిపారు.
మోహన్ బాబు సంతాపం
Om Shanti! 🙏
— Mohan Babu M (@themohanbabu) December 25, 2022
Sri Chalapathi Rao Garu! pic.twitter.com/bJWhFD7eGQ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

