అన్వేషించండి

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తన తల్లిని తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

తిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తన తల్లిని తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. ఆగస్టు 13న శ్రీదేవి జయంతి. ఈ నేపథ్యంలోనే తన తల్లితో కలిసి తీసుకున్న చిన్ననాటి ఫోటోను జాన్వీ ఫోస్ట్ చేసింది. “హ్యాపీ బర్త్ డే అమ్మా. ప్రతి రోజు నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను” అని తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. తన తల్లి అంటే ఎంతో ఇష్టం అని జాన్వి పలు సందర్భాల్లో చెప్తూనే ఉంది.

తల్లి మీద ప్రేమతో తన చేతి మీద అప్పట్లో ఒక పచ్చ బొట్టు వేయించుకుంది. 'ఐ లవ్యూ మై లబ్బూ' అని టాటూ పొడిపించుకుంది. అది మొదట ఎవరో బాయ్ ఫ్రెండ్ పేరని సోషల్ మీడియాలో చర్చ కూడా నడిచింది. కానీ వాటన్నిటికీ తెర దించుతూ అది తన తల్లి గురించి అని చెప్పుకొచ్చింది. టాటూలో ఉన్న లబ్బూ పేరు జాన్విదే. ఆ టాటూలో ఉన్న వ్యాఖ్యలు దివంగత శ్రీదేవి రాసిన గోల్డెన్ వర్డ్స్. 

జాన్విని ఉద్దేశిస్తూ శ్రీదేవి పేపరు మీద అలా రాశారట. జాన్విని ఆమె లబ్బూ అని ముద్దుగా పిలిచేవారట. ‘‘నువ్వు ఈ ప్రపంచంలోనే బెస్ట్ బేబీవి. ఐ లవ్యూ మై లబ్బూ” అని శ్రీదేవి రాసిన ఆ పదాలు చెక్కు చెదరకుండా ఉండేందుకు ఆ పదాలను తన చేతి మీద టాటూలా వేయించుకుంది. శ్రీదేవి పేపరు మీద రాసిన హ్యాండ్ రైటింగ్ నే యథావిధిగా టాటూ పొడిపించుకుంది. ఆ నొప్పిని భరించలేక ఆమె.. గోవింద.. గోవిందా.. అంటూ దేవుడినే తలుచుకుంది.

జాన్వి కపూర్ తెలుగులో పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NTR30 చిత్రంలో జాన్వీ హీరోయిన్ అనే ప్రచారం జరిగింది. అది కూడా ఎంతవరకు వాస్తవమనేది తెలియరాలేదు. కానీ, ఈ కాంబోపై మాత్రం ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో కూడా జాన్వీ కపూర్.. ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమనేది అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తుంది.

Also Read : కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Also Read : బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రీమేక్స్ ఇవే!

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget