అన్వేషించండి

Janhvi Kapoor: అమ్మకు హిందీ రాదు, నాకు తెలుగు రాదు - ‘దేవర’ సెట్‌లో నన్ను ‘టేప్ రికార్డ్’ అని ఆటపట్టిస్తున్నారు: జాన్వీ కపూర్

Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ‘దేవర‘ మూవీ గురించి కీలక విషయాలు వెల్లడించింది. భాష సమస్య ఉన్నప్పటికీ, శక్తివంచన లేకుండా కష్టపడుతున్నట్లు చెప్పింది.

Janhvi Kapoor About Devara: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘దేవర‘ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ విలన్ గా కనిపించబోతున్నారు. తాజాగా ‘కాఫీ విత్ కరణ్‘ షోలో తన చెల్లి ఖుషీ కపూర్ తో కలిసి పాల్గొన్న జాన్వీ, ‘దేవర‘ సెట్ లో అనుభవాల గురించి చెప్పింది.

అమ్మ, నేను సేమ్, కానీ- జాన్వీ కపూర్

‘దేవర‘ షూటింగ్ చాలా సరదగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది జాన్వీ కపూర్. తన తల్లి శ్రీదేవి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు హిందీ వచ్చేది కాదని చెప్పింది. ఇప్పుడు తెలుగు రాకుండానే తాను టాలీవుడ్ లోకి  ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పింది. “మా అమ్మ శ్రీదేవికి, నాకు ఓ కామన్ పాయింట్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కూడా. హిందీ సినిమాలు చేయడం మొదలు పెట్టినప్పుడు, ఆమెకు హిందీ సరిగా వచ్చేది కాదు. అందరు ఆమెను  ‘చిలుక’ అని పిలిచేవారు. ఇప్పుడు నేను తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాను. నాకు తెలుగు తెలియదు. తమిళం మాత్రమే వచ్చు. నేను సెట్ లో నా డైలాగులను రికార్డు చేసుకుంటాను. అందుకని మా డీఓపీ రత్నవేలు సర్ నన్ను ‘టేప్ రికార్డర్’ అని పిలుస్తూ ఆటపట్టిస్తున్నారు. ‘దేవర’ సెట్ లో అందరం ఓ కుటంబ సభ్యుల్లా ఉండటం సంతోషం కలిగిస్తోంది” అని చెప్పుకొచ్చింది.

సంపూర్ణ నటిగా కనిపించబోతున్నా- జాన్వీ

ఇక ‘దేవర’ సినిమా తనకు ఎన్నో కొత్త విషయాలను నేర్పిస్తుందని జాన్వీ వెల్లడించింది. తన కెరీర్ లో తొలి రెండు సంవత్సరాలు తలలేని కోడి మాదిరిగా గడిచిపోయాయన్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు తనకు ఓ వర్క్ షాప్ లా పనికి వచ్చాయని చెప్పింది. “నేను ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఒక ఎత్తు, ‘దేవర’ సినిమా మరోఎత్తు. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాలు ఓ వర్క్ షాప్ లా పనికి వచ్చాయి. ఈ సినిమాలో డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఈ సినిమాతో నాలోని నటిని పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాం. ఈ సినిమా అనుభవాలను బేస్ చేసుకుని నా సినీ కెరీర్ ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తాను” అని తెలిపింది.

ఏప్రిల్ 5న ‘దేవర 1’ విడుదల

ఇక 'ధడక్‌' సినిమాతో సినీ అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్‌,  ఆ తర్వాత 'గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌', 'రూహి', 'మిలీ' లాంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ సినిమా చేస్తోంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను జనవరి 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతదేశంలోని తీర ప్రాంతాల కథ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Read Also: ఆమాట విని తారక్ సీరియస్ అయ్యారు, రామ్ చరణ్ బ్రేక్ తీసుకుందాం అన్నారు - రాజీవ్ కనకాల

టాప్ హెడ్ లైన్స్

Indraja: స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా ప్రయత్నం అంబికను పట్టిస్తుందా! క్రిష్ పోలికలు కరెక్ట్‌గా చెప్పగలడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా ప్రయత్నం అంబికను పట్టిస్తుందా! క్రిష్ పోలికలు కరెక్ట్‌గా చెప్పగలడా!
Fauzi Vs Spirit: 'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
Mandaadi Collections: 'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget