By: ABP Desam | Updated at : 31 Jan 2023 05:52 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Youtube
ప్రియాంక జైన్ అంటే ఎవరికి అంతగా తెలియకపోవచ్చు. కానీ జానకి అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు. ‘జానకి కలగనలేదు’ సీరియల్ కథానాయికగా అందరి మన్ననలు పొందింది ప్రియాంక జైన్. తన సహచర నటుడు ‘మౌనరాగం’ హీరో శివకుమార్ ని త్వరలోనే పెళ్లాడబోతోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నెవర్ ఎండింగ్ టేల్స్ పేరుతో యూట్యూబ్ లో ఛానెల్ లో వాళ్ళ వీడియోలు పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి డ్రీమ్ హోమ్ టూర్ చేశారు.
సొంతిల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. అది చూసిన తర్వాత వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేరు. ఇప్పుడు ఆ ఆనందాన్ని శివకుమార్, ప్రియాంక జైన్ అనుభవిస్తున్నారు. తమ డ్రీమ్ హోమ్ కల నేరవేరింది అంటూ సంతోషంగా వీడియో పోస్ట్ చేశారు. కర్ణాటకలోని బెల్గాంలో రూ.57 లక్షలు పెట్టి ఈ ఇల్లు కొనుగోలు చేసినట్టు శివకుమార్ వీడియోలో చెప్పారు. ఈ ఇంట్లోకి ముందుగా శివకుమార్ పెంచుకుంటున్న కుక్క లూసీ అడుగు పెట్టింది. అది చూసి ఇద్దరూ తెగ సంతోషపడిపోయారు. ఈ ముచ్చటైన జంట ట్రిపుల్ బెడ్ రూమ్ డ్రీమ్ హోమ్ ఎలా ఉందో మీరు కూడా ఈ లుక్కేయండి.
‘స్టార్ మా’లో ప్రసారమైన ‘మౌనరాగం’ సీరియల్ తో శివకుమార్, ప్రియాంక జైన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సీరియల్ లో ప్రియాంక అమ్ములు మూగ అమ్మాయిగా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులని కట్టి పడేసింది. తాజాగా జానకి కలగనలేదు సీరియల్ లో జానకి పాత్ర పోషిస్తుంది. బాధ్యత కలిగిన ఇంటి కోడలిగా, పెళ్లి అయిన తర్వాత కూడా తన ఐపీఎస్ కల నెరవేర్చుకోవాలని తపన పడే ఓ గృహిణిగా చక్కగా నటిస్తోంది. ఇక శివకుమార్ ‘ఇంటికి దీపం ఇల్లాలు’ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ప్రియాంక, శివకుమార్ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ త్వరలోనే ఏడడుగుల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటీవలే బ్యాచిలర్ పార్టీ చేసుకోవడం కోసం బ్యాంకాక్ వెళ్లారు. అక్కడ బాగా ఎంజాయ్ చేసిన వీడియో కూడా ప్రియాంక జైన్ తన నెవర్ ఎండింగ్ టేల్స్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది.
ఇటీవలే సీరియల్ కోసం ఎన్ని పాట్లు పడతామో తెలుపుతూ వీడియో పోస్ట్ చేసింది. జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ తో కలిసి షూటింగ్ సెట్ లో ప్రాంక్ వీడియో చేసింది. అందులో రామా, జానకి గొడవపడటం తర్వాత అదంతా ఉత్తుత్తిదే అని చెప్పారు.
అసలేం జరిగిందంటే.. జానకి, రామా ప్లాన్ ప్రకారం అందరి ముందు గొడవపడినట్లుగా నటించారు. ‘‘ప్రతిదీ మీరు చెప్పినట్టే చేయడం కుదరదు’’ అని జానకి.. రామాతో వాదనకి దిగింది. ఇలా అయితే ప్రతిసారీ చేయలేనని అనేసింది. దానికి రామా ఎందుకు తనంత ఓవర్ యాక్షన్ చేయడం అని అన్నాడు. ఓవర్ యాక్షన్ ఎవరు చేస్తున్నారని జానకి అనేసరికి మీరే చేస్తున్నారని రామా గట్టిగా అన్నాడు. వాళ్ళ గొడవ విని అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రామా పక్కనే మల్లిక, గోవిందరాజులు ఉంటారు. మల్లిక రామాని ఆపేందుకు చూస్తుంది. విసిగిపోయిన జానకి ఇలా అయితే షూటింగ్ చేయలేమని సీరియస్ అయ్యింది. ఇది ఎంత వరకు వెళ్తుందో అని అందరూ కంగారుగా చూస్తూ ఉంటే జానకి చివర్లో ఇది ప్రాంక్ అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. తన తమ్ముడు మంచోడు ఇలా మాట్లాడడు అని మల్లిక వెనకేసుకొచ్చింది.
తర్వాత జానకి సీరియల్ కోసం పడే పాట్లు ఎలా ఉంటాయో చూపించారు. పొలాల్లో ఎండకి తిరగడం ఎలా ఉంటుందో తమ బాధలు ఏంటో చెప్పుకొచ్చారు. సీరియల్ లో అమాయకంగా కనిపించే రామా బయట మాత్రం ఫుల్ గా అల్లరి చేస్తూ కనిపించాడు. సెట్లో అందరూ తోటి వారితో కలిసిపోయి ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు.
Also Read: జానకిని మెచ్చుకున్న గోవిందరాజులు - అసూయ పడుతున్న అఖిల్, మల్లిక
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా
Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక
డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత
'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది
మాధురీ దీక్షిత్‌పై అసభ్య వ్యాఖ్యలు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగల్ నోటీసులు జారీ
Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!
EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు
PAN- Aadhaar Link: పాన్-ఆధార్ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?
Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?