News
News
X

Janaki Kalaganaledu August 31st Update: జెస్సి ఫోటోలు చింపేసిన అఖిల్- జెస్సీకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చిన జానకి

జానకి కలగనలేదు సీరియల్ ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. జానకిని జ్ఞానంబ ఐపీఎస్ చదివిస్తుందని కుళ్ళుకుంటున్న మల్లిక కడుపు నాటకానికి తెర తీస్తుంది.

FOLLOW US: 

జెస్సీకి నెలతప్పిందని తెలిస్తే అమ్మ రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుందని అఖిల్ ఆలోచిస్తూ టెన్షన్ పడతాడు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, జెస్సి గొడవ చేయకుండా ఇప్పుడు ఎలా నచ్చజెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే జానకి అది గమనించి పిలుస్తుంది. ఏంటి అలా ఉన్నావ్ అని అడుగుతుంది. అదేమీ లేదు వదినా నేను బాగానే ఉన్నాను అని చెప్తాడు. నేను నిన్ను గమనించాను నువ్వు జెస్సితో మాట్లాడటం నేను చూశాను నిజం ఎంతో నీ నోటితో నువ్వే చెప్తే బాగుంటుంది, అబద్ధం చెప్తున్నావ్ నిజం దాస్తున్నావ్ అని నిలదిస్తుంది. తను ఎందుకు కోపంగా ఉంది నువ్వెందుకు బ్రతిమలాడుతున్నావ్ అని అడుగుతుంది. అంటే జెస్సి మాట్లాడటం చూసింది కానీ ఏం మాట్లాడిందో వినలేదు అని మనసులో అఖిల్ అనుకుని ఏదో చెప్పి కవర్ చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ జానకి మాత్రం అది నమ్మదు. వీలైనంత తొందరగా మి ఇద్దరి మధ్య స్నేహాన్ని కూడా తగ్గిస్తే అందరికీ మంచిదని జానకీ హెచ్చరిస్తుంది.

అఖిల్ గదిలోకి వచ్చి తన పుస్తకాలు చెక్ చేస్తూ ఉంటుంది. అది అఖిల్ చూసి టెన్షన్ పడతాడు. ఎందుకు వదినా నా బుక్స్ చెక్ చేస్తున్నావ్ నన్ను నమ్మడం లేదా అని అడుగుతాడు. నమ్మకం అనేది చెప్పే మాటల్లో కాదు చేసే పనుల్లో ఉంటుందని అంటుంది. జెస్సి విషయంలో అనుమానిస్తునావా అని అడుగుతాడు. నీ మీద అనుమానంతో కాదు అత్తయ్యగారు, మీ అన్నయ్య బాధపడకూడదని. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది. మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్తాడు అఖిల్. నువ్వు చదివేది కంప్యూటర్ ఇంజనీరింగ్ మరి మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్తున్నావ్, నీ తడబాటే నువ్వు తప్పు చేస్తున్నావ్ అని చెప్తుంది. ఆ మాటలు అటుగా వెళ్తూ రామా వింటాడు.

Also Read: నిజం తెలుసుకుని షాకైన సామ్రాట్- నందు, తులసీల సవాల్, అభి-ప్రేమ్ ల మాటల యుద్ధం

జానకీ వెళ్లిపోగానే పుస్తకంలో ఉన్న జెస్సితో కలిసి ఉన్న ఫోటోస్ చింపేస్తాడు అఖిల్. ఇంట్లో పండగ బాగా జరిగింది కదా అని జ్ఞానంబ సంబరంగా చెప్తుంది. అటుగా వెళ్తున్న అఖిల్ ఫోన్ ని గోవిందరాజులు తీసుకుంటాడు. కృష్ణాష్టమి ఫోటోలు ఇందులో ఉన్నాయి చూద్దామని ఇంట్లో అందరినీ పిలుస్తాడు. ఫోన్ లో ఫోటోలు ఎక్కడ ఉన్నాయో చూపించమని అఖిల్ ని అడుగుతాడు. అప్పుడే జెస్సి ఫోన్ చేస్తుంది. కట్ చేస్తాడు కానీ జెస్సి పదే పదే ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను అని జ్ఞానంబ అడుగుతుంది. జెస్సి వాట్సప్ లో వాయిస్ మెసేజ్ పంపిస్తుంది.

అఖిల్ తర్వాత జెస్సీకి ఫోన్ చేసి మాట్లాడతాడు. రామా, జానకిని తీసుకుని కాలేజీకి వెళ్తుంటే అఖిల్ అడ్డుపడి బైక్ కావాలని అడుగుతాడు. ఫ్రెండ్స్ తో కలిసి కంబైన్డ్ స్టడీస్ కి వెళ్తున్నా అని చెప్పడంతో జానకీ అనుమానిస్తుంది. నీకు అంతా డౌట్ ఉంటే నేను వెళ్లనులే అంటాడు. జానకీ వద్దని చెప్తున్నా వినకుండా రామా తన బైక్ ఇస్తాడు. నా ఆశలన్నీ అఖిల్ మీద పెట్టుకున్నా వాడి మీలాగా చదువుకోవాలని ఆశపడతాడు. రామాగారు ఏమో అఖిల్ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నాడు కానీ అఖిల్ మాత్రం ప్రేమ అంటూ జెస్సి చుట్టూ తిరుగుతున్నాడు అని జానకి ఆలోచిస్తూ ఉంటుంది.    

Also Read: మాధవ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య-సూపరంటే సూపర్ అంతే

Published at : 31 Aug 2022 10:23 AM (IST) Tags: Janaki Kalaganaledu Serial Today Episode Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial Today Janaki Kalaganaledu August 31st

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!