అన్వేషించండి

Jagadhatri Serial Today December4th: ఇంద్రాణి డబ్బులు అణాపైసలతో సహా ఇచ్చేసిన కౌషికి...అప్పు చేసినందుకు నిషిక చెంప పగులగొడుతుంది..

Jagadhatri Serial Today Episode December4th: నిషిక తీసుకున్న అప్పు మొత్తం కట్టేసిన కౌషికి...మరోసారి ఇలాంటి తప్పు చేయవద్దంటూ నిషిక చెంప పగులగొడుతుంది.

Jagadhatri Serial Today Episode:  ఇంద్రాణికి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేసి ఇంద్రాణిని బయటకు వెళ్లిపోవాలని కౌషికి హెచ్చరిస్తుంది.  నీ కళ్లలో బాధ చూడాలన్న నా ఆశ తీరడం లేదనుకుంటూ  ఇంద్రాణి ఇక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత  నిషిక ఏదో చెప్పబోతుండగా...కౌషికి ఆమె చెంప పగులగొడుతుంది. ఇంకోసారి ఈఇంటి పరువును శత్రువుల వద్ద తాకట్టు పెడితే చంపేస్తానంటూ మండిపడుతుంది. వైజయంతి అడ్డురాగా....మీరే ఇలా వెనకేసుకొచ్చి సగం చెడగొట్టారని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈఇంట్లో నీకు ఏమి తక్కువ అయ్యయాని ఇలాంటి పనిచేశావని సుధాకర్‌ కోడలిని నిలదీస్తాడు..నాకు ఇంట్లో అన్నీ తక్కువే అయ్యాయి మామయ్య అంటుంది. ఇంట్లో ఏం చేయాలన్నా అందిరి పర్మిషన్లు తీసుకోవాలి  అని అంటుంది. మిమ్మల్ని డబ్బులు అడిగితే  ఏవో కారణాలు చెప్పారు.మరి ఏం చేయమంటారు అని నిలదీస్తుంది. మీరు ఇవ్వరు..నేను కూడా తెచ్చుకోకూడదా అని అంటుంది.  ఇంద్రాణిని అప్పు అడిగే బదులు...వదినను అడిగితే ఇచ్చేది కదా అని జగధాత్రి అంటుంది. తప్పు నాదే కాదు..మీది కూడా ఉందంటూ కోపంగా లోపలికి వెళ్లిపోతుంది.మాటలతో మందలించకుండా  చేయిచేసుకున్నావు ఎందుకు అని వైజయంతి కౌషికిని అంటుంది. ఆమె కూడా కోడలి వెంట లోపలికి పరుగు పెడుతుంది. నిషిక డబ్బులు తీసుకున్న విషయం నీకు ముందే తెలుసా అని యువరాజును కౌషికి నిలదీస్తుంది. తెలుసు అని అంటాడు. అందరూ యువరాజును కూడా తిట్టి లోపలికి వెళ్లిపోతారు.

   ఇంట్లో కోపంతో రగిలిపోతున్న భార్యను  యువరాజు ఓదార్చుతాడు. ఇంద్రాణి దగ్గర డబ్బులు తీసుకోవడం మన తప్పేనని అంటాడు. ఇంతలో వైజయంతి అక్కడికి వచ్చి ఇంద్రాణిపై కోపం కౌషికి నీపై చూపిందిలే...ఇవన్నీ పట్టించుకోవద్దని అంటుంది. ఇంంకా ఎన్నాళ్లు ఇలా ఉండాలమ్మా అని యువరాజు అంటాడు. జగధాత్రి వాళ్లను నెత్తిన పెట్టుకుని మమ్మల్ని మాత్రం శత్రువులుగా చూస్తోంది అంటాడు. ఇంతలో కోడలు కూడా అత్తపై మండిపడుతుంది.ఆ కేదార్‌,జగధాత్రి ఇంట్లో ఉండకపోతే...నేను వాళ్లతో పోటీపడటానికి ఆ ఇంద్రాణితో చేతులు కలిపేదాన్ని కాదు కదా అంటుంది. నేను మీ సంతోషం కోసమే కదా అన్ని చేస్తాను అనగా....మా సంతోషం కోసమే పెళ్లికి ముందు ఆ శ్రీవల్లిని కన్నారా అని అనడంతో...వైజయంతికి కోపం వస్తుంది. మామయ్య చేసిన ఘనకార్యం నుంచి  ఎలా బయటపడాలి....వాళ్లను ఎలా బయటకు పంపాలని మేం చస్తుంటే...మీరు ఇంకో బిడ్డను తెచ్చి మా నెత్తిన పెట్టారంటుంది. మాకు దక్కాల్సిన ఆస్తి మేం ఎలా అయినా దక్కించుకుంటాం అంటుంది.

ఇంతలో కేదార్‌,జగధాత్రి భోజనం ప్లేట్ పట్టుకుని  నిషిక రూమ్‌కు వస్తారు. నువ్వు భోజనం చేయలేదు కదా...అందుకే తెచ్చామని చెబుతారు. నాకు ఏ భోజనం వద్దు అంటుంది నిషిక. నువ్వు సిరికి నెక్లెస్ గిప్ట్‌గా ఇవ్వాలనుకోవడం తప్పుకాదని....కానీ అందుకోసం ఎవరికి చెప్పకుండా ఇంద్రాని వద్ద అప్పు చేయడమే తప్పని జగధాత్రి అంటుంది. నిషిక భోజనం తినిపించడానికి జగధాత్రి ట్రై చేస్తుంది. ఇంతలో ఆమెపైనే నిషిక మండిపడుతుంది. మీవల్లే  ఇంట్లో మాకు గౌరవం లేకుండా పోయిందని తిడుతుంది. నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోందని ఇష్టానుసారం మాట్లాడుతుంది. అయినా సరే నిషికకు అన్నం తినిపించడానికి జగధాత్రి ట్రై చేయడంతో...అన్నం ప్లేట్ విసిరికొడుతుంది. నిన్ను చంపేస్తానంటూ జగధాత్రి గొంతు పట్టుకోగా....అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె తండ్రి...నిషికపై చేయి ఎత్తుతాడు. జగధాత్రి ఆయన్ను ఆపుతుంది. వైజయంత్రి కూడా జగధాత్రి వల్లే నీ కూతురు ఇబ్బంది పడుతోందని చెప్పగా...ఆయన వారిస్తాడు.  ఇంతలో నిషిక....నేను చెడు, అది మంచిదా అని నిలదీస్తుంది. మీ అక్క దేవత లాంటిదని చెబుతాడు. చిన్నప్పటి నుంచి నువ్వు జగధాత్రిని భాదపెడుతున్నా...అది నిన్ను ప్రేమిస్తూనే ఉందని చెబుతాడు. ఇదే కదా నువ్వు కోరున్నది అని నిషిక మళ్లీ జగధాత్రిని అంటుంది. నా వాళ్ల దగ్గర నున్ను చెడుగా చిత్రీకరించడమే కదా నువ్వు చేసేది అని అంటుంది. జరిగిందంతా నాకు తెలుసుని...తప్పు చేసింది నువ్వునని,అన్నం విసిరికొట్టినందుకు అక్కకు సారీ చెప్పమని నిషిక తండ్రి ఆదేశిస్తాడు. వైజయంతి,యువరాజు కూడా  ఆమెకు నచ్చజెప్పడంతో నిషిక...జగధాత్రికి సారీ చెబుతుంది. కిందకు వచ్చి అన్నం తినమని జగధాత్రి అడుగుతుంది. దీంతో అందరూ కిందకు వస్తారు...

    ఇంతలోసుధాకర్‌,కౌషికి కిందే ఉండటంతో  నిషిక వాళ్ల తండ్రి వాళ్లను పలకరించి...అనాథ ఆశ్రమం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానిస్తాడు. తానే దగ్గర ఉండి కట్టించానని అనడంతో....మాకు చెప్పలేదేంటి నాన్న అని జగధాత్రి అడుగుతుంది. నీకు సర్‌ప్రైజ్ ఇద్దామనే చెప్పలేదంటాడు. ఏంటదని అడగ్గా...ఆశ్రమానికి మీ అమ్మ పేరు పెట్టానని చెబుతాడు. ఆవిడ మన ఇంటి పరువు తీసినందుకా  ఎందుకు  ఆమె పేరు పెట్టారని నిషిక నిలదీస్తుంది. మంచి జరిగేప్పుడు  ఈ డిస్కషన్‌ ఎందుకు  మీరు వెళ్లిరండి మేమంతా ఉదయమే వస్తామని సుధాకర్‌ చెప్పడంతో నిషిక తండ్రి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

టాప్ హెడ్ లైన్స్

Thrigun Jangaa First Look: 'బిగ్ బాస్' త్రిగుణ్ హీరోగా 'జంగా'... హౌస్‌లో హీరో - కానీ ఫస్ట్ లుక్ వచ్చేసింది
'బిగ్ బాస్' త్రిగుణ్ హీరోగా 'జంగా'... హౌస్‌లో హీరో - కానీ ఫస్ట్ లుక్ వచ్చేసింది
RC17 Concept Poster : మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ - రామ్ చరణ్, సుకుమార్ RC17 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్... స్టోరీ అదేనా?
మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ - రామ్ చరణ్, సుకుమార్ RC17 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్... స్టోరీ అదేనా?
Mailu Rayi: నిర్మాతగా హన్సిక... నాగబాబు చేతుల మీదుగా 'మైలురాయి' టైటిల్ పోస్టర్ లాంచ్
నిర్మాతగా హన్సిక... నాగబాబు చేతుల మీదుగా 'మైలురాయి' టైటిల్ పోస్టర్ లాంచ్
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget