Janhvi Kapoor With Jr NTR: ఎన్టీఆర్ చిత్రంతో జాన్వీ కపూర్ ఎంట్రీ? కానీ, కొరటాల సినిమాతో కాదట!
జాన్వీ కపూర్ ఎన్టీఆర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్త మరోసారి చక్కర్లు కొడుతోంది. అయితే, ఆమె నటించేంది కొరటాల చిత్రంలో కాదట.
RRR చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్‌కు ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. ప్రస్తుతం RRR షూటింగ్, ప్రమోషన్లు పూర్తి చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఇప్పుడు తన తర్వాతి చిత్రంతో దృష్టిపెట్టారు. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు తర్వాతి చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన.. జాన్వీ కపూర్ నటిస్తుందని తెలిసింది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలనే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు జతగా బాలీవుడ్‌లో పాపులరైన హీరోయిన్ల పేర్లను పరిశీలించగా జాన్వీ పేరు చర్చకు వచ్చింది. దక్షిణాది చిత్రాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న జాన్వీకి ఇదే సరైన అవకాశం కూడా. దీంతో ఈ ఆఫర్‌ను తిరస్కరించదనే నమ్మకంతో చిత్రయూనిట్ జాన్వీని సంప్రదించినట్లు తెలిసింది. అయితే, జాన్వీ ఇందుకు అంగీకరించిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్ అభిమానులు కూడా.. మరోసారి ‘శ్రీదేవి-ఎన్టీఆర్’ కాంబోను చూడాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తారక్, జాన్వీల కాంబినేషన్‌లో చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NTR30 చిత్రంలో జాన్వీ హీరోయిన్ అనే ప్రచారం జరిగింది. అది కూడా ఎంతవరకు వాస్తవమనేది తెలియరాలేదు. కానీ, ఈ కాంబోపై మాత్రం ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో కూడా జాన్వీ కపూర్.. ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తోందనే వార్తలు వస్తు్న్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమనేది అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తుంది.
View this post on Instagram
View this post on Instagram