అన్వేషించండి

Prasad Multiplex: ఆ రోత ‘రివ్యూ’లకు ఊహించని షాక్ - ప్రసాద్ మల్టీప్లెక్స్ నిర్ణయంపై నెటిజనులు హర్షం!

హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్స్ ఆవరణలో మూవీ రివ్యూలను నిషేధించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ ను జారీ చేసింది.

Prasad Multiplex: టాలీవుడ్ లో ప్రతీవారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సినిమాల రిలీజ్ రోజు ధియేటర్ల వద్వ రివ్యూల కోసం పదుల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ రెడీ ఉంటాయి. మొదటి ఆట ముగిసి ప్రేక్షకులు బయటకు రావడం ఆలస్యం సినిమా ఎలా ఉంది అంటూ ప్రేక్షకుల అభిప్రాయాన్ని తెలుసుకొని వాటిని క్షణాల వ్యవధిలో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా థియేటర్ల వద్ద ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఈ మధ్య ఈ యూట్యూబ్ రివ్వూల తీరు దారుణంగా తయారైంది. ఇలా థియేటర్ వద్దే రివ్యూలు ఇవ్వడంతో మిగతా ప్రేక్షకులకు ఇబ్బందికరంగా ఉండటమే కాకుండా హీరోల అభిమానుల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. పెద్ద హీరోల సినిమాల రోజు పరిస్థితి వర్ణణాతీతం. అందుకే ఇలాంటి వాటిన నియంత్రించడానికి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ కీలక నిర్ణయం తీసుకుంది.

మల్టీప్లెక్స్ ఆవరణలో నో రివ్యూలు..

కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటారు మేకర్స్. ఒక్క సినిమా మీద వందల మంది టెక్నీషియన్లు, కార్మికులు జీవితాలు ఆధారపడి ఉంటాయి. అయితే రిలీజ్ అయిన వాటిలో కొన్ని సినిమాలు ఆడతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. కొన్ని సినిమాలు మొదట్లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత పుంజుకుంటాయి. అయితే విడుదల అయిన రోజే ఇలా నెగిటివ్ రివ్యూలు ఇవ్వడంతో సినిమా కలెక్షన్లపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే అలాంటి రివ్యూలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ప్రసాద్ మల్టీప్లెక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ మల్టీప్లెక్స్ వద్ద ఎలాంటి రివ్యూలు తీసుకోవడానికి వీల్లేకుండా ఓ సర్క్యులర్ ను జారీ చేసింది. దీంతో రివ్యూలు ఇచ్చే యూట్యూబ్ ఛానళ్లకు షాక్ తగిలినట్లైంది. ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే అయినా చాలా మంది యూట్యూబ్ ఛానళ్ల వారికి మాత్రం ఇబ్బందే. అయితే, ఈ నిర్ణయంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేశారు. కొందరైతే పండుగ చేసుకుంటున్నారు. ఇక రోత రివ్యూలు ఉండవని సంబరపడుతున్నారు.

‘ఆదిపురుష్’ రోజు జరిగిన గొడవే కారణమా?

టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతున్నపుడు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర పదుల సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లు రివ్వూల కోసం వాలిపోతుంటాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ రోజు కూడా చాలా యూట్యూబ్ ఛానళ్లు ప్రేక్షకుల నుంచి రివ్యూలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువకుడు యూట్యూబ్ ఛానల్ తో ‘ఆదిపురుష్’ మూవీ గురించి నెగిటివ్ గా చెప్పడంతో అక్కడున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆ యువకుడిని చితకబాదారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకే ఇలాంటి గొడవలు జరగకూడదు అనే ఉద్దేశంతోనే ప్రసాద్ మల్టీప్లెక్స్ వారు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏదేమైనా ఇలాంటి రివ్యూలు ఇచ్చే చానళ్లపై నిషేదం విధించడం మంచిందే అంటున్నారు కొంతమంది నెటిజన్స్. మరి ప్రసాద్ మల్టీప్లెక్స్ వాళ్లు చేసినట్టు మిగతా థియేటర్లు కూడా మున్ముందు ఇలాంటి నిషేద చర్యలు చేపడతారేమో చూడాలి.

Also Read: ఆ విషయంలో ‘కార్తీకేయ-2’ను మించిపోయిన ‘స్పై’ - నిఖిల్ కెరీర్లోనే బెస్ట్!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today November 18th: 'గోదావరి' సీరియల్: మురళీ షాప్ రిబ్బన్ కట్ చేసిన సంజయ్, జాను! చెల్లిని అవమానించిన నందు!
'గోదావరి' సీరియల్: మురళీ షాప్ రిబ్బన్ కట్ చేసిన సంజయ్, జాను! చెల్లిని అవమానించిన నందు!
Nindu Manasulu Serial Today November 18th: నిండు మనసులు: గణ ఇంట్లో దీపావళి వేడుక! విజయానంద్‌ని జోకర్ చేసేసిన తండ్రీకొడుకులు!
నిండు మనసులు: గణ ఇంట్లో దీపావళి వేడుక! విజయానంద్‌ని జోకర్ చేసేసిన తండ్రీకొడుకులు!
Illu Illalu Pillalu Serial Today November 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్‌ని పోలీసులకు పట్టించిన నర్మద! ప్రేమ తింగరి పనికి బిజినెస్ అయినట్లే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్‌ని పోలీసులకు పట్టించిన నర్మద! ప్రేమ తింగరి పనికి బిజినెస్ అయినట్లే!
Mayasabha Series : పొలిటికల్ థ్రిల్లర్ 'మయసభ' న్యూ రికార్డ్ - ఇండియాలోనే ఫస్ట్ తెలుగు సిరీస్...
పొలిటికల్ థ్రిల్లర్ 'మయసభ' న్యూ రికార్డ్ - ఇండియాలోనే ఫస్ట్ తెలుగు సిరీస్...

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget