అన్వేషించండి

War 2 Release: ‘వార్ 2’ రిలీజ్ అప్పుడేనా? ఎన్టీఆర్ అభిమానులకు ఇది పెద్ద షాకే!

హృతిక్ రోషన్‌, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించబోతున్న చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ విడుదలపై మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్,  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’. యశ్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'వార్' సీక్వెల్ గా 'వార్ 2' తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ నవంబర్ 2023 నుంచి సెట్స్‌ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్రబృందం బిజీ అయ్యింది. ఇక ‘వార్ 2’ సినిమా విడుదలపైనా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి, 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. రిపబ్లిక్ డే వీకెండ్ భారీ వసూళ్లు సాధిస్తుండడంతో నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని అదే సమయంలో విడుదల చేయాలని భావిస్తున్నారట.  

నెగెటివ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్!

‘వార్ 2’ చిత్రంలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తుండగా, నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. 'వార్' సినిమాలో  హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. సినిమాలో ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. ఇద్దరూ పోటా పోటీగా నటించారు. చివరకు, టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ మరణించినట్టు చూపించారు. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. 'వార్' సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, 'వార్ 2'కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడంతో అభిమానులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘ఫైటర్’లో హృతిక్, ‘దేవర’లో ఎన్టీఆర్ బిజీ బిజీ

హృతిక్‌ రోషన్‌ ప్రస్తుతం 'వార్' ఫేమ్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఏరియల్ యాక్షన్ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తను నటిస్తున్న ‘దేవర’ హిట్ అవ్వాల్సిందే అని కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది.  

ఇప్పటికే ‘దేవర’ క్యాస్టింగ్‌తో ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ చిత్రంతో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మొదటిసారిగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.  తమిళ రాక్‌స్టార్ అనిరుధ్.. దేవరకు మ్యూజిక్‌ను అందిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే దసరా లాంటి కమర్షియల్ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన షైన్ టామ్ చాకో కూడా దేవరలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘దేవర’.. 2024 ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.    

Read Also: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్స్‌ లో అత్యధిక టీఆర్‌పీ సాధించిన ఫైనల్ ఎపిసోడ్ ఇదే!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget