అన్వేషించండి

Nani: 'హిట్' ఫ్రాంచైజీ - నాని పెద్ద ప్లానే వేశాడు!

హిట్ సినిమా ఫ్రాంచైజీ గురించి విశ్వక్ సేన్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా 2020లో వచ్చిన 'హిట్' చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'హిట్ 2'ని ఉంటుందని.. రిలీజ్ సమయంలోనే ప్రకటించారు. పార్ట్ 2లో కూడా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తారని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా అడివి శేష్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక హిట్ సినిమా ఫ్రాంచైజీలో హీరో మారడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. 

సూపర్ హిట్ సీక్వెల్ ని వదులుకోవడమంటే ఏ హీరోకైనా బాధే. ఈ విషయమై విశ్వక్ సేన్ స్పందించారు. 'హిట్2' సినిమా కూడా తనతోనే చేద్దామనుకున్నారని.. కానీ కాల్షీట్స్ తో ఇబ్బంది వచ్చిందని అన్నారు విశ్వక్. నాని అన్న కూడా ఒక్కో పార్ట్ ఒక్కో హీరోతో చేస్తే బావుంటుందని చెప్పినట్లు విశ్వక్ సేన్ గుర్తుచేసుకున్నారు. హిట్ ఫ్రాంచైజీ నుంచి ఎప్పుడు సినిమా వచ్చినా.. హీరో మారుతుంటారని వెల్లడించారు విశ్వక్ సేన్. 

అంతేకాదు.. ఈ ఫ్రాంచైజీతో నాని మరో మాస్టర్ ప్లాన్ వేశారు. హిట్ 2,3,4, సినిమాలు ఒక్కో హీరోతో తీసి.. ఆ హీరోలందరినీ కలిపి మరో సినిమా చేస్తాడట. అంటే.. ఓ భారీ మల్టీస్టారర్ కి ఇప్పటినుంచే రంగం సిద్ధం చేస్తున్నారన్నమాట. హిట్ కథకు, హిట్ 2 కథకు సంబంధం ఉందని.. హీరో క్యారెక్టర్లు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తారు. హిట్2లో మాత్రం అడివి శేష్ కూల్ అండ్ కామ్ గా కనిపిస్తారట. 

మొదటి భాగంలో విక్రమ్ రుద్రరాజు పాత్రలో విశ్వక్ సేన్ నటించగా.. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. రెండో భాగం మాత్రం ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో రానుంది. ఈ హిట్ 2లో కృష్ణదేవ్ అలియాస్ కేడీ అనే పోలీస్ ఆఫీసర్ గా అడివిశేష్ కనిపించనున్నారు. 

కాగా.. ఇటీవల 'మేజర్' సినిమాతో ప్రేక్షకులను అలరించారు అడివి శేష్. ఈ సినిమాలో అడివిశేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ముంబై ఉగ్రదాడుల్లో కన్నుమూసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శశికిరణ్ తిక్కా దర్శకుడు. 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ లాభాలను తీసుకొచ్చింది. మరి 'హిట్2'తో శేష్ కి ఎలాంటి హిట్ వస్తుందో చూడాలి!

Adivi Sesh Hit 2 to release on December 2: శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంత్ త్రిపిర్‌నేని 'హిట్2'ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. మొదట జూలైలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు డిసెంబర్ 2న సినిమా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అఫీషియల్ గా వెల్లడించింది.  

Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today Oct 27: మనీషాకు బిర్యానీ ముద్దపెట్టిన మాధవ్‌..బహుమతిగా మాధవ్‌ బుగ్గపై ముద్దుపెట్టిని మనీషా
పొదరిల్లు: మనీషాకు బిర్యానీ ముద్దపెట్టిన మాధవ్‌..బహుమతిగా మాధవ్‌ బుగ్గపై ముద్దుపెట్టిని మనీషా
Balakrishna Koratala Siva Movie: అనిరుధ్ కాదు... బాలయ్య - కొరటాల సినిమా సంగీత దర్శకుడిగా తెరపైకి కొత్త పేరు
అనిరుధ్ కాదు... బాలయ్య - కొరటాల సినిమా సంగీత దర్శకుడిగా తెరపైకి కొత్త పేరు
Gundeninda Gudigantalu Oct 27: బాలుపై శృతికి లేనిపోనివి ఎక్కించి చెప్పిన రోహిణి...తోడికోడలికి గట్టిగా బుద్ధి చెప్పిన డబ్బులమ్మ
గుండెనిండా గుడిగంటలు: బాలుపై శృతికి లేనిపోనివి ఎక్కించి చెప్పిన రోహిణి...తోడికోడలికి గట్టిగా బుద్ధి చెప్పిన డబ్బులమ్మ
Karthika Deepam 2 Serial Today October 27th: కార్తీకదీపం 2 సీరియల్: రాత్రి కలిసిన సూరజ్‌, జ్యోత్స్న! చెల్లి మీద దీప ఫైర్! సూరజ్ ఇంట్లో టైంకి జ్యోత్స్న!
కార్తీకదీపం 2 సీరియల్: రాత్రి కలిసిన సూరజ్‌, జ్యోత్స్న! చెల్లి మీద దీప ఫైర్! సూరజ్ ఇంట్లో టైంకి జ్యోత్స్న!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Cyclone Arnab Relief Number: అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు
అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
Embed widget