Hera Pheri 3: 'హేరా ఫేరి 3' సినిమాపై ఉత్కంఠ - సీరియస్ అవుతోన్న అక్షయ్ కుమార్ ఫ్యాన్స్!
'హేరా ఫేరి 3'లో కార్తీక్ ఆర్యన్ ఎంట్రీ ఇచ్చారనే విషయాన్ని పరేష్ రావల్ ధృవీకరించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
బాలీవుడ్ సినిమా 'హేరా ఫేరి' (2000) ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. మలయాళంలో వచ్చిన 'రాంజీ రావ్ స్పీకింగ్' సినిమాకు అది రీమేక్. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ హాస్య చిత్రం లో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ ప్రముఖ పాత్రల్లో నటించారు. 'హేరా ఫేరి' సినిమా బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. హిందీలో బెస్ట్ కామెడీ సినిమాలలో మొదటి వరుసలో ఉంటుంది.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో 2006లో 'హేరా ఫేరి 2' సినిమాను రూపొందించారు. సీక్వెల్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో కూడా అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ తమ తమ పాత్రలలో నటించారు. ఇప్పుడు 'హేరా ఫేరి 3' వస్తోంది. ఆ విషయాన్ని పరేష్ రావల్ ధృవీకరించారు. అయితే, అందులో అక్షయ్ కుమార్ ఉంటాడా? లేదా? అనే విషయంపై సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.
చాలా రోజులుగా 'హేరా ఫేరి 3' గురించి చర్చ జరుగుతోంది. ఈ ఫ్రాంచైజీ మూడవ భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్షయ్ కుమార్ 'ఆవారా పాగల్ దీవానా, వెల్‌కమ్, హేరా ఫేరీ' ఫ్రాంచైజీ చిత్రాలు త్వరలో ప్రారంభిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. గత నెలలో ఆయన దర్శక నిర్మాతలతో పలు సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే, ఇప్పుడు 'హేరా ఫేరి 3'లో యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ ఎంట్రీ ఇచ్చాడనే పెద్ద న్యూస్ బయటకు వచ్చింది. ఈ విషయాన్ని పరేష్ రావల్ ధృవీకరించారు. దాంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
'హేరీ ఫేరి 3లో కార్తీక్ ఆర్యన్ చేస్తున్నది నిజమేనా?' అని ట్విట్టర్‌లో ఒక అభిమాని ప్రశ్నించగా... పరేష్ రావల్ 'అవును నిజమే' అని సమాధానం ఇచ్చారు. అక్షయ్ కుమార్ స్థానంలో కార్తీక్ వచ్చాడా? లేదా అతనితో స్క్రీన్ పంచుకుంటాడా? అనేది ఆయన ఇంకా చెప్పలేదు. దాంతో అక్షయ్ కుమార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ''అక్షయ్ కుమార్ లేని 'హేరా ఫేరి' సినిమా ఏంటి?'' అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి మీమ్స్, ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి.
Also Read : థ్రిల్, రొమాన్స్, హారర్ - 'మసూద' ట్రైలర్ చూశావా కృష్ణా?
2000 లో వచ్చిన 'హేరా ఫేరీ' చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా, 2006 లో వచ్చిన రెండవ భాగం 'ఫిర్ హేరా ఫేరీ' నీరజ్ వోరా దర్శకత్వం వహించారు. దీని మూడవ భాగాన్ని ప్రియదర్శన్ మళ్లీ డైరెక్ట్ చేస్తారని, ఫిరోజ్ నడియాడ్ వాలా నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. 'హేరా ఫేరి' సిరీస్‌లో అక్షయ్ కుమార్‌తో పాటు సునీల్ శెట్టి, పరేష్ రావల్ ప్రధాన పాత్రలు పోషించారు. ముగ్గురూ చేసిన రాజు, శ్యామ్, బాబూరావు పాత్రలు బాగా పాపులర్ అయ్యాయి. మరి, 'హేరా ఫేరి3' అక్షయ్ కుమార్ కనిపిస్తారో? లేదో? చూడాలి.
Yes it’s true . https://t.co/JtdI4Yp2nb
— Paresh Rawal (@SirPareshRawal) November 11, 2022