Guppedanta Manasu January 23rd: దేవయాని కుట్ర, మళ్ళీ రంగంలోకి రాజీవ్- రిషిధార మరింత దూరం కాబోతున్నారా?
Guppedantha Manasu January 23rd Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

వసుధార జీవితాన్ని అల్లకల్లోలం చేసేందుకు రాజీవ్, దేవయాని మళ్ళీ కుట్రలు మొదలు పెట్టారు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా కాలేజీలోకి అడుగుపెట్టి రిషి ఎదురుపడుతుంది వసుధార. తను ఉండటం కోసం రిషి గౌతమ్ ఫ్లాట్ కీస్ జగతితో తనకి ఇప్పిస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా సౌకర్యాలు కల్పించాలి కాబట్టి ఈ కీస్ రిషి ఇమ్మన్నాడు అని జగతి అంటుంది. అవి తీసుకుని రిషి సర్ కి తనపై ఎంత శ్రద్ద అని మురిసిపోతుంది. కానీ జగతి మాత్రం ఆ ప్లేస్ లో పుష్ప ప్రాజెక్ట్ హెడ్ గా ఉన్నా ఇలాగే చేసేవారు అని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది. తను ఉండటానికి ఏర్పాటు చేసినందుకు థాంక్స్ చెప్పడానికి వసు రిషి దగ్గరకి వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో ఏముందంటే..
Also Read: గన్ ఫైర్- వంటలక్క, డాక్టర్ బాబు చనిపోతారా? 'కార్తీకదీపం' సీరియల్ కి 'శుభం' కార్డ్ ఇదేనా?
రిషి వసు దగ్గరకి వచ్చి థాంక్స్ చెప్తుంది. రిషి సర్ మనం మాట్లాడుకోవాలి అని వసు అంటుంది. ఆ మాటకి రిషి బాధగా మనం అనే మాట అనకు వినలేకపోతున్నా, మనం అనుకోవడం కరెక్ట్ కాదేమో అని కోపంగా అంటాడు. అసలు విషయం చెప్పడానికి రిషి వసుకి అవకాశమే ఇవ్వడు. దీంతో వసు బాధగా వెళ్లిపోతుంటే రాజీవ్ తన చెయ్యి పట్టుకుని ఆపుతాడు. వసు మన బంధం అప్పుడే తెగిపోలేదు, ఒకసారి నీకు పెళ్లైందని రిషి సర్ తో అన్నావ్ కదా అని రాజీవ్ అంటాడు. మనస్పూర్తిగానే ఈ పెళ్లి జరిగిందని పోలీస్ స్టేషన్ లో అన్న మాటలు వసు గుర్తు చేసుకుంటుంది. రిషి సర్ ని తన నుంచి దూరం చేయడం ఎవరి వల్ల కాదని వసు గట్టిగా బదులిస్తుంది.
శనివారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రిషి కాలేజీలో కూర్చుని పుష్పతో మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకుంటాడు. వసు భర్త ఎవరో చూశావా అని తనని అడుగుతాడు. పుష్ప తాను చూడలేదని చెప్తుంది కానీ అతనేవరో కానీ లక్కీ ఫెలో అంటుంది. ఆ మాటకి రిషి చాలా బాధపడతాడు. వసు తన ఇంట్లోనే ఉంటుందని వాళ్ళ నాన్న వస్తున్నాడని ఇల్లు వెతుక్కుంటుందని చెప్తుంది. దీంట్లో రిషి జగతికి ఫోన్ చేసి కాలేజీకి రమ్మని పిలుస్తాడు. గౌతమ్ ప్లాట్ కీస్ తనకి ఇచ్చి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ కి ఇవ్వమని చెప్తాడు. అవి తీసుకెళ్ళి జగతి వసుకి ఇస్తుంది. తను విషయం చెప్దామని అనుకుంటుంది కానీ జగతి కూడా వినిపించుకోదు. వసు వచ్చిందని తెలిసి దేవయాని రగిలిపోతుంది. వెళ్ళిపోతాడనుకున్న రిషి వెనక్కి వచ్చాడు, వసు కూడా వచ్చింది.. ఇద్దరూ మళ్ళీ ఒక్కటైపోతారా ఏంటి? పైగా రిషి జగతి కూడా కలిసిపోయేలా ఉన్నారు అనుకుంటూ దేవయాని రాజీవ్ కి కాల్ చేసి రప్పిస్తుంది.
Also Read: అల్లరి ప్రేమికుల గిల్లికజ్జాలు, వసు మాట అస్సలు వినిపించుకోని రిషి
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















