అన్వేషించండి

సమంతకు ఊహించని మరో కష్టం - తన మేనేజరే అలా చేసేసరికి షాక్‌లో సామ్?

సమంతకు టైమ్ అస్సలు బాగోలేదట. తాజాగా ఆమె మేనేజర్ చేసిన పనికి ఆమె మరోసారి షాక్‌లో ఉందట. ఇంతకీ ఏం జరిగింది?

సమంత త్వరలోనే ‘ఖుషీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సామ్.. ఆ వెంటనే అమెరికాకు చెక్కేసింది. మయోసైటీస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోడానికే సామ్ అమెరికా వెళ్లిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఆమె హాలీవుడ్ మూవీస్‌లో ఆడిషన్స్ కోసమే వెళ్లిందంటూ కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. అంతేగాక, ప్రస్తుతం ఈ టూర్‌లో ఉన్న సమంతకు ఊహించని షాక్ ఎదురైందని, ఆమె మేనేజరే ఆమెను మోసం చేశాడనే సమాచారం బయటకు వచ్చింది. 

రూ.కోటి మోసం?

ఇండస్ట్రీలో నటీనటుల ఆర్థిక లావాదేవీలన్నీ వారి మేనేజర్ల చేతిలోనే ఉంటాయి. పారితోషికాల గురించి కూడా వారే నిర్మాతలతో మాట్లాడతారు. అయితే, సమంత మేనేజర్ దీన్ని అవకాశంగా మలుచుకుని అవకతవకలకు పాల్పడ్డాడనే వార్తలు వస్తున్నాయి. సమంత డిమాండ్ చేసే పారితోషికం కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తూ వెనకేసుకుంటున్నాడని, ఈ విషయం తెలిసి ఆమె షాకైందని తెలిసింది. అమెరికాలో ఉన్నప్పుడే సామ్‌కు ఈ విషయం తెలిసిందట. అతడు సుమారు రూ.కోటి వరకు మోసం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ నిమిత్తం ఆమె తన అకౌంట్ డిటైల్స్ చెక్ చెయ్యగా ఈ విషయాలు బయటపడ్డాయని తెలిసింది. 

సమంత మేనేజర్ సుమారు పదేళ్లుగా ఆమె వద్ద పనిచేస్తున్నారు. ఆమెకు వచ్చే ఆఫర్లు నుంచి ఆర్థిక లావాదేవీలన్నీ మేనేజరే స్వయంగా చూసుకొనేవారు. అయితే, చాలామంది నిర్మాతలు ఆ మేనేజర్‌ను తీసేయాలని సమంతకు సూచించేవారట. పదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తిని తీసేయడం సాధ్యం కాదని ఆమె చెప్పేదట. ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ రూమర్స్‌లో నిజం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. నిజంగానే ఆమె మేనేజర్ ఆమెను మోసం చేశారా? లేదా కావాలనే ఎవరైనా ఈ వార్తను క్రియేట్ చేశారా అనేది సమంత స్పందిస్తేనే తెలుస్తుంది. 

‘ఖుషి’ సమంత రియల్ స్టోరీ కాదు

‘ఖుషి’ మూవీ సమంత రియల్ లైఫ్ స్టోరీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు శివ నిర్వాణ వివరణ ఇచ్చారు. సమంత 'ఫ్యామిలీ మ్యాన్' వంటి డిఫరెంట్ జానర్స్ చేసినా, ఇప్పుడు లవ్ స్టోరిలో సమంతను చూడటం మంచి ఫీల్ కలిగిస్తుందన్నారు. ‘ఖుషి’ సినిమా కథకు సమంత రియల్ లైఫ్ కు ఎలాంటి పోలికలు, సంబంధం లేదన్నారు. మూడేళ్ల క్రితం రాసుకున్న కథ ఇదని, ఆమెతో 'మజిలీ' సినిమా చేశాను కాబట్టి బాగా నటించగలదని ఇందులోకి తీసుకున్నామన్నారు. ‘‘నేను రాసిన కథలో ఆమె తన క్యారెక్టర్ ప్లే చేసింది అంతే. మరో హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తే ఇలాంటి ప్రశ్నలకు అవకాశం ఉండదు’’ అని శివ నిర్వాణ అన్నారు.

Also Read: నా సామిరంగ - ఈసారి సంక్రాంతికి 'బీడీలు' 3D లో కనిపిస్తాయేమో!?

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ మూవీ శుక్రవారం (సెప్టెంబరు 1) విడుదల కానుంది. మలయాళ నటుడు జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, ఆలీ, శరణ్య పొన్నవణ్నన్, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మేకప్ : బాషా, కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్ - హర్మన్ కౌర్ - పల్లవి సింగ్, కళా దర్శకత్వం : ఉత్తర కుమార్ - చంద్రిక, పోరాటాలు : పీటర్ హెయిన్, రచనా సహకారం : నరేష్ బాబు .పి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : దినేష్ నరసింహన్, కూర్పు : ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్, సంగీతం : హేషమ్ అబ్దుల్ వాహబ్, సి.ఇ.ఓ : చెర్రీ, ఛాయాగ్రహణం : జి. మురళి, నిర్మాతలు : నవీన్ యేర్నేని - రవిశంకర్ యలమంచిలి, కథ, కథనం, కొరియోగ్రఫీ, దర్శకత్వం : శివ నిర్వాణ.

టాప్ హెడ్ లైన్స్

Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget