అన్వేషించండి

NTRNeel Movie: ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్ మూవీ స్టోరీ ఇదే! - కొత్త పోస్టర్‌లోనే కథంతా చెప్పేశారు..

NTR31 Story: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ కి 'డ్రాగన్' టైటిల్‌ని పరిశీలిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.  

Jr NTR and Prashanth Neel NTR 31 Movie Story: ఎట్టకేలకు ప్రశాంత్‌ నీల్ - జూనియర్‌ ఎన్టీఆర్‌ మూవీ పట్టాలెక్కింది. నిన్న గప్‌చుప్‌గా NTR31 మూవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా.. ప్రశాంత్ నీల్ సతీసమేతంగా వచ్చారు. ఇక అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌, కళ్యాణ్‌ రామ్‌లు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రారంభోత్సవం వేడుకను పింపుల్‌గా నిర్వహించినా.. మూవీ అప్‌డేట్స్ మాత్రం మోతమోగేలా ఉన్నాయి.

2026లో రిలీజ్

ప్రాజెక్ట్‌ లాంచింగ్‌ రోజే మూవీ రిలీజ్‌ డేట్ ప్రకటించి సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ అందరిలో ఆసక్తిని పెంచింది. పోస్టర్ చూస్తే సింపుల్‌గానే ఉంది, కానీ..  కాస్తా పట్టి చూస్తే అసలు విషయం తెలుస్తోంది. డార్క్‌ థిమ్‌లో ఎన్టీఆర్‌-నీల్‌ అనే టైటిల్‌తో జనవరి 9, 2026లో సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పోస్టర్‌ బ్యాగ్రౌండ్‌ చూస్తే వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. దానిలో ఒకవైపు 1969 అని రాసుంది, దానికి కుడివైపు గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది.

పోస్టర్లోనే ఉంది కథంతా..

ఇక టాప్‌లో లెఫ్ట్ కార్నర్‌ చూస్తే చైనా, భూటాన్, బెంగాల్- కోల్‌కతా అని రాసుంది. ఇదంతా మూవీ కాన్సెప్ట్‌ అని అర్థమైపోతుంది. దీంతో ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్‌ మీడియా NTR3 స్టోరీలైన్ వైరల్‌ అవుతుంది.  అయితే గతంలో ప్రశాంత్‌ నీల్ ఓ ఇంటర్య్వూలో మూవీ గురించి మాట్లాడుతూ..‌ ఎన్టీఆర్‌తో సినిమా అనగానే అంతా ఇది ఓ యాక్షన్‌ మూవీ అయ్యింటుందని అనుకుంటున్నారు. కానీ, తాను ఈ సినిమాతో కొత్త జానర్‌ టచ్‌ చేశానని చెప్పారు. నిజానికి ప్రశాంత్‌ నీల్ సినిమాల బలం యాక్షన్‌, మైన్స్‌. కానీ ఈ ప్రాజెక్ట్‌లో తాను యాక్షన్‌ జోలికి వెళ్లాలి అనుకోవడం లేదన్నాడు. ఇది తనకు కొత్త కథ అంటూ చెప్పుకొచ్చాడు.NTRNeel Movie: ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్ మూవీ స్టోరీ ఇదే! - కొత్త పోస్టర్‌లోనే కథంతా చెప్పేశారు..

అందుకే డ్రాగన్ అనుకుంటున్నారా?

NTR31 కొత్త పోస్టర్‌ గమనిస్తే ఈ సినిమా చైనా, ఇండియాకు మధ్య సాగే కథాంశం అని తెలుస్తోంది.1969 ఓపియం మాఫియాకి రిలేట్ చేస్తూ.. డ్రగ్ మాఫియాలో ఎన్టీఆర్ డ్రగ్ లార్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. 1969 రోజుల్లో కలకత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్‌కి దగ్గరగా ఉండటంతో.. ఓపియం స్మగ్లింగ్ కి అడ్డాగా ఉండేదట, దాంతో ఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేదట.చూస్తుంటే ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని ప్రశాంత్‌ నీల్‌ తనదైన స్టైల్లో కథను రాసుకున్నాడట. చైనా డ్రగ్స్‌ మాఫీయా కోల్‌కాత్తాలో యాక్టివ్‌గా ఉండటం.. అక్కడ అక్కడ లోకల్స్‌ గ్యాంగ్స్‌కి, వీరికి తరచూ గోడవలు జరుగుతుంటాయి. ఈ లింకులు సౌత్ ఈస్ట్ ఆసియాకే కాకుండా యూరప్ వరకు విస్తరించాయి అంటారు.

ఇప్పుడు ఇదే పాయింట్‌తో ప్రశాంత్‌ NTR31 ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారని టాక్‌. ఈ కథలో చైనా ప్రమేయమే ప్రధానంగా ఉండటంతో ఈ సినిమాకు 'డ్రాగన్‌' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారట. దీనిపై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ లేకపోయినా..ఈ సినిమాకు 'డ్రాగన్‌' టైటిల్‌ అనుకుంటున్నట్టు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కథ ఇది తారపూర్‌ పవర్ స్టేషన్‌ నేపథ్యంలో సాగనుందంటూ మరో స్టోరీ లైన్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 1969లో భారత్‌లో ప్రారంభించిన తొలి అటామిక్‌ న్యూక్లియర్ పవర్ స్టేషన్ చూట్టూ ఈ కథ సాగుతుందని అంటున్నారు. రి దీనిపై క్లారిటీ రావాలంటే నెక్ట్స్‌ అప్‌డేట్‌ వరకు వేచి చూడాల్సిందే. 

Also Read: శోభితతో ఎంగేజ్‌మెంట్ తర్వాత ఫస్ట్‌టైం బయటకు వచ్చిన నాగ చైతన్య - రాజమండ్రి పెళ్లిలో చై సందడి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PBKS vs RCB: విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Simran: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP DesamAvesh Khan Game Changer vs RR | IPL 2025 లో లక్నోకు గేమ్ ఛేంజర్ గా మారిన ఆవేశ్ ఖాన్ | ABP DesamYashasvi Jaiswal Vaibhav Suryavanshi | భలే క్యూట్ గా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు | ABP Desm

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PBKS vs RCB: విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Simran: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
MI vs CSK: ముంబైతో మ్యాచ్.. సీఎస్కేదే ఫస్ట్ బ్యాటింగ్, రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే
ముంబైతో మ్యాచ్.. సీఎస్కేదే ఫస్ట్ బ్యాటింగ్, రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే
Kakinada DCCB Chairman: కాకినాడ డీసీసీబీ ఛైర్మ‌న్ గిరి కోసం ఎందుకంత పోటీ..? రేసులో టిడిపి, జనసేన నేతలు
కాకినాడ డీసీసీబీ ఛైర్మ‌న్ గిరి కోసం ఎందుకంత పోటీ..? రేసులో టిడిపి, జనసేన నేతలు
Malavika Mohanan: లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
Ponnam Prabhakar: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
Embed widget