Naga Chaitanya: శోభితతో ఎంగేజ్‌మెంట్ తర్వాత ఫస్ట్‌టైం బయటకు వచ్చిన నాగ చైతన్య - రాజమండ్రి పెళ్లిలో చై సందడి!
Naga Chaitanya: నటి శోభితతో ఎంగేజ్‌మెంట్ తర్వాత నాగ చైతన్య మొదటిసారి మీడియా కంటపడ్డాడు. రాజమండ్రిలోని తన పర్సనల్ అసిస్టెంట్ పెళ్లికి స్వయంగా హాజరై కొత్త జంటను ఆశీర్వదించాడు.
Naga Chaitanya Attends Assistant Marriage: అక్కినేని హీరో నాగ చైతన్య ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యాడు. సైలెంట్‌గా నటి శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికి షాకిచ్చాడు. నిజానికి వీరిద్దరి రిలేషన్ గురించి అందరికి తెలిసిందే. కానీ ఇది పెళ్లి వరకు వెళుతుందని ఎవరూ ఊహించలేదు. అంతేకాదు మళ్లీ సమంత-నాగచైతన్య కలుస్తారేమో! అని ఈ మాజీ జంట ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ అక్కినేని హీరో శోభితతో రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. అక్కినేని కుటుంబసభ్యులు, శోభిత ఫ్యామిలీ సమక్షంలో సింపుల్‌గా హీరో నాగార్జున ఇంట్లో చై-శోభితల నిశ్చితార్థం జరిగింది.
అయితే ఎంగేజ్‌మెంట్ తర్వాత ఫస్ట్‌టైం నాగ చైతన్య మీడియాకు ముందుకు వచ్చాడు. శోభితతో ఎంగేజ్‌మెంట్ జరగడం, ఆ వెంటనే నాగచైతన్య రాజమండ్రిలో సందడి చేశాడు. తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేష్ పెళ్లి సందర్భంగా చై ప్రత్యేకంగా రాజమండ్రి వెళ్లి మరి పెళ్లికి హాజరయ్యాడు. సందర్భంగా కొత్త జంటను ఆశీర్వాదించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కాగా ఆగష్టు 8న ఉదయం 9:42 నిమిషాలకు నాగచైతన్య-శోభితల నిశ్చతార్థం జరిగిందని, ఈ కొత్త జంటను ఆశీర్వదించాలంటూ నాగార్జున ట్వీట్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చాడు.
View this post on Instagram
అంతేకాదు ఎంగేజ్‌మెంట్ ఫోటోలు కూడా షేర్ చేశాడు. ఆ తర్వాత మెల్లిగా అక్కినేని ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ నాగ చైతన్య-శోభితలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ మరుసటి నిన్ని (శుక్రవారం) శోభిత, నాగ చైతన్యలు కూడా ఫోటోలు షేర్ చేసి విడిపోతాయనుకున్న తమ మనసులు కలిశాయంటూ శుభవార్త పంచుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీతో బిజీగా ఉన్నాడు. చివరిగా బంగార్రాజుతో హిట్ అందుకున్న చై వరుసగా ప్లాప్స్ చూశారు. అతడు నటించిన థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా, కస్టడీ ఇలా మూడు సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద ప్లాప్ అయ్యాయి.
View this post on Instagram
దీంతో ఈసారి భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై 'బన్నీ' వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య సరసన సాయి పల్లవి (Sai Pallavi) హీరోయినగా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమలో దేశభక్తి అంశాలతో పాటు రస్టిక్ లవ్ స్టొరీ ఉంటుందట.
Also Read: నేను సింగిల్ అని చెప్పానా? - పస్ట్‌టైం తన రిలేషన్‌షిప్ స్టేటస్ పై నోరు విప్పిన కీర్తి సురేష్