Pakka Commercial Title Song Glimpse: సిరివెన్నెల రాసిన 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్ గ్లింప్స్ వచ్చింది... చూశారా?
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'పక్కా కమర్షియల్'. టైటిల్ సాంగ్‌ను 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి రాశారు. ఆ గ్లింప్స్ నేడు విడుదల చేశారు.

'జన్మించినా... మరణించినా... ఖర్చే ఖర్చు' అని గోపీచంద్ అంటున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా 'పక్కా కమర్షియల్'. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌లో లిరిక్స్ అవి. పూర్తి పాటను ఫిబ్రవరి 2 (బుధవారం) విడుదల చేయనున్నారు. ఈ రోజు సాంగ్ గ్లింప్స్ విడుదల చేశారు.
'పక్కా... పక్కా... పక్కా... పక్కా కమర్షియల్' అంటూ దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన గీతమిది. జాక్స్ బిజాయ్ సంగీతం అందించారు. "మరణం గురించి ముందే తెలిసినట్టు సిరివెన్నెల గారు కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు" అంటూ ఆయన్ను గుర్తు చేసుకుని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. తన మనసుకు ఈ పాట చాలా దగ్గర అయ్యిందని ఆయన చెప్పారు. ఈ పాటను హేమచంద్ర, జేక్స్ బిజాయ్ ఆలపించారు.
Here's the title song glimpse of #PakkaCommercial, Full song out on Feb 2nd!🕺
— Geetha Arts (@GeethaArts) January 31, 2022
- https://t.co/HVtnVcFo6E
Lyrics #SirivennelaSeetharamaSastry garu📝
A @JxBe Musical🎶#AlluAravind @YoursGopichand @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas #KarmChawla @SKNonline @adityamusic pic.twitter.com/ExT9oOMbUK
యూవీ క్రియేషన్స్, జీఏ (గీతా ఆర్ట్స్) 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. 'బన్నీ' వాసు నిర్మాత. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. గతంలో గోపీచంద్‌కు జంటగా 'జిల్', 'ఆక్సిజన్' సినిమాల్లో ఆమె నటించారు. వీళ్లిద్దరి కలయికలో మూడో చిత్రమిది. ఈ సినిమాలో ఇద్దరూ లాయర్లుగా కనిపించనున్నారు. మారుతి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు యాక్షన్, కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయట. సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్, సహ నిర్మాత : ఎస్.కె.ఎన్, లైన్ ప్రొడ్యూసర్ : బాబు, ఎడిటింగ్ : ఎన్.పి. ఉద్భవ్, సినిమాటోగ్రఫీ : కరమ్ చావ్ల
A song close to my heart, written by guruji #SirivennelaSeetharamaSastry garu📝 #PakkaCommercial Title Song Glimpse - https://t.co/XI9w7iI7zR
— Director Maruthi (@DirectorMaruthi) January 31, 2022
A @JxBe Musical 🎶
Full song on Feb 2nd!#AlluAravind @YoursGopichand @RaashiiKhanna_ #BunnyVas #KarmChawla @SKNonline @adityamusic pic.twitter.com/Ll9zNN2qFP
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

