అన్వేషించండి

Matthew Perry: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు కన్నుమూత

సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. హాలీవుడ్ కమెడియన్‌ మాథ్యూ పెర్రీ చనిపోయారు. లాస్ ఏంజిల్స్‌ లోని తన ఇంట్లో శవమై కనిపించారు. అతడి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

గత కొంత కాలంగా సినిమా పరిశ్రమలో వరుస విషాద ఘటనలు జరుగుతున్నాయి. పలువురు ప్రముఖ నటీనటులు, దర్శకనిర్మాతలు, టెక్నీషియన్లు చనిపోతున్నారు. రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్ఆ‘ చిత్రంలో స్కాట్ దొరగా నటించిన హాలీవుడ్‌ నటుడు రే స్టీవెన్ సన్ కన్నుమూశారు. 58 ఏండ్ల వయసులో ఆయన హ‌ఠాన్మ‌ర‌ణం పొందారు.  షూటింగ్ లో ఉండగానే అస్వస్థతకు గురై చనిపోయారు. ఈ ఘటన మర్చిపోక ముందే మరో హాలీవుడ్ నటుడు చనిపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నబుల్లితెర నటుడు, నిర్మాత మాథ్యూ పెర్రీ తుదిశ్వాస విడిచారు. 54 ఏండ్ల వయసున్న ఆయన శనివారం సాయంత్రం లాస్ ఏంజిల్స్ లోని తన సొంత ఇంట్లోనే శవమై కనిపించారు. ఈ విషయాన్ని లాస్ ఏంజిల్స్ టైమ్స్ అధికారికంగా వెల్లడించింది.

గుండె పోటుతో మాథ్యూ పెర్రీ కన్నుమూత

మాథ్యూ ఇంట్లో పడి ఉన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. ఆయను పరిశీలించారు. అయితే, తను అప్పటికే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన మరణవార్తను కన్ఫామ్ చేశారు.  మ్యాథ్యూ పెర్రీ పడిపోయి ఉన్న ప్రదేశంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కూడా తీసుకుని ఉన్నారేమోనని పరిశీలించారు. కానీ, చివరకు తను డ్రగ్స్ తీసుకోలేదనే నిర్ణయానికి వచ్చారు. మాథ్యూ మృతికి గుండె పోటు కారణం అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక ఆయన మృతి వార్త తెలియడంతో ఆయన అభిమానులు, సినీ ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణిస్తున్నారు.

పెర్రీ ‘ఫ్రెండ్స్’ సిరీస్ తో  అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు

మాథ్యూ పెర్రీ ‘ఫ్రెండ్స్’ సిరీస్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1994 నుంచి 2004 వరకు 10 సీజన్ల పాటు ప్రసారం అయ్యింది. ఈ సిరీస్ లో మాథ్యూ చాండ్లర్ అనే పాత్రను పోషించారు. ఈ పాత్రతో తనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ సిరీస్ లో అద్భుత నటనకు గాను ఆయనకు రెండుసార్లు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ నామినేషన్‌ను అందుకున్నారు. దీంతో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు.  ‘ప్రెండ్స్’ సిరీస్ మాత్రమే కాదు, ‘స్టూడియో 60 ఆన్ ది సన్‌సెట్ స్ట్రిప్', 'గో ఆన్', 'ది ఆడ్ కపుల్' లాంటి టీవీ షోలతో బాగా పాపులర్ అయ్యారు. 'ది వెస్ట్ వింగ్' సిరీస్‌లో జో క్విన్సీ పాత్రకు గానూ అత్యుత్తమ గెస్ట్ యాక్టర్ గా 2003, 2004లో రెండు ఎమ్మీ నామినేషన్లు పొందారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Matthew Perry (@mattyperry4)

Read Also: చిరంజీవి సచిన్, పవన్ కల్యాణ్ విరాట్ కోహ్లీ, భలే చెప్పావయ్యా వరుణ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Balakrishna Surgery: బాలకృష్ణకు సర్జరీ... ఐదు వారాల విశ్రాంతి - లేటెస్ట్ హెల్త్ అప్డేట్
బాలకృష్ణకు సర్జరీ... ఐదు వారాల విశ్రాంతి - లేటెస్ట్ హెల్త్ అప్డేట్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
Godavari Serial Today July 22nd: 'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
Jabardasth Latest Promo: 'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
CPM West Bengal Revival: బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
Embed widget