అన్వేషించండి

SV Ramanan: దిగ్గజ దర్శకుడు, అనిరుద్ తాత రమణ్ కన్నుమూత, సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం!

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ రేడియో డబ్బింగ్ ఆర్టిస్ట్, సినీ దర్శకుడు ఎస్వీ రమణన్(87) కన్నుమూశారు. వయోభార సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.

తమిళ సినీ పరిశ్రమ టాలెంటెడ్ దర్శకుడిని కోల్పోయింది. రేడియో, సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమణ్ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా సోమవారం తెల్లవారు జామున ఆయన  కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రమణ్తం డ్రి సుబ్రహ్మణ్యం సైతం 1930, 1940లలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. ఆయన తండ్రి ప్రోత్సాహంతోనే ఆయన కూడా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టారు.   

రమణన్‌ తొలినాళ్లలో రేడియో నాటకాలకు సంగీత దర్శకుడిగా పని చేసేవారు. వేలాది రేడియో కార్యక్రమాలకు డబ్బింగ్ చెప్పారు. దర్శకుడిగా షార్ట్ ఫిలిమ్స్ చిత్రాలు రూపొందించారు. భక్తిరస డాక్యుమెంటరీలను తెరకెక్కించారు. భగవాన్‌ రమణమహర్షి, షిరిడి సాయిబాబా జీవిత విశేషాలతో డాక్యుమెంటరీలు రూపొందించారు. తమిళంలో ‘ఉరువంగళ్‌ మారలామ్‌’,  ‘విశ్వనాధన్‌ వేలైవేండుమ్‌’ అనే సినిమాలు ఈయన దర్శకత్వంలోనే  రూపొందాయి.  

1983లో మహేంద్రన్, సుహాసిని ప్రధాన పాత్రల్లో ‘ఉరువంగళ్‌ మారలామ్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో కమల్ హాసన్, రజనీ కాంత్ ఇద్దరూ గెస్ట్ రోల్స్ చేశారు. కొన్ని తమిళ సినిమాలకు సంగీతం కూడా అందించారు. .  తమిళ చిత్ర పరిశ్రమలో రమణన్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు దక్కించుకున్నారు. రమణ్ కు భామా అనే భార్య, సరస్వతి, లక్ష్మీ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో లక్ష్మిని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ సోదరుడు రవి రాఘవేంద్ర వివాహం చేసుకున్నాడు.

రమణన్ కుమార్తె లక్ష్మీ కుమారుడే యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్. ఎస్వీ రమణన్‌ అనిరుధ్‌ కు తాత అవుతారు. అనిరుధ్ కూడా తాత వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినీ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.  తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాలకు అనిరుద్ అద్భుతమైన సంగీతం అందించారు. తన తాత మరణించడంతో అనిరుద్ ఫ్యామిలీ శోకంలో మునిగిపోయింది. ఎస్వీ రమణన్‌ సోదరి ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మాసుబ్రమణ్యం. చైన్నైలోని రాజా అన్నామలైపురంలో నివసిస్తున్న రమణన్‌.. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం చనిపోయారు.  ఆయన అంత్యక్రియలు బీసెంట్‌నగర్‌ శ్మశాన వాటికలో జరిగాయి. ఈ వేడుకల్లో పలువురు సినీ, రాజకీయ రంగాలు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?

Also Read : 'మెగా'స్టార్ మాస్ రికార్డు - 'వాల్తేరు వీరయ్య' ఓటీటీ రైట్స్ ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today November 12th: నిండు మనసులు: సిద్ధూ ముందు తలదించుకున్న ప్రేరణ! అన్నాచెల్లెళ్లకి నిజం తెలుసని రచ్చ చేసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ ముందు తలదించుకున్న ప్రేరణ! అన్నాచెల్లెళ్లకి నిజం తెలుసని రచ్చ చేసిన విజయానంద్!
Anirudh Ravichander Kavya Maran Wedding : అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 12:అనసూయ,రామలింగం ప్రేమవిషయం విక్కీకి తెలిసిందా లేదా..?ఇప్పుడు రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?
నువ్వులేక నేను లేను: అనసూయ,రామలింగం ప్రేమవిషయం విక్కీకి తెలిసిందా లేదా..?ఇప్పుడు రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?
Gundeninda Gudigantalu Nov12:రోహిణిని షోరూమ్‌కు తీసుకెళ్తానన్న మనోజ్‌..తల్లీకొడుకుల బంధం తెంపుకుని వెళ్లమన్న ప్రభావతి
గుండెనిండా గుడిగంటలు: రోహిణిని షోరూమ్‌కు తీసుకెళ్తానన్న మనోజ్‌..తల్లీకొడుకుల బంధం తెంపుకుని వెళ్లమన్న ప్రభావతి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
Bharat Summit Congress vs BJP: భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
Jailer 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Anirudh Ravichander Kavya Maran Wedding : అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
Parivarthana Rajaneethi Party Launch: పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget