News
News
X

Family Man 2 Release: ‘ఫ్యామిలీ మ్యాన్-2’.. తెలుగు ప్రేక్షకులకు సమంత గుడ్ న్యూస్

సమంత అక్కినేని తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆమెకు మంచి పేరు తెచ్చిన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ సినిమా ఇక తెలుగులో కూడా చూడవచ్చని ఆమె ట్వీట్ చేశారు.

FOLLOW US: 

‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌సీరిస్‌తో సమంతా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ఈ హిందీ వెబ్‌సీరిస్‌లో సమంత రాజీ పాత్రలో జీవించింది. తమిళ ఈలం పోరాటయోధురాలిగా యాక్షన్ సన్నివేశాల్లోనూ ఇరగదీసింది. బోల్డ్ సీన్లలోనూ సహజంగా నటించి ఔరా అనిపించింది. అందుకే.. ఆమె దేశంలోనే ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్-IIFM’ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైంది. ‘ప్యామిలీ మ్యాన్’ సీరిస్‌ల్లో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు మనోజ్ బాజ్‌పేయ్ కూడా ఇదే విభాగంలో ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం గమనార్హం.

ఇన్ని రోజులు ‘ఫ్యామిలీ మ్యాన్-2’ కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్-1’ మాత్రమే తెలుగులో ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు.. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను కూడా తెలుగులో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సమంత బుధవారం గుడ్‌న్యూ్స్ చెప్పింది. ఈ వెబ్‌సీరిస్‌ను ఇకపై తెలుగులో కూడా వీక్షించవచ్చంటూ ట్వీట్ చేసింది. తమిళం, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ వెబ్‌సీరిస్ అందుబాటులో ఉందని, మిస్ కాకుండా చూడాలని సమంత కోరింది. 

‘ఫ్మామిలీ మ్యాన్’ సీరిస్.. స్పై-థ్రిల్లర్ డ్రామా. ఇందులో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో కనిస్తున్నారు. మనోజ్‌కు భార్యగా ప్రియమణి ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసింది. ఇందులో మనోజ్‌ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన ‘థ్రెట్ ఎనాలిసిస్ అండ్ సర్వేయిలన్స్ సెల్’లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తాడు. అంత రిస్కీ జాబ్ చేస్తూనే.. కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. పిల్లలకు తన జాబ్ గురించి తెలియకుండా జాగ్రత్తపడతాడు. తీవ్రవాదుల కుట్రలను భగ్నం చేయడం, వారితో పోరాటం వంటి యాక్షన్, థ్రిల్లింగ్ సీన్స్‌తోపాటు.. మనోజ్ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ సీరిస్‌లో డైలాగు, కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. సీజన్ 1లో తెలుగు నటుడు సందీప్ కిషన్ కూడా నటించాడు. సీజన్ 2లో సమంత కీలక పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. 

సమంతా ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి సరసన నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రియుడు విశ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ‘కాతు వాక్కులా రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే సినిమాను తీస్తున్నారు. ఇది ఒక ‘అన్యోన్యమైన’ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని టైటిల్‌ను బట్టి తెలుస్తోంది. ఇటీవల సమంత, నయన తార, విజయ్‌లు పబ్లిక్ ప్లేస్‌లో ఒకే బస్సులో ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తూ కనిపించారు. పద్ధతిగా చీర కట్టుకున్న నయన్, సమంతలతో సేతుపతి సైతం ఫుట్ బోర్డు‌పై నిలబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను కింది వార్తను క్లిక్ చేసి వీక్షించండి. 

Also Read: బస్సు ఫుట్‌బోర్డుపై.. నయన్, సమంత, విజయ్ సేతుపతి ప్రయాణం, వీడియో వైరల్

Published at : 25 Aug 2021 12:17 PM (IST) Tags: Family Man 2 in Telugu Family Man Season 2 in Telugu Family Man 2 Samantha in Family Man 2 ఫ్యామిలీ మ్యాన్ 2

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu Episde 23: హౌస్ టార్గెట్ ఇనయా, ఇలాగే అయితే ఇనయా ఆర్మీ రెడీ అవ్వడం ఖాయం, నామినేట్ అయింది వీళ్లే

Bigg Boss 6 Telugu Episde 23: హౌస్ టార్గెట్ ఇనయా, ఇలాగే అయితే ఇనయా ఆర్మీ రెడీ అవ్వడం ఖాయం, నామినేట్ అయింది వీళ్లే

Sanjay Dutt: ప్రభాస్, మారుతి సినిమా - సంజయ్ దత్ ఒప్పుకుంటారా?

Sanjay Dutt: ప్రభాస్, మారుతి సినిమా - సంజయ్ దత్ ఒప్పుకుంటారా?

Chiranjeevi Salmankhan: ఆ సత్తా సల్మాన్ కే ఉంది, అందుకే ‘గాడ్ ఫాదర్’ సెట్లో అడుగు పెట్టాడు: చిరంజీవి

Chiranjeevi Salmankhan: ఆ సత్తా సల్మాన్ కే ఉంది, అందుకే ‘గాడ్ ఫాదర్’ సెట్లో అడుగు పెట్టాడు: చిరంజీవి

Chiyaan Vikram: బాబోయ్ చియాన్, మన ఆలయాల నుంచి పిరమిడ్స్ దాకా, బాలీవుడ్ మీడియాకు క్లాస్ తీసుకున్న విక్రమ్!

Chiyaan Vikram: బాబోయ్ చియాన్, మన ఆలయాల నుంచి పిరమిడ్స్ దాకా, బాలీవుడ్ మీడియాకు క్లాస్ తీసుకున్న విక్రమ్!

Bigg Boss 6 Telugu: గలీజు దొంగని నేను అంటున్న ఆరోహి, గీతూ మాటతీరు ఇక మారదా సామి, నామినేషన్లో ఆ పదిమంది

Bigg Boss 6 Telugu: గలీజు దొంగని నేను అంటున్న ఆరోహి, గీతూ మాటతీరు ఇక మారదా సామి, నామినేషన్లో ఆ పదిమంది

టాప్ స్టోరీస్

Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, ఈ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, ఈ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Minister RK Roja : టీడీపీ జంబలకడిపంబ పార్టీ, ఆడవాళ్లు తొడలు కొడతారు మగవాళ్లు ఏడుస్తారు- మంత్రి రోజా

Minister RK Roja : టీడీపీ జంబలకడిపంబ పార్టీ, ఆడవాళ్లు తొడలు కొడతారు మగవాళ్లు ఏడుస్తారు- మంత్రి రోజా

Loan App Suicide : 'అమ్ము ఐ యామ్ సారీ, ఇంకా బతకాలని లేదు', లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి!

Loan App Suicide : 'అమ్ము ఐ యామ్ సారీ, ఇంకా బతకాలని లేదు', లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి!

NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!

NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!