అన్వేషించండి

వ్యక్తిత్వాన్ని మనమే సంపాదించుకోవాలి - పునీత్‌ను గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

కన్నడ స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక లో అత్యున్నత పురస్కారం అయిన 'కర్ణాటక రత్న' ను ప్రదానం చేసింది.

కన్నడ స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన 'కర్ణాటక రత్న'ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పునీత్ భార్య అశ్విని అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీ కాంత్, ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధా మూర్తి, నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడారు.. కర్ణాటక ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడ ప్రజలకు ‘కర్ణాటక రాజ్యోత్సవ’ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు. ‘‘నేను ఇక్కడికి అతిథిగా కాదు అప్పు స్నేహితుడిగానే వచ్చాను. ఎవరైనా కుటుంబ పెద్దల నుంచి ఇంటి పేరునో వారసత్వాన్నో పొందుతారు. కానీ వ్యక్తిత్వాన్ని మనమే సంపాదించుకోవాలి. అహంకారం లేని వ్యక్తిత్వం, ఎప్పుడూ చిరునవ్వుతో యావత్ రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. అందుకే ఈ అవార్డు ఆయనకు దక్కింది. అతని నవ్వులో ఉన్న సంపద ఇంకెక్కడా దొరకదు’’ అని అన్నారు. 

స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ కర్ణాటకలో గొప్ప సూపర్ స్టార్, ఒక గొప్ప కొడుకు, ఒక గొప్ప తండ్రి, ఒక గొప్ప ఫ్రెండ్ ఒక గొప్ప యాక్టర్, డ్యాన్సర్, సింగర్ వీటన్నిటికి మించి ఒక గొప్ప మానవతావాది  అని ఎన్టీఆర్ అన్నారు. తన ఉద్దేశంలో కర్ణాటక రత్న అంటే అర్థమే పునీత్ రాజ్ కుమార్ అని అన్నారు ఎన్టీఆర్. పునీత్ గురించి ఎన్టీఆర్ కన్నడలో మాట్లాడటం విశేషం. 

పునీత్ రాజ్ కుమార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ఈ అవార్డు ప్రదానోత్సవానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కార్యక్రమం మొదలైన కాసేపటికే అక్కడ జోరున వర్షం పడింది. పునీత్ పై ప్రేమతోనే వాన పడిందా అన్నట్లు మారింది అక్కడి వాతావరణం. అలాగే కార్యక్రమం ప్రారంభం అయింది.  ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో కూడా వర్షం పడుతూనే ఉంది. అయినా కార్యక్రమం అట్టహాసంగా సాగింది. 

పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించారు. పునీత్ రాజ్ కుమార్ ను క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మలో ప‌వ‌ర్ స్టార్, అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తన విలక్షణ నటన, వ్యక్తిత్వం తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పునీత్. ఐదేళ్ల వ‌య‌సులోనే పునీత్ సినీ రంగ ప్ర‌వేశం చేశారు. పునీత్‌ రాజ్‌కుమార్ 1976లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తండ్రి రాజ్ కుమార్‌తోనూ క‌లిసి న‌టించారు పునీత్. బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళు విరామం తీసుకున్నారు. తర్వాత 2002 లో 'అప్పు' సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు పునీత్. కేవలం సినిమాలతోనే కాకుండా  సేవా కార్యక్రమాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారు పునీత్ రాజ్ కుమార్.

Also Read: ఒక్క శుక్రవారం - ఐదుగురు అందగత్తెలకు అగ్ని పరీక్ష - హిట్ కొట్టేది ఎవరు? ఛాన్సలు పట్టుకునేది ఎవరు?

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today Oct 14: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
పొదరిల్లు: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Gundeninda Gudigantalu Oct 14: బాలును హత్య చేయించడానికి గుణ పథకం...కారు కీ తెచ్చి ఇవ్వాలంటూ రోహిణికి బెదిరింపులు
గుండెనిండా గుడిగంటలు: బాలును హత్య చేయించడానికి గుణ పథకం...కారు కీ తెచ్చి ఇవ్వాలంటూ రోహిణికి బెదిరింపులు
Meghasandesam Serial Today October 14th: ‘మేఘసందేశం’ సీరియల్‌: వంశీని కొట్టిన ఇందు – ఆకాష్‌ను పట్టించిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: వంశీని కొట్టిన ఇందు – ఆకాష్‌ను పట్టించిన అపూర్వ

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Embed widget