అన్వేషించండి

Dunki Movie: ‘డంకీ’ టీమ్ కీలక నిర్ణయం - వాళ్ల కోసం స్పెషల్ స్క్రీనింగ్

Dunki Movie: రాష్ట్రపతి భవన్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన ‘డంకీ‘ మేకర్స్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు దేశాల కాన్సులేట్స్ కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నారు.

Dunki Movie Special Screening For Consulates: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ఇప్ప‌టికే ‘పఠాన్‘, ‘జవాన్‘ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న ఆయన, తాజాగా ‘డంకీ‘ సినిమాతో హ్య‌ట్రిక్ హిట్ అందుకున్నారు. దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, మొదటి రోజు అంతగా కలెక్షన్స్ సాధించకపోయినా, నెమ్మదిగా జోరందుకున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నది.

కాన్సులేట్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్

ఇక ఇప్పటికే ఈ సినిమా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్ లో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు మేకర్స్. రాష్ట్రపతి భవన్ లోని సిబ్బంది కోసం ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ లోని అన్ని దేశాలకు చెందిన కాన్సులేట్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 28న ఢిల్లీలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, వియత్నాం, మలేషియా, థాయ్ లాండ్, స్పెయిన్, టర్కీ, నెదర్లాండ్స్ సహా పలు దేశాలకు చెందిన కాన్సులేట్ జనరల్స్ ఈ ప్రదర్శనకు హాజరుకానున్నారు. అక్రమ వలసలను హైలెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే కాన్సులేట్స్ కు ఈ మూవీ చూపించాలని మేకర్స్ నిర్ణయించారు.   

‘డంకీ‘ సినిమా గురించి..

ఒకదేశం నుంచి మరొక దేశానికి అక్రమంగా ఎలా ప్రయాణిస్తారు అనేది ‘డంకీ‘ సినిమాలో చూపించారు మేకర్స్. ఈ చిత్రంలో తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించింది. విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్‌ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను తొలిసారి  స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు. అభిజత్ జోషి, కనికా ధిల్లాన్‌ స్క్రీన్‌ ప్లే రాశారు. రాజ్‌ కుమార్ హిరానీ ఫిల్మ్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ సమర్పిస్తోంది. ప్రీతమ్ సంగీతం అందించారు. డిసెంబర్ 21న థియేటర్లలోకి అడుగు పెట్టిన ఈ సినిమా ప్రభాస్ ‘సలార్‌‘తో  పోటీ పడుతోంది. అయితే, ‘డంకీ‘తో పోలిస్తే ‘సలార్‘ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వసూళ్ల పరంగానూ ‘సలార్’ దూసుకెళ్తోంది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @srking_tr

Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Vadhandhi 2 Series Trailer : మృగాన్ని మించిపోయేలా బ్రూటల్ మర్డర్స్ - అసలు నిందితుడు ఎవరు?... ఓటీటీలోకి అవెయిటెడ్ థ్రిల్లర్ సిరీస్
మృగాన్ని మించిపోయేలా బ్రూటల్ మర్డర్స్ - అసలు నిందితుడు ఎవరు?... ఓటీటీలోకి అవెయిటెడ్ థ్రిల్లర్ సిరీస్
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug1st: రెస్టారెంట్‌లో రాధ కసి ఎలా తీర్చుకుంది...? ఫ్యాంట్‌ లేకుండా విక్కీ ఇంటికి ఎందుకు వచ్చాడు..?
నువ్వులేక నేను లేను: రెస్టారెంట్‌లో రాధ కసి ఎలా తీర్చుకుంది...? ఫ్యాంట్‌ లేకుండా విక్కీ ఇంటికి ఎందుకు వచ్చాడు..?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!
Rashmika : రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Embed widget