Devi sri Prasad: ఆ సినిమా కోసం అరగంటలో ఆరు పాటలు కంపోజ్ చేసిన డీఎస్పీ
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే పలు చిత్రాల్లో సూపర్ హిట్స్ సాంగ్స్‌తో తన కంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించిన డీఎస్పీ.. అర గంటలో 6 పాటలు కంపోజ్ చేసి ఆశ్చర్యపరిచాడట.

అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఆ పాటలతో పాన్ ఇండియా స్థాయి సంగీత దర్శకుడు అయిపోయారు దేవి శ్రీ ప్రసాద్. ఆయన సంగీత దర్శకత్వం వహించిన ఖిలాడి సినిమా శుక్రవారం విడుదల కానుంది. అందులో ఉన్న ఆరు పాటలను కూడా దేవి శ్రీ కేవలం అరగంటలోనే కంపోజ్ చేశారు. ఈ విషయాన్ని ఖిలాడి సినిమా దర్శకుడు రమేష్ వర్మ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన సినిమా ప్రి రిలీజ్ వేడుకలో దర్శకుడు మాట్లాడుతూ ‘కథ చెప్పిన వెంటనే రవితేజ ఒప్పుకున్నారని అందుకు ఆయనకు థ్యాంక్స్’ అని చెప్పారు. అలాగే డీఎస్పీ గురించి చెబుతూ ‘ఈ సినిమాకు సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ విషయానికి వస్తే... ఆయన కేవలం అరగంటలోనే అన్ని పాటలు కంపోజ్ చేసి ఇచ్చేశారు’ అని అన్నారు. అరగంటలో ఆరు పాటలు ఇచ్చేశారా అని ఇప్పుడు సినీ అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. అంటే ఒక్కో పాటకు కంపోజ్ చేయడానికి కేవలం అయిదు నిమిషాల సమయాన్నే డీఎస్పీ తీసుకున్నారు. ఇప్పుడు తెలుగుతో టాప్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు దేవి శ్రీ.
దేవి శ్రీ చేతుల్లో నిండుగా సినిమాలు ఉన్నాయి. భారీ చిత్రాలకు ఆయన సంగీతం అందించే పనిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’, చిరంజీవి 154వ సినిమాకు, పుష్ప పార్ట్ 2కు, వెంకీ-వరున్ తేజ్ నటిస్తున్న ఎఫ్ 3కు, రామ్ పోతినేని నటిస్తున్న ‘ది వారియర్’కు, శర్వానంద్ సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాకు సంగీతం అందించే పనిలో బిజీగా ఉన్నారు.
View this post on Instagram
Also read: రవితేజ మాటలకు అర్థాలు వేరులే! అసలు మేటర్ అదేనా!?
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















