Pooja Hegde: అంత రేటా? పూజా హెగ్డే బికినీ రేటు యమా ఘాటు!
మాల్దీవుల్లో పూజా హెగ్డే బికినీలో సేద తీరుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు కదా! ఆ బికినీ (మోనోకినీ) రేటు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
సినిమా తారలు ఏం చేసినా విశేషమే. ఏం ధరించినా ఆశ్చర్యమే! స్టార్స్ వేసుకున్న డ్రస్ దగ్గర నుంచి చేతికి పెట్టుకున్న వాచ్ వరకూ... ప్రతిదాన్ని ప్రేక్షకులు గమనిస్తారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ధరించిన సింగల్ పీస్ బికినీ... మోనోకినీ మీద కొందరి దృష్టి పడింది. దాని రేటు గురించి తెలుసుకుని కొంత మంది నెటిజన్స్ 'ఔరా' అంటూ నోరెళ్లబెడుతున్నారు.
View this post on Instagram
ప్రస్తుతం పూజా హెగ్డే మాల్దీవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. రోమ్‌లో రోమన్‌లా ఉండాలని అంటారు కదా! అలా... బీచ్ ఏరియాలో ఉన్నప్పుడు చాలా మంది బికినీల్లో ఎంజాయ్ చేస్తారు. పూజా హెగ్డే కూడా అలాగే బికినీల్లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందులో బ్రౌన్ కలర్ మోనోకినీ డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఆ మోనోకినీ ఖరీదు 50 వేల రూపాయలకుపైమాటే అట. స్టార్ హీరోయిన్ అన్నాక ఆ మాత్రం రేటు పెట్టి కొనడంలో వింత ఏమీ లేదు. కానీ, సామాన్యులకు మాత్రం ఆ రేటు ఘాటు అనే చెప్పాలి.
View this post on Instagram
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజా హెగ్డే... సంక్రాంతికి 'రాధే శ్యామ్'తో రానున్నారు. ప్రభాస్ సరసన తొలిసారి ఆమె నటించిన ఆ సినిమా జనవరి 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Also Read: పునీత్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటకరత్న' అవార్డుతో సత్కారం..
Also Read: జనవరిలో సెట్స్ మీదకు సాయి తేజ్... అప్పటి నుంచి SDT15 షూటింగ్?
Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'
Also Read: లాయర్లతో రవితేజ మంతనాలు... సెక్షన్ల గురించి ఆరా తీస్తున్న మాస్ మహారాజ్
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి