అన్వేషించండి

Sandeep Reddy Vanga: ‘యానిమల్‘ 3 కోసం సందీప్ వంగా ప్లాన్, ‘యానిమల్ పార్క్’ మొదలయ్యేది అప్పుడే!

Sandeep Vanga: సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్‘ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ‘యానిమల్2‘పై క్లారిటీ ఇచ్చారు. ‘యానిమల్ 3‘ కోసం ప్లాన్ చేస్తున్నారట.

Sandeep Reddy Vanga: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్,’అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన చిత్రం ‘యానిమల్‘. డిసెంబర్ 1న విడుదల అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్లు అనిల్ కపూర్, బాబీ డియోల్  కీలక పాత్రలు పోషించారు. అనిల్ కపూర్ రణబీర్ తండ్రిగా కనిపించగా, బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. టీజర్, ట్రైలర్స్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా విడుదలయ్యాక మరింత దుమ్మురేపింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా అద్భుతవిజయాన్ని అందుకుంది. మూవీపై కొన్ని విమర్శలు వచ్చినా, వసూళ్ల పరంగా సత్తా చాటింది. ఇప్పటికే ఈ మూవీ రూ. 835 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది.

‘యానిమల్ 3‘ కోసం ప్లాన్ చేస్తున్న సందీప్ వంగా

‘యానిమల్‘ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ‘యానిమల్ 2‘ను ప్రకటించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా ‘యానిమల్ పార్క్‘ పేరుతో రూపొందనున్నట్లు తెలిపారు. 2026లో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ‘యానిమల్ 3‘ కోసం ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అనే అంశంపై ఎలాంటి క్లారిటీ లేదు. ‘యానిమల్ పార్క్‘ సెట్స్ మీదకు రాకముందే, ప్రస్తుతం ఆయన కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయాల్సి ఉంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాలు చేయనున్నారు. ప్రభాస్ తో కలిసి ‘స్పిరిట్‘ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 2024లో ప్రారంభం కానుంది. అటు అల్లు అర్జున్ తోనూ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అనే విషయం ఇప్పటికీ అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో ‘యానిమల్ 3‘ ఎప్పుడు అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ‘యానిమల్ పార్క్‘ సక్సెస్ మీద ఆధారపడి ‘యానిమల్ 3‘ ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది.     

యానిమల్ మూవీ గురించి..

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్ తో కూడిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న విడుదల అయ్యింది. ఈ మూవీపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఈ సినిమాలో ఎక్కువగా బోల్డ్ సీన్స్ తో పాటు మితిమీరిన వైలెన్స్ ఉందనే విమర్శలు వినిపించాయి. పార్లమెంట్ లోనూ ఈ సినిమాపై చర్చ జరిగింది. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి మంచికంటే కీడే ఎక్కువ జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

Read Also: కథ వినకుండానే నో చెప్పాడు, విజయ్ దళపతిపై దర్శకుడు లింగుస్వామి షాకింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today July 28th:ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న మాధవ్‌,కేశవ్‌, కన్నా....దీనికి మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటి..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న మాధవ్‌,కేశవ్‌, కన్నా....దీనికి మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటి..?
Jana Nayagan Collections: సోమవారం వచ్చింది పది కోట్లే... ఐదు రోజుల్లో 'జన నాయకుడు' టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
Jana Nayagan Five Days Collection: బాక్సాఫీస్‌లో విజయ్‌కు ఎదురీత... ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Brahmamudi Serial Today July 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, మదన్ మధ్య గొడవ – శశికి పడిపోయిన ఐషు
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, మదన్ మధ్య గొడవ – శశికి పడిపోయిన ఐషు
Nuvvu leka Neanu Lenu Serial Today July 28th:హాల్‌లో చాపమీద పడుకున్న విక్కీ....తిట్టి రాధ గదిలోకి పంపించిన సునంద
నువ్వులేక నేను లేను: హాల్‌లో చాపమీద పడుకున్న విక్కీ....తిట్టి రాధ గదిలోకి పంపించిన సునంద

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget