అన్వేషించండి

N Lingusamy: కథ వినకుండానే నో చెప్పాడు, విజయ్ దళపతిపై దర్శకుడు లింగుస్వామి షాకింగ్ కామెంట్స్

N Lingusamy: నటుడు విజయ్ దళపతి గురించి దర్శకుడు ఎన్ లింగుస్వామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ సినిమాకు సంబంధించి తన కథను వినకుండానే నో చెప్పాడని వెల్లడించారు.

N Lingusamy On Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో ‘లియో‘ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోకపోయినా కలెక్షన్స్ పరంగా అదుర్స్ అనిపించింది. ఆయన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఎన్ లింగుస్వామి విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2006లో తన హిట్ మూవీ కథను వినకుండానే రిజెక్ట్ చేసినట్లు వెల్లడించారు.

కథ వినకుండానే నో చెప్పిన విజయ్

రీసెంట్ గా దర్శకుడు లింగుస్వామి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ తో ‘సండకోజి‘ కథ గురించి డిస్కస్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కథను తొలుత జ్యోతికకు, ఆ తర్వాత విజయ్ కి చెప్పాలని భావించినట్లు వెల్లడించారు. “ఒకరోజు సమయం చూసుకుని విజయ్ కి కథ చెప్పడానికి వెళ్లాను. తన పాత్ర గురించి చెప్పాను. ఫస్ట్ భాగంలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో వివరించాను. అయితే, రెండో భాగం గురించి వినకుండానే ఆయన నో చెప్పారు. అంతేకాదు, ఈ స్ర్కిప్ట్ తనకు నచ్చలేదని, ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం లేదని చెప్పారు. కథ పూర్తిగా వినాలని నేను పట్టుబట్టినా తను అంగీకరించలేదు. వేరే కథ ఉంటే చెప్పాలన్నారు. నేను సెకెండ్ ఆఫ్ వినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాను” అని లింగుస్వామి వెల్లడించారు.

విశాల్ హీరోగా తెరకెక్కిన ‘సండకోజి‘

విజయ్ తిరస్కరించిన కథతోనే వేరే హీరోతో సినిమా చేయాలని భావించినట్లు లింగుస్వామి తెలిపారు. కొద్ది రోజుల తర్వాత విశాల్ హీరోగా ‘సండకోజి‘ సినిమాను తెరకెక్కించినట్లు చెప్పారు. ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. రాజ్ కిరణ్, లాల్. బాలు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. విశాల్ కెరీర్ కు ఈ మూవీ మైల్ స్టోన్ గా నిలవడంతో పాటు ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘సండకోజి‘ నిలిచింది. 2009లో ఈ సినిమా కన్నడలో ‘వాయుపురా’ పేరుతో రీమేక్ చేయబడింది. అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

‘దళపతి 68’ షూటింగ్ లో విజయ్ ఫుల్ బిజీ

ప్రస్తుతం విజయ్ దళపతి వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘దళపతి 68’ పేరుతో ఈ మూవీ  తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది(2024) జనవరి 1న టైటిల్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో విడుదల తేదీని కూడా ప్రకటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, జయరామ్, యోగి బాబు, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.   

Read Also: రణబీర్ వీడియో TO దీపిక వావ్‌ - 2023లో బాలీవుడ్ స్టార్స్ టాప్ 10 వైరల్ ఇన్‌స్టా పోస్ట్‌ లు

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju First Review: కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ... వరుణ్ తేజ్ సినిమా సెన్సార్ టాక్, ఇన్‌సైడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ... వరుణ్ తేజ్ సినిమా సెన్సార్ టాక్, ఇన్‌సైడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget